Garlic Cultivation: ఈ మధ్య కాలంలో అందరూ కార్పొరేట్ జాబ్స్ చేస్తూ వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయంలో ఆధునిక పధాతులు వాడుతూ, కొత్త రకం పంటలను పండిస్తున్నారు. వాణిజ్య పంటలకు కార్పొరేట్ జాబ్ కన్నా ఎక్కువ లాభాలు వస్తున్నాయి. ఇప్పుడు వాణిజ్య పంటల్లో వెల్లుల్లి ద్వారా రైతులు ఆరు నెలల్లో 10లక్షల వరకు సంపాదించవచ్చు.
భారతీయ వంటలో అల్లం, వెల్లుల్లి లేనిది వంట పూర్తి చేయలేరు. ప్రతి ఇంట్లో అల్లం, వెల్లుల్లి తప్పనిసరిగా వాడుతారు. మనదేశంలో వెల్లుల్లిని నేరుగా వాడడంతో పాటు పౌడర్, పేస్ట్, చిప్స్ ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. వెల్లుల్లి సుగంధ ద్రవ్యంగా, ఔషధంగా, కూరగాయగా, ఊరగాయగా, మసాలాగాను వాడుతారు. రక్తపోటు, కడుపు వ్యాధులు, జీర్ణ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్, కీళ్లనొప్పులు వ్యాధులను తగ్గించడానికి ఉపయోగిస్తారు. యాంటీ బ్యాక్టీరియల్, క్యాన్సర్ నిరోధక గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. ఈ వెల్లుల్లి పంటను పండించే రైతులకు భారీగా ఆదాయం వస్తుంది.

Garlic Cultivation
Also Read: Aeroponics Saffron Farming: మట్టి లేకుండా కుంకుమ పువ్వు సాగు చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
వెల్లుల్లి సాగు వానాకాలం ముగిసిన తర్వాత అంటే అక్టోబర్, నవంబర్ నెలల్లో సాగు మొదలు పెట్టాలి. వెల్లుల్లి మొగ్గల నుంచి వెల్లుల్లిని పండిస్తారు. 10 సెం. మీ. దూరంలో మొగ్గలను నాటుతారు. వెల్లుల్లిని ఎలాంటి భూమిలో అయినా సాగు చేయవచ్చు. నీరు ఎక్కువగా నిలువ ఉండే నెలలో వేస్తే పంట సరిగా పండదు. వెల్లుల్లికి తగ్గినంత నీరు మాత్రమే ఇవ్వాలి. ఈ వెల్లుల్లి పంట 5-6 నెలలో కోయవచ్చు. ఈ వెల్లుల్లి పంటకి ఎలాంటి రసాయన ఎరువులు వాడాల్సిన అవసరం లేదు.

Garlic
వెల్లుల్లి ఒక ఎకరం భూమిలో 50 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. వెల్లుల్లికి మార్కెట్లో క్వింటాల్ 10,000-21,000 వస్తుంది. వెల్లుల్లిలో అన్ని రకాల కంటే రియావాన్ రకం మంచి దిగుబడి ఇస్తుంది. ఈ రియావాన్ రకానికి మార్కెట్లో ఎక్కువ డిమాండ్, నాణ్యత బాగుంటుంది. ఒక వెల్లుల్లి గడ్డ 100 గ్రాములు,6 -13 వెల్లుల్లి మొగ్గలు ఉంటాయి. ఈ రియావాన్ రకం వెల్లుల్లి పంట సాగు నుంచి రైతులకి ఒక పంటలో 5-10 లక్షలు లాభాలు వస్తున్నాయి.
Also Read: Minister Niranjan Reddy: మన తెలంగాణ దేశానికే అన్నపూర్ణ – మంత్రి నిరంజన్ రెడ్డి