వార్తలు

ఆర్థిక శాఖకు వన్నె తెచ్చిన రోశయ్య

0
rosaiah death news

Niranjan Reddy Pay Tributes To Konijet Rosaiah  ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మృతి చెందారు. డీపీ డౌన్ కావడంతో రోశయ్యను ఆస్పత్రికి తీసుకెళ్లే మార్గ మధ్యంలోనే తుదిశ్వాస విడిచారు. రోశయ్య మృతితో రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇక రోశయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. రోశయ్య అంటేనే ఆర్థిక శాఖ గుర్తుకు వస్తుందని అన్నారు నిరంజన్ రెడ్డి. ఆ శాఖకు ఎనలేని కీర్తి తీసుకొచ్చారని అన్నారు. సౌమ్యుడిగా, నిరాడంబరుడిగా జీవించి అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

rosaiah died

Konijet Rosaih Died 1933, జూలై 4న గుంటూరు జిల్లాలో వేమూరు గ్రామములో ఆదెమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించిన రోశయ్య సుదీర్ఘ రాజకీయ జీవితం అనుభవమున్న నేత. కాంగ్రెస్ లో కీలక పదవులు చేపట్టి సీఎంగా, గవర్నర్ గా తన మార్క్ చూపించారు. తన రాజకీయంలో ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోని రోశయ్య అందరితో స్నేహంగా ఉండేవారు. అయితే కొంతకాలంగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోశయ్య నిన్న బిపి డౌన్ అవ్వడంతో ఆరోగ్యం శృతిమించి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. Rosaiah Political History

Leave Your Comments

మాజీ ముఖ్య‌మంత్రి రోశ‌య్య మృతి

Previous article

మిద్దె తోటలో తీగ జాతి కూరగాయలు

Next article

You may also like