Vegetable Solar Dryer: మన చిన్నప్పుడు పల్లెటూర్లలో వేసవి కాలం వచ్చింది అంటే కూరగాయల ఒరుగులు తయారు చేస్తుంటారు. ఎక్కువగా ఈ ఒరుగులను కాలానుగుణమైన కూరగాయలు లేదా పండ్లతో తయారు చేస్తుంటారు. వీటిని మళ్ళీ వర్షాకాలం లేదా చలికాలంలో వంటలో వాడుకుంటారు. ఈ ఒరుగులతో తయారు చేసిన వంటలు కూడా బాగా రుచిగా ఉంటాయి. వీటిని పెద్ద మొత్తంలో తయారు చేసి అమ్మడానికి నల్గొండ జిల్లా, కొట్టంగూరు గ్రామంలో రైతు ఉత్పత్తి సంస్థ వెజిటేబుల్ సోలార్ డ్రైయర్ ఏర్పాటు చేసారు.
ఈ వెజిటేబుల్ సోలార్ డ్రైయర్ ద్వారా కూరగాయలతో పాటు పండ్లను కూడా ఎండ పెట్టుకోవచ్చు. దీనికి ముందు భాగంలో అయిదు ఎక్సహౌస్ ఫాన్స్ పెట్టారు. ఈ ఎక్సహౌస్ ఫాన్స్ జిటేబుల్ సోలార్ డ్రైయర్‌లో ఎక్కువ వేడిని ఉంటే బయటికి విడుదల చేస్తుంది. దాని వల్ల ఈ డ్రైయర్‌లో సమానమైన వేడి ఉంటుంది.
దీనిని ఇనుప రాడ్స్ వెల్డింగ్ చేసి, దాని పై 90 జిఎస్ఎం ఉన్న పోలితేనే షీట్ వేశారు. వెజిటేబుల్ సోలార్ డ్రైయర్ 15 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పు ఉంటుంది. కూరగాయలు లేదా పండ్లని ఇందులో 5-6 మీటర్ల తర్వాత పెట్టాలి. కూరగాయాలని కట్ చేసి ట్రే పై ఉంచి ఈ డ్రైయర్‌లో పెట్టాలి.
Also Read: Seed Cum Fertilizer Drill: పత్తి సాగు చేసే రైతులకి ఎరువులు వేయడానికి తక్కువ ఖర్చుతో కొత్త పరికరం.!
డ్రైయర్ ద్వారా ఆరపెడితే తొందరగా ఆరిపోతాయి. ఎండలో ఆరడం కంటే చాలా తక్కువ సమయంలోనే కూరగాయలని ఆరపెట్టుకోవచ్చు. ఇందులో కూరగాయల ముక్కలు రెండు రోజులో ఆరిపోతాయి. దీనిలో ఆరపెట్టుకోవడం ద్వారా సమయం, శ్రమ కూడా తగ్గుతుంది. ఇలా తయారు చేసిన ఒరుగులను పప్పులో లేదా ఇతర వంటకాల్లో వాడితే వాటి రుచి చాలా బాగుంటుంది.
ఈ ఒరుగులను తయారు చేసి ఇతర ప్రాంతాలకి కూడా ఎగుమతి చేస్తున్నారు. దీని ద్వారా కాలానుగుణమైన కూరగాయాలని, పండ్లని సంవత్సరం మొత్తం వాడుకునే అవకాశం ఉంటుంది.