వార్తలు

వెంకయ్య…కేంద్రం వడ్లు తీసుకోమంటుంది ఏం చేద్దాం మరి!

0
cm kcr

CM KCR makes surprise visit to farms in Wanaparthy గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌ రెడ్డి తండ్రి వెంకట్రామి రెడ్డి ఇటీవలే మృతి చెందారు. ఎమ్మెల్యే కృష్ణ మోహన రెడ్డి కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు సీఎం కెసిఆర్ గద్వాల పర్యటన చేపట్టారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన అనంతరం సీఎం కెసిఆర్ తిరుగు ప్రయాణంలో పెబ్బెర్ మండలం రంగాపూర్ లో, కొత్తకోట మండలం విలయం కొండలో ఆగి రైతులతో ముచ్చటించారు. జాతీయ ర‌హ‌దారి 44 ప‌క్క‌న ఉన్న పంట పొలాల‌ను సీఎం ప‌రిశీలించారు. రైతులతో సీఎం కెసిఆర్ మాటలు కలిపారు. మరి సీఎం రైతుల మధ్య సంభాషణ ఎలా సాగిందో చూద్దాం..

cm kcr

 

CM KCR Suprice To Farmer Venkaiah

ఏం వెంకయ్య (నవ్వుకుంటూ) ఏ పంటలు వేస్తున్నారు? దిగుబడి ఎట్లున్నది?
దిగుబడి బాగుంది సార్. వరి ఎకరానికి 50 బస్తాల వరకు వస్తుంది. పల్లి ఎకరానికి 7 నుండి 10 క్వింటాలు పండింది సారూ
పల్లికి ధర ఎట్లుంది వెంకయ్య
బాగానే గిట్టుబాటు అయింది సార్. 7 వేలు పలికింది అండి.
మరి వెంకయ్య యాసంగిలో కేంద్రం వడ్లు కొననంటుంది ఎం చేద్దాం మరి?
మాదేముంది సార్ అంత మన వ్యవసాయశాఖ మంత్రి చూసుకుంటారు
అరేయ్ వెంకయ్య కేంద్రం కొనకపోతే మన మంత్రి సారు ఎం చేస్తారు ( నవ్వుకుంటూ)

KCR

మరొక రైతు కృష్ణమ్మతో సీఎం సంభాషణ.. KCR Discuss With Farmers krishnamma

అమ్మా ..మీదెక్కడ? ఏం పంట వేసిండ్రు?
సీఎం సార్‌ నాపేరు కృష్ణమ్మ. మాది పక్కనున్న తండానే. మూడు ఎకరాల పొలం ఉన్నది. నీళ్లు బాగా వస్తున్నయి. వరి, పల్లి వేసినం.

cm kcr

మహేశ్వర రెడ్డితో సీఎం … KCR Talk With Farmer Maheshwara Reddy

ఎం మహేశ్వర రెడ్డి పంట ఎలా సాగుతుంది? ఖర్చు ఎంత వస్తున్నది?
పంట దిగుబడి చాల బాగుంది సారు. ఎకరానికి 20 వేల నుంచి 25 వేలు ఖర్చు వస్తున్నది సార్‌
మరి మినుములు బెస్టా? పెసర్లు బెస్టా?
మినుము పంటే ఎక్కువ లాభం. కష్టం తక్కువ సార్‌. పెసర పంట చిట్లిపోతది. మినుములు బాగుంటది.
మినుము పంటతో ఎంత ఆదాయం వస్తది?
ఎకరం మినుము పంటకు రూ.25 వేలవరకు లాభం వస్తది సార్‌.
వేరుశనగ పంట పరిస్థితి ఏంది?
దిగుబడి ఎక్కువ వస్తున్నది. మద్దతు ధర కూడా బాగుంది. గతేడాదితో పోలిస్తే వేరుశనగకు మద్దతు ధర ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది సర్‌.

cm kcr

CM KCR సీఎం కెసిఆర్ పంట చేన్లలోకి వెళ్లగా.. రైతులు ఎంతో సంతోషించారు . మా చేన్లకు సీఎం సారు వస్తడనుకోలే. ముఖ్యమంత్రే మా చేన్లకు వచ్చి మాట్లాడుతడని అనుకోలేదు. ఆయనా రైతు బిడ్డే కాబట్టి మాతో మాట్లాడి, మా కష్టాలు తెలుసుకున్నరు అంటూ రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Leave Your Comments

ధరణి సమస్యల పరిష్కారానికై కొత్త ఆప్షన్స్

Previous article

రైతన్నని చుట్టుముట్టిన మూడు పార్టీలు…

Next article

You may also like