Food Processing Machine: రైతులు పండించిన పంటని అలాగే అమ్ముకుంటున్నారు. కానీ పండించిన పంటని ప్రాసెస్ చేసి అమ్ముకుంటే మంచి లాభాలు వస్తాయి. ప్రాసెస్ చేసిన వస్తువులకు మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. పండించిన పంట అమ్ముకుంటే సాధారణమైన ధర వస్తుంది కానీ ప్రాసెస్ చేసి అమ్ముకుంటే రేటింపుగా లాభాలు వస్తున్నాయి. రైతులు పండించిన పంటని ప్రాసెస్ చేసుకోవడానికి మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ గ్రామంలో ఇద్దరు సోదరులు కలిసి ఈ కేంద్రని ఏర్పాటు చేశారు.
బసవరాజ్ గారు, మల్లికార్జును గారు ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో ఒక కొత్త ప్రాసెసింగ్ మెషిన్ వెస్ట్ బెంగాల్ నుంచి 80 వేల రూపాయలకి తీసుకొని వచ్చారు. ఈ ప్రాసెసింగ్ మెషిన్ ద్వారా రైతులు పండించిన వరి ధాన్యాన్ని మరమరాలు తయారు చేసి అమ్ముకోవచ్చు. బియ్యం ఒక క్వింటాల్ ధర 5000 వేలు రూపాయలు ఉంటే మరమరాలుగా ప్రాసెస్ చేసి అమ్ముకుంటే ఒక క్వింటాల్ 25-30 వేల వరకు అమ్ముకోవచ్చు. కేవలం బియ్యం మాత్రమే కాదు శెనిగలు కూడా పుట్నాలుగా ప్రాసెస్ చేసి అమ్ముకుంటే కూడా మంచి లాభాలు పొందవచ్చు.
Also Read: Processing Machine: రైతులు పండించిన పంటని ప్రాసెస్ చేయడానికి కొత్త యంత్రం
ఇంకా పాపడాలు, చెక్రలు, మొక్కజొన్న చిప్స్ వీటిని నూనెలో వేసుకొని తింటాము. నూనె ఎక్కువ వాడటం వల్ల కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. నూనెతో తయారు చేసిన తిండి పదార్థాలు ఎక్కువ రోజులు నిలువ ఉండవు. ఎక్కువ రోజులు నిలువ ఉంచిన కూడా వాసన వచ్చి, బూజు పెట్టె అవకాశం కూడా ఉంది. ఈ స్నాక్స్ అని కూడా నూనె లేకుండా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన పదార్థాలు తిన్న కూడా ఆరోగ్యానికి మంచిది.
మరమరాలు తయారు చేయడానికి రైతులు పండించే వరి రకం వేరుగా ఉంటుంది. కానీ ఈ ప్రాసెసింగ్ మెషిన్ ద్వారా ఎటువంటి వరి రకం నుంచి అయిన మరమరాలు తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న వస్తువులు మార్కెట్లో మంచి రేట్ ఉన్నాయి. రైతులు వాళ్ళు పాందించిన పంటలో కనీసం 20 శాతం పంటని ప్రాసెస్ చేసి అమ్ముకుంటే రేటింపు లాభాలు ఉంటాయి.
Also Read: Chitti Potti Paddy Farming: గింజ రాలకుండా.. ఎక్కువ వర్షాలకి, గాలులకి తట్టుకునే కొత్త వరి రకం.!