యంత్రపరికరాలు

చైతన్య గోదావరి సంస్థలో వ్యవసాయ యంత్ర పరికరాలు అద్దెకు దొరుకును

0
agri equipment on ren

Agri Equipments For Rent: విత్తన వేసింది మొదలు, పంట కోసే వరకు అన్నదాత అవసరాలకు అనుగుణంగా ఆధునిక సాగు పరికరాలు ఆవిష్కరణ అవుతున్నాయి. యాంత్రీ కరణతో కూలీల ఖర్చులు తగ్గడంతో పాటు అధిక దిగుబడులు వస్తాయి. ఆధునిక వ్యవసాయంలో యంత్ర పరికరాలు అత్యంత కీలకపాత్ర పోషిస్తు న్నాయి. కానీ చిన్న, సన్నకారు రైతులు మాత్రం ఇప్పటికీ రెక్కల కష్టాన్ని నమ్ముకుంటున్నారు. విలువైన యంత్ర సామాగ్రిని కొనలేని రైతుల కోసం చైతన్య గోదావరి సంస్థ ఆలోచన విధానంతో ముందుకు వచ్చింది. చిన్న సన్నకారు రైతులు హారవెస్టర్ మిషిన్, పవర్ టిల్లర్, బేలర్లు వంటి ఆధునిక పనిముట్లను సమకూర్చుకోలేరు. ఈ నేపథ్యంలో రైతులకు అత్యంత ఆధునిక పరికరాలను అందుబాటు ధరల్లో రెంట్ కి ఇస్తుంది చైతన్య గోదావరి సంస్థ.

agri equipment on ren

చైతన్య గోదావరి సంస్థ వద్ద రైతులకు అందుబాటులో ఉండే పరికరాల వివరాలు చూస్తే..

agri equipment on ren

ట్రాక్టర్, టిల్లర్, వీల్ బరో, ప్లవ్ ట్రాక్టర్, ట్రాలీ బండ్లు
హారవెస్టర్ మిషిన్, బేలర్స్
సీడర్స్, ప్లాంటేర్ మెషీన్
గ్రాస్ కట్టర్, బ్రష్ మెషీన్
స్ప్రెయర్, డ్రోన్
బిందు సేద్యం, తుంపర సేద్యం పరికరాలు

పైన పేర్కొన్న పరికరాలను, యంత్ర సామగ్రిని రెంట్ కి ఇవ్వడమే కాకుండా గ్రామీణ యువతకి ఈ పరికరాలను వాడటం, నడపటం, సర్విస్ చేయడం వంటి విషయాల్లో తర్ఫీదు ఇవ్వడం కూడా చేస్తుంది. ఆసక్తి కలిగిన యువకులు సంస్థ కార్యాలయానికి ఫోన్ చేసి పూర్తి వివరాలు పొందవచ్చు. సంప్రదించాల్సిన నంబర్ 7842430123.

Leave Your Comments

ఎరువుల ధరలను తగ్గించండని కేంద్రాన్ని కోరిన సీఎం కేసీఆర్

Previous article

Spinach farming: పాలకూర సాగులో మెళుకువలు

Next article

You may also like