యంత్రపరికరాలు

Agriculture Equipments: అగ్రికల్చర్ యంత్రాలు మరియు వాటి ఉపయోగాలు

1
Farm Equipment
Farmer in tractor preparing farmland with seedbed for the next year

Agriculture Equipments: జనాభా పెరుగుతుండటంతో ఆహార పదార్థాలకు విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. ఆ డిమాండ్‌కు అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడంలో టెక్నాలజీ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది.గడిచిన కొన్ని దశాబ్దాల కాలంలో సాంకేతిక విప్లవం కారణంగా వినూత్నమైన యంత్రాలు  అందుబాటులోకి వచ్చాయి. దాంతో, ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయంలో యాంత్రీకరణ భారీగా పెరిగింది. మరి వ్యవసాయంలో ఉపయోగించే పనిముట్లు, వాటి అవసరాలు చూద్దాం..

Farming Machines

Farming Machines

దుక్కి యంత్రాలు:
రెక్కల నాగలి మరియు దంతి నాగలిని ప్రాధమికంగా దుక్క చేయుటకు, లేజర్ గైడెడ్ లెవరర్ ను ఎత్తు పల్లములు లేకుండా పొలమును చదును చేయుటకు వాడుతారు. ప్రాధమికంగా దుక్కి చేసినప్పుడు వెలువడిన మట్టి పెల్లాలను విత్తనాలు విత్తడానికి మెత్తగా మరియు పొడిగా చేయుటకు రోటావేటర్ ను, డిస్క్ హారోను ఉపయోగించవచ్చు.

* పళ్ళేపు నాగలి
* రెక్కనాగలి
* ఉలినాగలి
* కల్టివేటర్
* రోటవేటర్

దమ్ముచదను చేసే పరికరం:

*కేజ్ చక్రాలు
* దమ్ముచదను చేసే వరికరం
* దుమ్మునాగలి
* హైడ్రోటిల్లర్
* రోట వేటర్

వరినాటు య౦త్ర౦:
* వరినాటు యయంత్రం
* డ్రమ్ సీడర్

నూర్పిడి యంత్రాలు:
కోత కోసిన తరువాత గింజలను వేరు చేయుటకు వివిధ రకాల పంట నూర్పిడి యంత్రాలను ఉపయోగించవచ్చును. ఆధునిక వ్యవసాయ పరికరాలను వాడటం వలన ఖర్చు తగ్గడమే కాక సమయం వృధాకాదు. దీని వలన శ్రమ తక్కువగా ఉండి, లాభం పెరుగుతుంది.

* వరి నూర్పిడి యంత్ర౦
*గ్రౌండ్ నట్ త్రషర్
* కాలితో నడిచే వరి నూర్పిడి యంత్ర౦
* మల్టిక్రాప్ త్రషర్
* గ్రౌండ్ నట్ పాడ్ స్ట్రిప్పర్

Seed Cum Fertilizer Drill

Seed Cum Fertilizer Drill

Also Read: పొడి భూమి లో కలుపు మొక్కలు నివారించే పరికరం

విత్తనం-ఎరువు పరికరాలు:
విత్తనాలను విత్తడానికి గొర్రులు, నారును వాడటానికి ట్రాన్స్ ప్లాంటర్స్ ను ఉపయోగించవచ్చు. గొర్రులతో వివిధ రకముల విత్తనాలను మరియు ఎరువులకు కూడా ఒకేసారి వేయవచ్చును. వరిని మాటుటకు 4, 6, 8 వరుసల నాటు యంత్రాలను ఉపయోగించవచ్చును.

* గొర్రునాగలి
* ఫెస్పో నాగలి
* సాళ్ళ విత్తన పరికరం
* విత్తనం-ఎరువు వేసే గోర్రు
* రాయల గోర్రు

Weed Removal Equipment

Weed Removal Equipment

కలుపుతీసె పరికరాలు:
కలుపు తీయుటకు కల్టివేటర్, మనిషితో నడుపబడే వీడర్లు, ట్రాక్టరుతో నడుపబడే కలుపు తీయు యంత్రాలనువాడవచ్చు. ఈ యంత్రాలు తడి పొలంలో మరియు మెట్ట పొలంలో ఉపయోగించవచ్చు.

* స్టార్ వీడర్
* కొనో వీడర్
* రోటరీ వీడర్
* చక్రపు ద౦తి
* ఇ౦జన్ తో నడిచే రోటవేటర్

సస్యరక్షణ పరికరాలు:
సస్యరక్షణ మందులను పిచికారి చేయుటకు మనిషితో పనిచేయగల నాప్ స్నాక్ స్ప్రేయర్లు, పవర్ తో నడుపబడే స్ప్రేయర్లు, ట్రాక్టరులో నడుపబడే స్ప్రేయర్లను ఉపయోగించవచ్చు.

* నాప్ సాక్ స్ప్రేయర్
* గటార్ స్ప్రేయర్
* ఫుట్ స్ప్రేయర్
* త్తెవాన్ స్ప్రేయర్
* బూమ్ స్ప్రేయర్
* పవర్ స్ప్రేయర్
* యు.ఎ.ల్.వి స్ప్రేయర్
* రోటరీ డస్టర్
* విత్తన శుద్ధి డ్రమ్ము

Harvesting Machine

Harvesting Machine

కోతకోసే యంత్రాలు:
భూమి లోపల పండు పంటల దుంపలను త్రవ్వు యంత్రాలను, భూమిపైన వరిని మరియు ఇతర పంటలను కోత కోయుటకు రీఫర్ లు, రీఫర్ కంబైన్డెర్లు, కంబైన్డె హార్వెస్టర్లు మొదలగునవి వాడవచ్చును.

Also Read: వరి కలుపు ఇక సులువు

Leave Your Comments

Dragon Fruit Cultivation: అమెరికన్ డ్రాగన్ ఫ్రూట్ సాగుపై స్పెషల్ ఫోకస్.!

Previous article

Best Agriculture Production Companies: భారతదేశంలోని టాప్ అగ్రికల్చర్ ఉత్పత్తి కంపెనీలు 2022

Next article

You may also like