వ్యవసాయ పంటలు

Tobacco Cultivation: రైతుల ఇంట సిరుల కురిపిస్తున్న పొగాకు సాగు.!

2
Tobacco Cultivation
Tobacco Crop

Tobacco Cultivation: వ్యవసాయం అంటేనే ఖర్చుతో కూడుకున్నది. దుక్కి దున్నడం దగ్గర నుండి విత్తనాలను విక్రయించే వరకు పెట్టుబడులు పెట్టాలిసిందే.. ట్రాక్టర్, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు ఇలా ఎన్నో బోల్డన్ని ఖర్చులు. కష్టపడి పనిచేసిన వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పంటల దిగుబడి తగ్గిపోవడం. చివరికి అప్పులే అన్నదాతకు మిగులుతాయి. కానీ లాభదాయకమైన పంటలు సాగు చేయడం ద్వారా రైతులు మంచి లాభాలను పోందవచ్చు. కొంత మంది రైతులు పొగాను పంటను ఎంచుకున్నారు, వాణిజ్య పంటల్లో ఖరీదైన పంట పొగాకు. ఈపంటలో శ్రమ ఖర్చులు అధికమవుతున్న దానికి ఆధిక ప్రతిఫలం వస్తుండటంతో రైతులు ఆ పంట వైపు మొగ్గు చూపుతున్నారు. ఎకరాకు 25 వేలు పెట్టుబడి పెట్టి లక్ష దాకా రాబడి పొందుతున్నారు.

వర్జీనీయా పొగాకుకు డిమాండ్‌ పెరగడం

రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో పాటు, అంతర్జాతీయ మార్కెట్‌లో వర్జీనీయా పొగాకుకు డిమాండ్‌ పెరగడంతో రైతులకు సిరులు కురిపిస్తోంది. ఈ ఏడాది కేజీ పొగాకు రికార్డు స్థాయిలో ధర పలకడం తో రైతులు పంటను అమ్ముకుంటున్నారు. అంతేకాకుండా అన్ని గ్రేడ్‌లకు రికార్డు ధరలు రావడంతో కేజీ పొగాకు సరాసరి ధర రూ.214గా నమోదైంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో 11 పొగాకు వేలం కేంద్రాలున్నాయి.

రైతులు ఎక్కువగా పంటను అక్కడకు తీసుకొని వెళ్లతారు. వీటిలో ఎస్‌బిఎస్‌ పరిధిలో 5 వేలం కేంద్రాలుంటే, ఎస్‌ఎల్‌ఎస్‌ పరిధిలో 6 వేలం కేంద్రాలున్నాయి. 2022–23 పంట సీజన్‌కు సంబంధించి 89.35మిలియన్‌ కేజీల పొగాకును అమ్ముకునేందుకు బోర్డు అనుమతి ఉంది. కాని ఇప్పటికే 122.34మిలియన్‌ కేజీల పొగాకు అమ్మకాలు జరిగాయి. ఈ నెలాఖరు వరకు వేలం జరిగే అవకాశం ఉండటంతో ఇది మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అంటే ఈ ఏడాది దిగుబడులు ఎక్కువగా వస్తాయాని అధికారులు అంటున్నారు.

Also Read: Bitter Gourd Cultivation in Canopy Method: పందిరి పద్దతిలో ఈ కూరగాయ సాగు చేస్తే మంచి దిగుబడి వస్తుంది.!

Tobacco Cultivation

Tobacco Cultivation

రికార్డు ధరలు ఈ ఏడాదే..

గత రెండేళ్ల నుంచి పొగాకు మార్కెట్‌ ఆశాజనకంగా ఉన్నా ఈ ఏడాదిలోనే మార్కెట్‌లో రికార్డు ధరలు నమోదయ్యాయి. అయితే ఈఏడాది గ్రేడ్‌లతో సంబంధం లేకుండా దాదాపు అన్ని గ్రేడ్‌లకు రేట్లు పెరగడంతో రేట్లు డబుల్‌ సెంచరీ దాటాయి. పోయిన సంవత్సరం పొగాకుకు లాభాలు అధికంగా రావడంతో రైతులు ఈ ఏడాది కూడా సాగును రెట్టింపు చేసుకొని అధిక లాభాలను పొందుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందించడంలో ముందు వరుసలో ఉంది. దీంతో పొలాలు, బ్యారన్‌లకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగిపోయింది. గతేడాది రూ.15వేలు ఉన్న పొలం కౌలు ప్రస్తుతం రూ.30­వేల వరకు చెల్లించేందుకు వెనుకాడడం లేదు. అదే సందర్బంలో గతేడాది రూ.1లక్ష ఉన్న బ్యారన్‌ కౌలు ఈ ఏడాది రూ.2లక్షలు పలుకుతుంది.

పొగాకు రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం..

పొగాకు రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ రైతులకు చాలా మేలు చేసిందని చెప్పుకోవచ్చు. మార్కెట్‌లో డిమాండ్‌ లేని సమయంలో రైతులను ఆదుకునేందుకు 2020–21 సీజన్‌లో నేరుగా మార్క్‌ ఫెడ్‌ని రంగంలోకి దించి పొగాకు కొనుగోలు చేయించింది. ఈప్రభావంతో 2021–22 సీజన్‌ నుంచి పొగాకు మార్కెట్‌లో ఊహించని ధరలు రైతులకు లభిస్తున్నాయి. ప్రస్తుతం 2022–23 సీజన్‌ అయితే రికార్డు ధరలతో అదరగొట్టింది. అదనపు అమ్మకాలపై విధించే 5శాతం ఫెనాల్టీని ఒత్తిడిని కూడా రద్దు చేశారు. ఈరేట్లను బట్టి చూస్తే ఈ సంవత్సరం పంట విస్తీర్ణం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: Cucumber Cultivation: కీరదోసకాయ పంట రక్షణ, నివారణ చర్యలు.!

Leave Your Comments

Bitter Gourd Cultivation in Canopy Method: పందిరి పద్దతిలో ఈ కూరగాయ సాగు చేస్తే మంచి దిగుబడి వస్తుంది.!

Previous article

Minister Niranjan Reddy: అమెరికాకు వ్యవసాయ మంత్రి నేతృత్వంలో అధికారుల బృందం.. ఈనెల 27 నుండి సెప్టెంబరు 3 వరకు 8 రోజుల పర్యటన.!

Next article

You may also like