Sugarcane Cultivation: పంట మొదటి నాలుగు నెలల్లో(బాల్యదశ) ఆరు రోజుల కొకసారి, పక్వదశలో (నవంబర్ నుండి చెఱకు నరికే వరకు) మూడు వారాలకొకసారి నీరు పెట్టాలి. బిందు సేద్య పద్ధతి అవలంబించడం వలన పరిమితి నీటి వనరులను పొదుపుగా వాడుకోవచ్చును. జంట సాళ్ళ పద్ధతిలో (2.0X4.0) చెఱకు సాగు చేసినప్పుడు, బిందు సేద్య పద్ధతికయ్యే ఖర్చును 50 శాతం వరకు తగ్గించకోవచ్చును. నీటి ఎద్దడి పరిస్థితుల్లో చెఱకు నాటిన 3వ రోజున ఎకరాకు 1.25 టన్నుల చొప్పున చెఱకు చెత్త కప్పటం ద్వారా భూమిలోనికి త్వరగా కోల్పోకుండా నివారించడంతో బాటు కలుపు, పీక పురుగుల ఉధృతి తగ్గించవచ్చు. ఈ పరిస్థితుల్లో యూరియా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్(2.5%)ను పైరు మీద పిచికారి చేయాలి.
Also Read: చెఱకులో సూక్ష్మధాతు లోపాలు మరియు యజమాన్యం
చెరువుల క్రింద వర్షాధారంగా సాగుచేసినపుడు, చెఱకు తోటకు బాల్యదశలో మొదటి తడిపెట్టిన 30 రోజులకు రెండవతడిని పెట్టటం మంచిది. వర్షాకాలంలో తోటల్లో నీరు నిల్వకుండా చూడాలి. మురుగు నీటి కాల్వల ద్వారాగాని, నత్తగుల్ల లేదా ఆర్కిమెడిస్‌స్క్రూ ద్వారా గాని నీటిని త్వరగా తీసివేయాలి. సాగునీటిలో లవణాల సాంద్రత అధికంగా ఉన్నపుడు (2 మిల్లీ మోస్‌లు సెం.మీ.కు) మరియు సోడియం కార్బోనేట్ అవశేషం లీటరుకు 5 మిల్లీ ఈక్వివలెంట్ల కన్నా అధికంగా ఉన్నపుడు పంచదార దిగుబడులు, రసనాణ్యత తగ్గుతాయి.
Also Read: భారత్ కు అమెరికా పంది ఉత్పత్తులు..