Drum Seeder: వరి పంట పండించే రైతులు వడ్లు పొలంలో చేతుల ద్వారా చల్లుకొని నారు వచ్చాక పొలంలో నాటుకుంటారు. మన పూర్వం నుంచి రైతులు చేతులతో విత్తనాలు చల్లుకునే పద్దతిని వాడుతున్నారు. ఇలా చల్లడం ద్వారా వరి విత్తనాలు ఎక్కువగా రైతులు వాడుతారు. వరి విత్తనాలు చల్లే పద్ధతిలో మొలక్కలు సమానంగా ఉండవు. కొన్ని విత్తనాలు మట్టి పై భాగంలో పడి తొందరగా పెరుగుతుంది. ఇంకా కొన్ని విత్తనాలు మట్టి లోతులో పడి మొలక్క తొందరగా పెరగదు. విత్తనాల వినియోగం తగ్గిస్తూ, విత్తనాలని సమానంగా చల్లుకోవటానికి డ్రమ్ సీడర్ పరికరం రైతుల అందరికి అందుబాటులో ఉంది.
డ్రమ్ సీడర్ వాడి కూలీల ఖర్చు తగ్గించుకోవచ్చు. ఈ డ్రమ్ సీడర్ ద్వారా వరి పొలం నేలలో విత్తనాలని సమానంగా చల్లుతుంది. సీడ్ రేటింగ్ కూడా ఈ డ్రమ్ సీడర్ ద్వారా తగ్గించుకోవచ్చు. డ్రమ్ సీడర్లో రెండు రకాలు ఉంటాయి. నాలుగు వరుసల డ్రమ్ సీడర్, ఎనిమిది వరుసల డ్రమ్ సీడర్ ఉంది.
డ్రమ్ సీడర్ ద్వారా చల్లిన వరి విత్తనాల మధ్య 10 మిల్లి మీటర్ల దూరం ఉంటుంది. వరుసల మధ్య 20 సెంటి. మీటర్ల దూరం ఉంటుంది. ఈ డ్రమ్ సీడర్ వరి విత్తనాలు చల్లే ముందు వడ్లు 12 గంటల పాటు నానపెట్టాలి. డ్రమ్ సీడర్ వాడి ఒక రోజులో 3-4 ఎకరాలు విత్తనాలని విత్తుకోవచ్చు.
Also Read: Turmeric Digging: పసుపు తవ్వడానికి రైతులు ఈ పరికరాని వాడితే పంట నాణ్యత పెరుగుతుంది.!
ఒక ఎకరానికి 8-10 కేజీల విత్తనాలు విత్తుకోవచ్చు. డ్రమ్ సీడర్ డ్రమ్లో విత్తనాలని వేసుకొని. డ్రమ్ సీడర్కి ఉండే హ్యాండిల్ పట్టుకొని పొలంలో లాకుంటూ తిరగాలి. పక్కన ఉన్న చక్రాలు తిరగడం ద్వారా విత్తనాలు పొలంలో సమానంగా పడతాయి. డ్రమ్ సీడర్ ద్వారా విత్తనాలు విత్తుకునే పొలం, నాటువేసే పొలంలనే ధునుకోవాలి.
డ్రమ్ సీడర్ వాడటం వల్ల సీడ్ రేట్ తగ్గుతుంది. కూలీల ఖర్చు అసలు ఉండదు. విత్తనాలు కూడా పొలంలో సమానంగా చల్లడం వల్ల అని విత్తనాలు సమానంగా మొలక్క ఎత్తుతాయి. ఈ డ్రమ్ సీడర్ మీరు కొనుగోలు చేయాలి అనుకుంటే 7075062968 నెంబర్ సంప్రదించండి.
Also Read: Samunnati Lighthouse FPO Conclave: కన్హా శాంతివనంలో లైట్‌హౌస్ ఎఫ్‌పిఓ కాన్క్లేవ్ మొదటి ఎడిషన్