ఆంధ్రప్రదేశ్

Subsidy on Seeds: సబ్సిడీపై విత్తనాలు అందజేస్తున్న ప్రభుత్వం

2
80 Percent Subsidy on Seeds
80 Percent Subsidy on Seeds

Subsidy on Seeds: ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో మొదట వర్షాభావం వెంటాడిన తరువాత కురిసిన వర్షాలకు రైతులు విత్తనాలను వేసారు. ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు ఎదురుఆవుతున్న నేపధ్యంలో ప్రభుత్వం రైతులకు కొన్ని చర్యలను చేపట్టింది. 80 శాతం సబ్సిడీపై విత్తన పంపిణీకి శ్రీకారం చుట్టింది. అదే విధంగా 30 వేల క్వింటాళ్ల వరి విత్తనాలతో పాటు లక్ష క్వింటాళ్ల అపరాలు, చిరుధాన్యాల విత్తనాలను సిద్ధం చేసింది.

అధిక వర్షాలతో నారుమడులు, నాట్లుతో దెబ్బతిన్న పలు జిల్లాల రైతులకు వరి విత్తనాలు పంపిణీ చేస్తోంది. అలాగే రాయలసీమలో అపరాలు, చిరుధాన్యాల విత్తనాలను అందిస్తోంది. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.98.92 కోట్లు ఖర్చు చేస్తోంది. అయితే ఊహించని రీతిలో జూన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. జూలైలో కురిసిన వర్షాలతో కాస్త ఊపిరి పీల్చుకున్నప్పటికీ ఆగస్టులో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు కాస్త ఇబ్బంది కరంగా మారుతున్నాయి.

ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధం

గతంలో ఇవే పరిస్ధితులు ఎదురైనప్పుడు రైతుల నుంచి వచ్చిన డిమాండ్‌ మేరకు రాయలసీమలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక కింద ఉలవలు, అలసందలు, పెసలు, మినుములు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగుల విత్తనాలను అందించారు. ఇలా 2018–19 సీజన్‌లో 63,052 క్వింటాళ్లు, 2019–20 సీజన్‌లో 57,320 క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేశారు.

Also Read: రైతుల సౌలభ్యం మరియు సబ్సిడీ పథకాలు”.!

Seeds In Agriculture

Seeds In Agriculture

ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు విత్తనాలు (Seeds) కోసం ఇబ్బంది పడకుండా లక్ష క్వింటాళ్ల విత్తనాలను ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధం చేసింది. మరోవైపు అధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్న జిల్లాలో రైతుల కోసం తక్కువ కాలపరిమితి కలిగిన ఎంటీయూ–1121, ఎంటీయూ–1153, బీపీటీ–5204, ఎన్‌ఎల్‌ఆర్‌– 34449, ఎంటీయూ–1010 రకాలకు చెందిన 30 వేల క్వింటాళ్ల వరి విత్తనాన్ని ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచారు.

ఉత్పత్తులకు విలువ చేకూర్చడం

వ్యవసాయాన్ని లాభసాటిగా అంతర్జాతీయ పోటీని తట్టుకునే ట్లుగా చేసి,ఆంధ్రప్రదేశ్ రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని ప్రభుత్వ ఆశయమని అధికారులు అన్నారు. ఎక్కువ గిరాకీ ఉన్న సేవలను రైతులకు అందించి, ప్రకృతి సమతుల్యతకు నష్టం కలగకుండా వ్యవసాయాన్ని జీవనోపాధి నుంచి వ్యాపారాత్మకంగా చేసుకునేందుకు చేయూత నిచ్చి తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడం.

విభిన్న పంటలను ప్రోత్సహించడం, ఉత్పత్తులకు విలువ చేకూర్చడం మరియు కావలసిన మార్కెట్ సదుపాయాలను కల్పించడం ద్వారా అంతర్జాతీయ పోటీని తట్టుకునే లాభసాటి సుస్థిర వ్యవసాయాన్ని రూపొందించడం ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. వ్యవసాయరంగ అభివృద్ధిలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొనేందుకు కావలసిన ప్రణాళికలను ,సూచనలను తయారు చేసేందుకు గాను వ్యవసాయ శాఖకు కావలసిన నిర్దిష్టమైన విధి విధానాన్ని రూపొందించి దిశా నిర్దేశకాలను నిర్ణయిస్తుంది.

Also  Read: “ఆహార భద్రతను గుర్తించడానికి, ఆరోగ్యంపై ప్రభావాలను తగ్గించడానికి ఒక నవచిత్ర సంశోధన”

Leave Your Comments

Chilli Cultivation: మిరప పంటను ఇలా సాగు చేస్తే రైతులకి మంచి దిగుబడి వస్తుంది…

Previous article

Integrated Farming: సమగ్ర వ్యవసాయం చేయడం వలన రైతులకు ఎలాంటి లాభాలు వస్తాయి.!

Next article

You may also like