Agricultural Equipments: వ్యవసాయం ఫై ఇష్టం ఉన్న వాళ్ళు అందరూ వ్యవసాయం చేయలేకపోయినా రైతలు అవసరానికి ఉపయోగపడే చిన్న చిన్న వ్యవసాయ పరికరాలు తక్కువ ధరతో కనుకొంటున్నారు. తక్కువ ఖర్చుతో తయారు చేసిన ఈ పరికరాలు రైతులకి ఎంతో మేలు చేస్తున్నాయి. ఇలా తక్కువ ఖర్చుతో పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనికి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న భగత్ రైతుల కష్టాలు కొత్తయిన తీర్చడానికి తన వంతుగా ప్రతి సంవత్సరం ఒక కొత్త పరికరం రైతులకి ఇస్తున్నారు. గత సంవత్సరం తక్కువ ఖర్చుతో ఎలక్ట్రానిక్ బైక్ తయారు చేసారు.
ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం రైతుల కోసం ఒక పరికరం తయారు చేసారు. రైతుల పంట పొలాల్లో కలుపు వచ్చినపుడు లేదా పిచ్చి మొక్కలు తీసే తప్పుడు రైతులకి మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్ వస్తాయి. కలుపు తీసే సమయంలో కాళ్ళకి రాళ్ళు గుచ్చకుండా ఈ పరికరాని మోకాలికి పెట్టుకొని పని చేస్తే రైతులు ఇబ్బంది పడకుండా పనిచేసుకోవచ్చు. ఈ పరికరం వాడటం వల్ల మోకాళ్ళ నొప్పులు కూడా ఉండవు.
ఈ పరికరాన్ని రెండు వస్తువులతో తయారు చేసుకోవచ్చు. ఈ రెండు వస్తువులతో మనం కూడా ఈ పరికరాన్ని ఇంటి దగ్గరే తయారు చేసుకోవచ్చు. ఈ పరికరానికి రెండు స్పాంజ్, నాలుగు అడుగుల సర్కిల్ పైప్ ఉంటే చాలు. ఈ పరికరాన్ని పొలంలో కలుపు తీయడానికి, మొక్కలు నాటే సమయంలో వాడుకోవచ్చు.
భగత్ ఈ పరికరంతో పాటు ఇంకో పరికరం తయారు చేసారు. రైతులు పంట వేసాక రాత్రిళ్లు ఆ పంటని అడవి పందులు తిన్నకుండా ఉండడానికి. రైతులు రాత్రి సమయంలో పంటకి కాపలా ఉండకుండా ఆటోమేటిక్ సౌండ్ మెషిన్ తయారు చేసారు. మార్కెట్లో చాల రకాల ఆటోమేటిక్ సౌండ్ మెషిన్ ఉన్నాయి వాటి ఖరీదు ఎక్కువ ఉండటంతో భగత్ తక్కువ ఖర్చుతో తయారు చేసారు.
ఈ పరికరానికి ఒక గాలికి తిరిగే ఫ్యాన్, ఒక ట్యూబ్, రెండు ప్లేట్స్, కొన్ని మువ్వలు. ఈ మువ్వలని ఒక ప్లేట్ చివర రంద్రం చేసి పెట్టాలి. ఈ ప్లేట్ ఒక పైప్ ద్వారా ఫ్యాన్ కనెక్ట్ చేయాలి. ఈ ప్లేట్ అడుగు భాగంలో ఇంకో ప్లేట్ పెట్టాలి. గాలికి ఫ్యాన్ తిరగడంతో మువ్వలు ఉన్న ప్లేట్ తిరిగి అడుగు భాగంలో ఉన్న ప్లేట్ సౌండ్ చేస్తుంది. ఈ సౌండ్ వల్ల అడవి పందులు పొలంలోకి కాకుండా ఈ ఆటోమేటిక్ సౌండ్ మెషిన్ వాడుకోవచ్చు. ఈ పరికరం కేవలం 1000 రూపాయలకి భగత్ గారు రైతులకి ఇస్తున్నారు. ఈ పరికరాన్ని కొన్నుకోవాలి అనుకున్న వారు నెంబర్..8341904658కి సంప్రదించండి.
Also Read: Minister Niranjan Reddy: పత్తి విత్తనాలు అధిక ధరలకు అమ్మితే కఠినచర్యలు – మంత్రి నిరంజన్ రెడ్డి