యంత్రపరికరాలు

Flying Robot: కూలీలు లేకుండా పండ్లను కోయడం ఎలా ?

2
Innovative Flying Robot
Innovative Flying Robot

Flying Robot: పండ్ల కోత సమయానికి రైతులు కూలీలు దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు. కూలీలు దొరక్క కోత ఆలస్యం అవుతుంది, దాని వల్ల పండ్ల నాణ్యత కోల్పోతున్నాయి. పండ్లని చీడపీడలు ఆశించడం వల్ల పండ్లు నాణ్యత కోల్పోవడంతో రైతులకి తక్కువ ధర వస్తుంది. చీడపీడలు గుర్తించి, పండ్లను సరైన సమయంలో కోయడానికి, పెరిగిన కూలీలా ఖర్చు, కొరత తగ్గించడానికి, ఎత్తయిన చెట్ల నుంచి పండ్లను కోయడానికి రోబోలు వచ్చేశాయి.

పండ్ల తోటలో నేలపై కదులుతూ పండ్లను, కూరగాయలను కోసే రోబోలు వున్నాయి. గాలిలో ఎగురుతూ ఎత్తయిన చెట్ల పండ్లను కోసే రోబోలు కూడా వున్నాయి. ఈ రోబోకి మీటర్ పొడవు వుండే ఇనుప చేతిని పెట్టి ఉంటుంది. ఈ చేతిని కోయాల్సిన పండు రకాన్ని బట్టి మార్చుకుంటుంది. చేతికి సెన్సార్లు ఉండటం వల్ల ఏ రంగు, ఏ సైజు పండ్లను కోయాలి, ఏది అవసరం లేదు అనే విషయాలు ఫీడ్ చేసి ఉంటాయి.

Also Read: Harvesting Turmeric: పసుపు బంగారం పండాలంటే ఇదే సమయం..

Flying Robot

Flying Robot

ఈ రోబోలు మెషిన్‌ లెర్నింగ్‌ అల్గోరిథమ్స్‌ సెన్సార్లు, కామెరాల సహాయంతో పక్వానికి వచ్చిన పండ్లను కచ్చితంగా గుర్తించి కోస్తాయి. ఈ రోబోలు చెట్లపై ఎగురుతూ ఒకేసారి నాలుగు పండ్లను కోసి వ్యాన్‌/ బుట్టలో జాగ్రత్తగా పెడతాయి. ఈ రోబోలు ఆప్‌తో పనిచేస్తూ రైతులు ఉపయోగించడానికి సులువుగా ఉంటుంది. ఈ రోబోని ఉపయోగించడం వల్ల పండ్ల కోత ఎంత పూర్తయ్యింది , పండ్లపై చీడపీడల ప్రభావం ఉందా అనే విషయాన్ని రైతుకి తెలియజేస్తాయి. ఈ రోబోలు రాత్రీ పగలు నిరంతరాయంగా పండ్లని కోస్తాయి.

ఆపిల్స్, అవకాడో, పియర్స్, నారింజ, మామిడి మొదలైన పండ్ల కోతలో ఈ రోబోని ఉపయోగించవచ్చు. పండ్ల రకం , పండ్ల సైజు , చెట్టు వయసును బట్టి ఒక రోబో రెండున్నర ఎకరాల పండ్లని కోస్తుంది.

Also Read: Organic Fertilizer: అధిక గాఢత కలిగిన సేంద్రియ ఎరువుల గురించి తెలుసుకుందాం.!

Leave Your Comments

Minister Niranjan Reddy: విజయ బ్రాండ్ ఉత్పత్తులను అందరూ ఆదరించాలి – మంత్రి నిరంజన్ రెడ్డి

Previous article

Lemongrass Cultivation: లెమన్ గ్రాస్ పెంచండి ఆదాయం పెంచుకోండి.!

Next article

You may also like