Agriculture sector functioned smoothly during lockdown మహమ్మారి కోవిడ్ యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ఆర్ధిక వ్యవస్థ కుదేలైపోయింది. కానీ కరోనా సమయంలో ప్రపంచాన్ని ఆదుకుంది కేవలం రైతు మాత్రమే. రైతే లేకపోతే కరోనా సమయంలో ఆకలి చావులు చూడాల్సి వచ్చేది. అయితే తాజాగా పార్లమెంట్ సమావేశాల్లో కరోనా ప్రభావం రైతులపై ఎంతమేర పడిందన్న అంశం తెరపైకి వచ్చింది. వ్యవసాయ కుటుంబాలపై COVID-19 మహమ్మారి ప్రభావాన్ని ప్రభుత్వం అంచనా వేసిందా అని ప్రశ్నించారు కాంగ్రెస్కు అధ్యక్షుడు రాహుల్ గాంధీ. అయితే రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. COVID-19
వ్యవసాయ కుటుంబాలపై కోవిడ్-19 మహమ్మారి ప్రభావంపై లోక్సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ Narendra Singh Tomar సమాధానమిస్తూ.. వ్యవసాయ రంగం సజావుగా పనిచేస్తోందని, వ్యవసాయం సజావుగా జరిగేలా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుందని అన్నారు. వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ప్రభుత్వం సఫలీకృత చర్యలు తీసుకుందని చెప్పారు. ఫార్మింగ్, అనుబంధ కార్యకలాపాలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చామని అయన అన్నారు.
విత్తనం, ఎరువులు, పురుగుమందులు, డీలర్లు, దుకాణాలు మరియు ఇతర ఇన్పుట్ సంబంధిత కార్యకలాపాలు రైతులకు అందుబాటులో ఉంచామని మంత్రి తెలిపారు. వ్యవసాయ యంత్రాలు ప్రత్యేకంగా హార్వెస్టర్లను వినియోగించడం ద్వారా అంతర్రాష్ట్ర ఎగుమతి సులభతరం అయిందన్నారు తోమర్. కాగా…నవంబర్ 29న ప్రారంభమైనశీతాకాల పార్లమెంట్ సమావేశాలు డిసెంబర్ 23 వరకు కొనసాగుతాయని నరేంద్ర తోమర్ తెలిపారు. Parliament Session 2021