Water Bubble Gate Valve: రైతులు పంటలు పండించాలి అంటే దుక్కి దున్నే సమయం నుంచి ఆ పంటని మార్కెట్కి తీసుకొని వెళ్లి, అమ్ముకునే వరకు పెట్టుబడి చాలా అవుతుంది. పంట విత్తనాలు విత్తుకునే ఖర్చు కంటే పంటకి ఎరువులు చల్లడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. ప్రతి దిశలో రైతులు ఎలా ఎక్కువ పెట్టుబడి పెట్టుకుంటూ పోతూ ఉంటే చివరికి ఆదాయం కొంచం కూడా మిగలడం లేదు.
ఇలా ఎన్నో రైతుల కష్టాలని చూసిన నల్గొండ జిల్లా రైతు ఎరువులు చల్లుకోవడానికి తక్కువ ఖర్చుతో ఒక పరికరాని అతని స్వయంగా తయారు చేసుకొని, అతని పొలంలో వాడుకుంటూ, ఇతర రైతులకి కూడా సహాయం చేస్తున్నాడు.
Also Read: Sesame Harvester Machine: నువ్వుల పంట కోతలకు కొత్త యంత్రం..
ఈ రైతు తన నాగలికి ఒక వాటర్ బాబుల్ నిలబడే విధంగా 6 ఇనుప రాడ్లని వెల్డింగ్ చూపించాడు. ఈ వాటర్ బాబుల్ అడుగు భాగంలో ఒక పెద్ద రంద్రం పెట్టాడు. వాటర్ బాబుల్ పై భాగంలో గేట్ వాల్వ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ గేట్ వాల్వ్ ద్వారా ఎరువులు ఎంత మోతాదు పొలంలో పడాలో మార్చుకోవచ్చు.
ఈ వాటర్ బబుల్ గేట్ వాల్వ్ ద్వారా ఎరువులు పొలంలో పడడానికి పైపులు పెట్టుకోవాలి. ఈ గేట్ వాల్వ్ నుంచి ఎరువులు పైపు ద్వారా పొలంలో మొక్కల వేర్ల దగర ఎరువులు పడుతాయి. ఈ మొత్తం ఏర్పాటు చేసుకోవడానికి 500 రూపాయలు ఖర్చు అవుతుంది.
నాగలితో ఒక మనిషి ఉంటే చాలు పొలం మొత్తం ఎరువులు వేసుకోవచ్చు. దీని ద్వారా ఒక కూలి మనిషి ఖర్చు తగ్గుతుంది. మార్కెట్లో సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్స్ చాలా పరికరాలు ఉన్నాయి కానీ ఆ పరికరాలు చాలా ఖరీదు. ఇలా మనం తయారు చేసుకోవడం ద్వారా ఖర్చు రైతులకి ఖర్చు చాలా వరకు తగ్గుంది.
Also Read: Rythu Bandhu Scheme: రైతుబంధు పథకంతో తెలంగాణలో సాగువిప్లవం – మంత్రి