Processing Machine: పంట పండించక ఆ ధాన్యాన్ని రైతులు ఎక్కువ ధరకి అమ్ముకొని లాభాలు పొందాలి అనుకుంటారు. రైతులు అమ్ముకునే పంటకి ఇంకా ఎక్కువ లాభాలు రావాలి అని మహబూబ్ నగర్ జిల్లా, హన్వాడ గ్రామంలో బసవరాజ్ గారు, మల్లికార్జున్ గారు ప్రాసెసింగ్ కేంద్రం మొదలు పెట్టారు. ఈ ప్రాసెసింగ్ కేంద్రం ద్వారా రైతులకి ఒక ముఖ్య సందేహం ఇవ్వాలి అనుకుంటున్నారు. రైతులు పండించిన పంటకి లాభాలు వచ్చిన, లేకపోతే తక్కువ రేట్ మార్కెట్లో ఉన్న ఆ పంటని ప్రాసెస్ చేసి మార్కెట్లో అమ్మండి అని చెపుతున్నారు.
దీని కారణంగా వీళ్లు ఇద్దరు కలిసి వెస్ట్ బెంగాల్ నుంచి ప్రాసెసింగ్ మెషిన్ కొనుగోలు చేశారు. ఈ ప్రాసెసింగ్ మెషిన్ ద్వారా మరమరాలు , పుట్నాలు, పాపడాలు, అటుకులు, మొక్కజొన్న చిప్స్ తయారు చేసుకోవచ్చు. మరమరాలు బియ్యంతో కాకుండా ఏ రకం బియ్యం అయిన వాడి మరమరాలని తయారు చేసుకోవచ్చు. శెనిగలు నుంచి పుట్నాలు తయారీ చేసి అమ్ముకోవచ్చు.
ఈ మెషిన్ సిలిండర్ ద్వారా మంటని ఏర్పాటు చేసుకొని వేడి చేస్తుంది. రైతులు ఖర్చు తగ్గించుకోవాలి అనుకుంటే కట్టెలు వాడి కూడా ఈ మెషిన్ పని చేసుకోవచ్చు. ఈ మెషిన్ వేడి సమానంగా రావాలి అని పై భాగం మొత్తం మట్టితో కప్పేస్తారు. దీనికి సముద్రపు మట్టి మాత్రమే వాడాల్సి ఉంటుంది.
Also Read: Chitti Potti Paddy Farming: గింజ రాలకుండా.. ఎక్కువ వర్షాలకి, గాలులకి తట్టుకునే కొత్త వరి రకం.!
ఈ ప్రాసెసింగ్ మెషిన్ తిరుగుతూ ఉండటం వల్ల వేడి లోపల సమానంగా వ్యాపిస్తుంది. ఈ మెషిన్ తిరగడానికి 1 హ్ పి మోటార్ వెనకాల కనెక్ట్ చేసుకొని ఉంటుంది. బియ్యం లేదా శెనిగలు మెషిన్ పై భాగం నుంచి వేసుకోవాలి. మెషిన్లో సమానంగా వేడి ఉండటం వల్ల మరమరాలు , పుట్నాలుగా తయారు అవుతాయి. తయారు అయిన మరమరాలు , పుట్నాలు మెషిన్ తిరుగుతూ ఉండటం ద్వారా బయటికి ముందు భాగం నుంచి వస్తాయి.
ఈ మెషిన్ ఖరీదు 80 వేల రూపాయలు. ఒక గంటలో సుమారు 100-200 కిలోలు ప్రాసెస్ చేస్తుంది. పాపడాలు, మొక్కజొన్న చిప్స్, ఇతర స్నాక్స్ నూనె లేకుండా తయారు చేస్తున్నందుకు కూడా వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఈ మెషిన్ ద్వారా ప్రాసెస్ చేసి అమ్ముకుంటే రేటింపు శాతం కంటే ఎక్కువ లాభాలు రైతులకి వస్తాయి.
మెషిన్ వాడకాన్ని ట్రైనింగ్ కూడా ఎక్కడ ఇస్తున్నారు. రైతు ఒక పంటకాలంలో తాను పండించిన పంటలో కొంత భాగం ప్రాసెస్ చేసి అమ్ముకుంటే మెషిన్ ఖరీదు పోయి కొంత అయిన లాభాలు రైతులకి రావాలి అని ఈ కేంద్రం కృషి చేస్తుంది. ఈ మెషిన్ గురించి ట్రైనింగ్ లేదా ఇతర వివరాలకి 9912136750 నెంబర్ సంప్రదించండి.
Also Read: Cow Dung Bricks: పర్యావరణాన్ని కాపాడుకునే పద్దతిలో కొత్తగా.. ఆవు పేడ టైల్స్.!