Portable Power Sprayer: రైతులు పంట వేశాక పంట పెరగడానికి లేదా పంటకి పురుగులు పట్టకుండా మందులు పిచికారీ చేస్తూ ఉంటారు. ఈ ఎరువులు లేదా పురుగుల మందులు పిచికారీ చేయడానికి పెద్ద స్ప్రేయర్ రైతుల బుజాల పై వేసుకొని పొలం మొత్తం తిరుగుతూ పిచికారీ చేయాల్సి ఉంటుంది. దాని వల్ల రైతులకి ఎక్కువ శ్రమ, సమయం కూడా వృధా అవుతుంది. రైతులకి పిచికారీ పద్దతిని సులువు చేయడానికి కిసాన్ జోన్ కంపెనీ వాళ్ళు పోర్టబుల్ స్ప్రేయర్ తయారు చేశారు.
పోర్టబుల్ స్ప్రేయర్ వాడటం చాలా సులువు. దీనికి ఒక మోటార్ ఉంటుంది. ఈ మోటర్కి ఒక ఫుట్ వాల్వ్ పైప్ కనెక్ట్ చేయాలి. ఒక డ్రమ్లో నీళ్లు, ఎరువులు లేదా పురుగుల మందులు కలుపుకోవాలి. ఈ డ్రమ్లో ఫుట్ వాల్వ్ వేయాలి. హోస్ట్ పైప్ మోటార్ ఔట్లెట్ కనెక్ట్ చేయాలి. దీనికి స్ప్రేయర్ హ్యాండిల్ కనెక్షన్ ఉంటుంది.
Also Read: Rudraksha Plant: రుద్రాక్ష చెట్టు ఇప్పుడు మన ప్రాంతాల్లో పెరుగుతుంది..
ఈ హోస్ట్ పైప్ దాదాపు 50-100 మీటర్ల పొడవు ఉంటుంది. ఈ పైప్ పట్టుకొని పొలం మొత్తం తిరిగి పంటకి పిచికారీ చేసుకోవచ్చు. ఒక్కసారి స్ప్రయింగ్ 4-8 సళ్ళ వరకు స్ప్రే చేసుకోవచ్చు. ఒకటే వైపు స్ప్రే చేసుకుంటే కేవలం 4 సళ్ళు స్ప్రే చేసుకుంటారు. రెండు పైపులు స్ప్రే చేసుకుంటే 8 సళ్ళ వరకు స్ప్రే వస్తుంది.
స్ప్రయింగ్ చేసే వాళ్ళకి సహాయంగా పైప్ సరిగా రావడానికి ఒక మనిషి అవసరం ఉంటుంది. ఈ పోర్టబుల్ స్ప్రేయర్ వాడటం ద్వారా సమయం, శ్రమ తగ్గుతుంది. స్ప్రయింగ్ చేసే పనికి కూలీ ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ పోర్టబుల్ స్ప్రేయర్ కిసాన్ జోన్ కంపెనీతో కొనుకోవాలి అనుకున్న వాళ్ళు 7386403652 నెంబర్ సంప్రదించవచ్చు.
Also Read: 3 Rows Ridger: మూడు వరుసలు ఉన్న నాగలిని చూశారా…