Milking Machines Benefits: పాలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా రోజు రోజుకు పశువుల పెంపకం చేపట్టే వారి సంఖ్య పెరుగుతోంది. రైతులు వారి ఆర్థిక పరిస్థితులను బట్టి , పనివారి లభ్యతను బట్టి ఒకటి, రెండు పశువుల నుండి వందల వరకు పోషిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో కూలీల కొరత పెద్ద సమస్యగా తయారైనది.సకాలంలో పాలు పితేకెంనదుకు పనివారు దొరకక పాడి రైతులు పశువుల పెంపకంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో రైతులకు పాలు పితికే యంత్రాలు అక్కరకకు వస్తున్నాయి. వీటిని పెద్ద డైరీ ఫారాలు ఉన్న రైతులే కాకుండా చిన్న రైతులు కూడా ఉపయోగించుకోవచ్చు.
• పాడి పశువుల నుండి పాల దిగుబడి పూర్తీగా పొందాలన్నా, అధిక పాల రేటు కొరకు, పాలలో అధిక వెన్న శాతం కొరకు, శుభ్రమైన పాల కొరకు, పశువులకు పొదుగు వాపు సమస్య లేకుండా ఉండాలంటే ఈ పాలు పితికే యంత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి.
• పాలు పితికే యంత్రాలు వాడుకొని లేబర్ ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చు.
• ఈ పాలు పితకడం అనేది చాలా నైపుణ్యంతో కూడుకున్న ప్రక్రియ. అందరికీ ఇది సాధ్యం కాదు.
• అధిక సంఖ్యలో పశువులను పేంచే వారికి ఈ పాలు పితకడం అనేది. పెద్ద సమస్య. పాలు పితికే యంత్రాలు వాడకం వలన పాల ఉత్పత్తి, పాల దిగుబడి పెరుగుతుంది అదేవిధంగా పాలు వృధాను అరికట్టవచ్చు. అంటే 3% వరకు పులిసే పాలను,1% వరకు పాలు పితికే సమయంలో వృధా అయ్యే పాలను వృధా కాకుండా ఈ పాలు పితికే యంత్రాల వాడకం ద్వారా అరికట్టవచ్చు.
• పాలు పితికే యంత్రాల ద్వారా పాలు పితికగా వచ్చిన పాలు నాణ్యంగా, కలుషితం కాకుండా, తాజాగా ఉంటాయి. వెన్న శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. పోదుగుకు గాయాలు కావు కాబట్టి పొదుగు వాపు సమ్మస్యలు కూడా రావు.
• ఒకే విధంగా పాలు పితికే అవకాశాలు ఉన్నాయి.
• ఒక వ్యక్తి ఒకేసారి 8-12 పశువులకు 2-3 యాంత్రాలు ఉపయోగించి ఒకేసారి పాలు పితకవచ్చు.
• పాలు సంపూర్ణంగా, త్వరగా పితికే అవకాశం కలదు.
•చాలా మంది రైతులలో ఈ పాలు పితికే యంత్రాల వాడకంపై అపోహలు ఉండడం వలన వాడటం లేదు.
• ఈ పాలు పితికే యంత్రాలు వాడకం వలన ఎటువంటి నష్టాలు జరగవు. పాలు పితికే యంత్రాల పెట్టుబడి ఎక్కువ కాని అవి చిరకాలం ఉపయోగపడతాయి అని రైతులు గ్రహించాలి.
•పని మనుషులపై ఆధారపడే అవసరం తగ్గుతుంది.
Also Read: Rainy Season Fodder Cultivation: వర్షాకాలంలో సాగు చేసుకొదగ్గ పశుగ్రాసాలు.!
• ఈ పాలు పితికే యంత్రాలు వాక్యూమ్ సిస్టమ్ పై ఆధారపడి పనిచేస్తాయి కాబట్టి గేదెలకు ఎటవంటి షాక్ తగలదు. అంతే కాక పాలు పితికే సమయంలో పాల ప్రవాహం ఈ పారదర్సికమైన పైపుల ద్వారా గమనించవచ్చు.
• పాల ప్రవహం ఆగిపోయిన వెంటనే పాలు పితకడం అయిపోయినది అని గ్రహించి పొదుగు నుంచి క్లస్టర్లను తొలగిస్తే సరిపోతుంది.
• రక్తం ప్రవహిస్తుంది అనేది ఒక అపోహ, అపనమ్మకం అని రైతులు గ్రహించాలి.
• అలాగే ఈ పాలు పితికే యంత్రాలు మంచి స్టాండర్డ్ కంపెనీ వాళ్ళవి తీసుకుంటే వారు సర్వీస్ సదుపాయం కూడా కల్పిస్తారు.
• కొంతమంది రైతులు పాలు పితికే యంత్రాలు ఆవులకు మాత్రమె గేదెలకు లేవు అని అనుకుంటారు. కాని ఆవులకు, గేదెలకు వేరు వేరుగా పాలు పితికే యంత్రాలు ఉంటాయి. గేదెల పొదుగు ఆకారాన్ని బట్టి వాటికి ప్రత్యేక పాలు పితికే యంత్రాలు ఉంటాయి.
• గేదెల పాలు పితికే యంత్రాలు ధర ఆవుల పాలు పితికే యంత్రాల ధర కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది.
• ఈ పాలు పితికే యంత్రాలలో 10-15 పశువులకు పాలు పితికేందుకు బకెట్ పాలు పితికే యంత్రాలు అందుబాటులో ఉన్నాయి . వీటిలో సింగిల్ బకెట్ అదేవిధంగా డబుల్ బకెట్ పాలు పితికే యంత్రాలు ఉంటాయి.
వీటి ఖరీదు ఆవులకి అయితే 40,000-60,000 వరకు ఉంటుంది అదే గేదెలకు అయితే లక్ష రూపాయల కు పైగా ఉంటుంది.
• అలాగే ట్రాలీలతో ఉండే మీల్కింగ్ మిషన్స్ కూడా ఉంటాయి. దీనిని ప్రతి పశువు వద్దకు తీసుకెళ్ళవచ్చు.
• వంద వరకు పశువులు ఉన్న రైతులు చిన్న మిల్కింగ్ పార్లర్ ఏర్పాటు చేసుకోవచ్చు.
• 250 కు పైగా పశువులు ఉన్న రైతులు పెద్ద మిల్కింగ్ పార్లర్ ఏర్పాటు చేసుకోవాలి.
•1000 కి పైగా పశువులు ఉన్న రైతులు రోటరీ మిల్కింగ్ పార్లర్ ఏర్పాటు చేసుకోవాలి.
• ఇక 2 లేదా 3 అధిక పాలు ఇచ్చే పశువులకు ఉపయోగపడేలా చేతితో పనిచేసే పాలు పితికే యంత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి.వీటికి విద్యుత్ అవసరం లేదు.
• ఇక పవర్ స్ప్రయేర్ తో పనిచేసే యంత్రాలు కూడా మార్కేట్ లో అందుబాటులో ఉన్నాయి.
Also Read: Jamun Fruit Health Secrets: కింగ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అయిన నేరేడు ఆరోగ్య రహస్యాలు.!