Agricultural Mechanization: భారతదేశంలోని గ్రామీణ స్త్రీలు ఇంటిపనులలో చాలా సమయం గడపటమే కాకుండా రోజుకు 6 నుండి 8 గంటలు వ్యవసాయ పనుల్లో పాల్గొంటున్నారు. ఇలా నిరంతరం పని చేయటం వలన చాలా శారీరక శ్రమకు గురవుతున్నారు. అలానే కొంతమంది స్త్రీలు ఇంటి పనులు, వ్యవసాయ పనులే కాకుండా వ్యవసాయ అనుబంధిత రంగాలైన కోళ్ల పెంపకం, పశు పరిశ్రమ, గొర్రెలు, మేకల పెంపకం వంటి వాటిలో కూడా పాల్గొని తమ జీవనోపాధికి చాలా శ్రమ పడుతున్నారు. ఈ రీతిగా గ్రామీణస్త్రీల పాత్ర గృహ, వ్యవసాయ మరియు అనుబంధిత రంగాలలో ఎంతోఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు తమ పరిశోధనలలో స్త్రీల శారీరకశ్రమని తగ్గించటానికి కొన్ని సాంకేతిక పరికరాలు కనుగొని వాటిని భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఉపయోగించటం ద్వారా శారీరక శ్రమ చాలా తగ్గిందని ఫలితాలలో వెల్లడించారు.
వ్యవసాయ పనులలో స్త్రీలు సామాన్యంగా విత్తనాలు శుద్ధి చేయటం, విత్తనాలు నాటడం, నారు వేయటం, కలుపు తీయటం, పంటలను మోపుగాకట్టటం, మోపులు మోయడం, నూర్చడం, బలవడం లేదా కోయడం,తూర్పారపట్టడం మొదలగు పనులు చేస్తున్నారు.
స్త్రీలు పని చేసేటప్పుడు కనుక గమనిస్తే పనులన్నీ ఎక్కువ సేపు నడుమును సుమారు 60 డిగ్రీల వరకు వంచి పని చేయవలసి వస్తుంది. దీని వలన గుండె జత్తిడికి గురై నిమిషానికి సుమారు 148 సార్లు వేగంగా కొట్టుకోవటం జరుగుతుంది. అదే విశ్రాంతిగా ఉన్నప్పుడు నిమిషానికి 78 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది. మరి స్త్రీలు పని చేసేటప్పుడు వంగ కుండా ఉండటానికి ప్రత్యామ్నాయంగా కొన్ని సాంకేతిక పరికరాలు వినియోగిస్తే శారీరకశ్రమ తద్ది గుండె బత్తిడి తగ్గి అలసట లేకుండా శరీరాన్ని కాపాడుకోవచ్చు.
Also Read: Pests of Black and Green Gram: రబీ మినుము, పెసరలలో సస్యరక్షణ చర్యలు.!
ఈజీ ప్లాంటర్ :
మెట్టపంటలో నాగలి వెనుక స్త్రీలు విత్తనం నడుము వంచి సాళ్ళలో చల్లుకుంటూ పోతారు. నడుము పంచకుండా అదే పనిని సమర్ధవంతంగా చేయటానికి ఈజీ ప్లాంటర్ ఉపయోగపడుతుంది. ఈజీ ప్లాంటర్ ద్వారా పైనున్న శంఖాకారపు గొప్పల ద్వారా విత్తనం జారవిడిస్తే అది సాళ్లలో వేర్వేరు లోతులకు చేరి సరైన రీతిలో భూమిపై పడుతుంది.ఈ పరికరంతో ఒక మనిషి గంటకు ఒక అర ఎకరం పొలంలో సులభంగా విత్తుకోవచ్చు.
మొక్కజొన్న గింజలు వలిచే సాధనం – మెయిజ్ షల్లర్ :
ఎండిన మొక్కజొన్న గింజలను వేరు చేయడానికి ఈ ట్యూబును ఉపయోగించవచ్చు. ఇందులో అమర్చబడిన బ్లేడు వల్ల, కండెలను అటూ ఇటూ త్రిప్పుతూ గింజలను వలవవచ్చు. ఈ పరికరం సహాయంతో గంటకు సుమారు 70 నుండి 80 వరకు కండెల నుండి గింజలను వేరు చెయ్యవచ్చును. ఈ పరికరమును చేతితో వాడేదురు.
కలుపు తీసే పరికరాలు – వీడర్స్ :
ఈ పరికరాన్ని చేతితో నడుపుతూ ఉన్నపుడు వాటికి అనుసంధానమైన కలుపు తీసే చక్రాలు తిరుగుతూ కలుపు ని పెకలించి వేస్తాయి.
సాళ్లలో నాటిన పంటలలో కలుపు తీసేందుకు స్త్రీలు చిన్న కొడవళ్లను, వాడుతుంటారు. స్త్రీలు కలుపు తీసేటప్పుడుమోకాళ్లపై కూర్చుని లేదా వంగి పని చేయడం వల్ల శారీరక శ్రమకి గురవుతున్నారు. దీనికి ప్రత్యామాయంగా చక్రాల దంతి. దీని ద్వారా సుమారు 25 మి.మీ. – 30 మి.మీ. లోతువరకు కలుపు తీయవచ్చు.ఈ పరికరంతో ఒక మనిషి ఒక ఎకరం పొలంలో కలుపు తీయుట సుమారు రెండు గంటలు పడతుంది.
Also Read: Mango Cultivation Techniques: మామిడి తోటలలో పూత, పిందె దశల్లో యాజమాన్యం.!