Paddy Dryer Machine: అకాల వర్షాలతో వరి రైతులు ధాన్యం నానిపోయే, ధాన్యాన్ని ఆరపెట్టుకోవడానికి చోటు లేక ఇబ్బంది పడుతున్నారు. రైతులందరూ పంటలను ఒకేసారి కోయడం వల్ల పాతపద్దతులో నేలపై లేదా రోడ్డుపై ధాన్యాన్ని ఆరపెట్టడానికి ఇబ్బంది పడుతున్నారు. అకాల వర్షం వాళ్ల రోడ్డుపై లేదా నేలపై ఆరపెట్టిన ధాన్యం తడిచి నాణ్యత కోల్పోతుంది. నేలపై ఆరపెట్టిన ధాన్యం కూడా భారీ వర్షాల వల్ల తడిచిపోయే అవకాశం ఉంది. అనుకూలమైన వాతావరణం లేని పరిస్థితులో కూడా ధాన్యాన్ని కొన్ని గంటలలోనే నాణ్యతతో ఆరపెట్టుకోవడానికి ట్రాక్టరతో నడిపే ప్యాడి డ్రైయర్ అందుబాటులోకి వచ్చింది. ప్యాడి డ్రైయర్ తో రైతులు ఎలాంటి పరిస్థితులో ఆయన ధాన్యం నాణ్యతగా ఆరపెట్టుకోవచ్చు .
ధాన్యాన్ని కంబైన్ హార్వెస్టర్ ద్వారా కోసిన తర్వాత తేమ తగ్గే వరకు ఆరపెట్టకపోవటం వల్ల 10 శాతం వరకు నష్టం వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ తేమ ఉన్న ధాన్యాన్ని బస్తాల్లో ఉంచడం వల్ల ధాన్యం ఉష్ణోగ్రతకి రంగు మారి, ముక్క పురుగులు పట్టే అవకాశం ఉంది. అలాగే ఆ ధాన్యం ఉంచడం వల్ల బూజు పట్టి, ఫంగల్ ఇన్ఫెక్షన్, వాసన వస్తుంది.
ఈ ప్యాడి డ్రైయర్ ధాన్యాన్ని నాణ్యత, మొలక శాతం తగ్గకుండా 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో ధాన్యాన్ని ఆరపెడుతుంది. నేలపై ఉంచి విద్యుత్/డీజిల్ జనరేటర్ ద్వారా 12 టన్నుల వారికి ధాన్యాన్ని ఆరపెట్టుకోవచ్చు. ట్రాక్టరతో పొలం దగ్గరికి ప్యాడి డ్రైయర్ తీసుకొని వెళ్లి అక్కడే బ్యాచ్ పద్దతిలో ఆరపెట్టుకోవచ్చు. ఒక బ్యాచ్ 2 నుంచి 70 టోన్స్ వరకి ఆరపెడుతుంది. మొబైల్ డ్రైయర్ ద్వారా 2 బ్యాచ్ పధాతులో డ్రైయింగ్ చేయాలి . మొదట డ్రైయింగ్ 17-18% వారికి తర్వాత 13% వరకి తేమ తగ్గించాలి. ఒక బ్యాచ్ 35 బస్తాలు ఆరపెడుతుంది.
Also Read: Mixed Rice – Fish Cultivation: వరి పంటలో చేపలను పెంచడం ఎలా ?
ఈ మొబైల్ ప్యాడి డ్రైయర్ సహాయంతో మొక్కజొన్నలు , బార్లీ , గోధుమలు కూడా ఆరపెట్టుకోవచ్చు .ఈ మొబైల్ ప్యాడి డ్రైయర్ పి .టీ .ఓ ద్వారా, 35-65 హెచ్ పి ట్రాక్టర్ కనెక్ట్ చేసి ఉపయోగించవచ్చు . పాతపద్ధతిలో ఆరపెట్టే సమయంలో 20% సమయంలోనే మొబైల్ డ్రైయర్ కోసిన ధాన్యాన్ని వెంటనే ఆరపెడుతుంది, ఆరిన ధాన్యం వెంటనే బస్తాలో నింపి, అమ్ముకునే అవకాశం.ఈ మొబైల్ ప్యాడి డ్రైయర్ శ్రమను తగ్గిస్తుంది. ధాన్యంలో ప్రతి గింజ సమానంగా ఆరడం ద్వార ధాన్యం ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది, ఎక్కువ ధరకి అమ్ముకోవచ్చు.
వరి ధాన్యంలో తేమ శాతం 22-24% ఉన్నపుడు కంబైన్ హార్వెస్టర్ ద్వారా వరిని కోస్తారు. ధాన్యం కోసిన 24 గంటలో తేమ 17-18% తగ్గిస్తే గింజ నాణ్యత కోల్పోకుండా ఉంటుంది. తేమ 12-13% తెగ్గిస్తే వరి ధాన్యం ఆరు నెలలు ఫై నిల్వ ఉంటుంది. 12% తేమ తగ్గిస్తే సంవత్సరం వారికి ధాన్యం నిల్వ ఉంటుంది. నూక శాతం తగ్గి, మొలక శాతంలో తేడా లేకుండ ఉంటుంది. ఈ గింజలను విత్తనాలుగా వాడుకోవచ్చు. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం 50 – 60% సబ్సిడీకి ప్యాడి డ్రైయర్ అందిస్తుంది.
Also Read: YSR Rythu Bharosa: ఏపీ రైతులకు శుభవార్త.. ఎల్లుండి అకౌంట్లోకి డబ్బులు.!