Mini Rice Mill Machine: రైతులు వరి పంటలు కోసిన తరువాత బియ్యంగా మార్చడానికి బియ్యం మిల్స్ చుట్టూ తిరుగుతుంటారు. మిల్ వాళ్ళు కూడా ఎక్కువ వరి ధాన్యం ఉన్న రైతుల పంటని ముందుగా బియ్యంగా మార్చడానికి చూస్తుంటారు. ఇలాంటి మిల్లులులో తక్కువ వరి ధాన్యం ఉన్న రైతుల పంటని బియ్యంగా మార్చడం కూడా ఇబ్బంది. బియ్యం జల్లెడ, పాలిష్ పద్దతిని మార్చమని అడిగిన మార్చడం కూడా కష్టం. చిన్న రైతుల కోసం ఈ చిన్న బియ్యం మిల్ వాడుతున్నారు. వీటిని మహబూబ్ నగర్ జిల్లాలో, హన్వాడ గ్రామంలో హన్వాడ కేంద్రంలో వాడుతున్నారు.
ఈ చిన్న మిల్లుల ద్వారా 100-200 కిలోల వడ్లని బియ్యంగా తయారు చేసుకోవచ్చు. సేంద్రియ పద్దతిలో పండించిన పంటని లేదా ఉక్కుడు బియ్యాన్ని కూడా మిల్ చేసుకోవచ్చు. ఈ చిన్న మిల్ ద్వారా రాగులు, సజ్జలు మొదలైన చిరు ధన్యాలని కూడా మిల్లింగ్ చేసుకోవచ్చు. ఈ మిల్ ద్వారా కేవలం గింజలోని పై పొట్టు మాత్రమే పోతుంది.
ఈ మిల్ ద్వారా పోలిష్ చేయడానికి రాదు. ఈ మెషిన్ ఎనిమిది గంటలో దాదాపు రెండు టన్నులు వరకు బియ్యంగా చేస్తుంది. ఈ మెషిన్ 1హెచ్ పి మోటార్, సింగల్ ఫేస్ కరెంటు ద్వారా పని చేస్తుంది. సింగల్ ఫేస్ వాడటం ద్వారా కూడా కరెంటు చార్జెస్ ఎక్కువ ఉండదు. ఈ చిన్న మిల్ మధురై నుంచి 1. 60 లక్షలకి కొనుగోలు చేశారు.
పాలిష్ చేయని బియ్యానికి ఈ మధ్య కాలంలో డిమాండ్ పెరుగుతుంది. దానితో ఈ మెషిన్ ఒక ఇద్దరు లేదా ముగ్గురు రైతులు కొనుగోలు చేసి వ్యాపారంగా మొదలు పెట్టిన మంచి లాభాలు వస్తాయి. పాలిష్ లేని బియ్యాన్ని తినడం అందరికి అలవాటు లేకపోవడంతో ఇంకా కొంత మంది కొంచం అయన పాలిష్ ఉండాలి అనుకుంటున్నారు. వారి కోసం ఇలాంటి రైస్ మిల్ మరొకటి ఏర్పాటు చేశారు.
ఈ మెషిన్ ద్వారా సేంద్రియ పద్దతిలో పండించిన వరిని బియ్యంగా మర్చి, కేవలం కొంత వరకు మాత్రమే పోలిష్ చేస్తుంది. ఈ మెషిన్ 80 వేలకు కొనుగోలు చేశారు. ఇందులో సింగిల్ పాలిష్ నుంచి మొత్తం పాలిష్ వరకు చేసుకోవచ్చు. 7.5 హెచ్ పి మోటార్ వాడుతున్నారు, ఒక గంటలో 300 కిలోల వరకు బియ్యంగా మార్చుకోవచ్చు. ఈ మెషిన్ ఒక ఫేస్ కరెంటు వాడటం ద్వారా తక్కువ కరెంటు ఛార్జర్స్ ఉంటుంది.
గ్రామంలో ఉపాధి కోసం ఈ మిల్లులు ఏర్పాటు చేసుకున్న కూడా మంచి ఆదాయం వస్తుంది. దీని ద్వారా ఇతరులకి కూడా ఉపాధి కల్పించవచ్చు.ఈ కేంద్రంలో రైతులకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఈ మెషిన్ గురించి ట్రైనింగ్ లేదా ఇతర వివరాలకి 9912136750 నెంబర్ సంప్రదించండి.
Also Read: PJTSAU: ఎరువులు, పురుగు మందులు తగిన మోతాదులో వాడాలి