యంత్రపరికరాలు

Rotovator and Rotopuddlers Uses: వరిలో రోటోవేటర్ మరియు రోటోపడ్లర్ యొక్క ఉపయోగాలు.!

3
Rotovator and Rotopuddlers
Rotovator and Rotopuddlers

Rotovator and Rotopuddlers Uses: వరి సాగులో దమ్ము చేయడం నుంచి నూర్చే వరకు రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కూలీల కొరత దీంతో రైతులు సకాలంలో పనులు చేపట్టలేక తీవ్ర ఇబ్బందులకు గురవడమే కాకుండా నష్టాలను చవి చూస్తున్నారు. ఇలాంటి కూలీల కొరతను అధిగమించి వ్యవసాయాన్ని లాభసాటిగా సాగించాలంటే ఆధునిక యంత్ర పరికరాలను వినియోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వరి సాగులో రైతులుకు పలు రకాల యంత్రాలు అందుబాటులో ఉన్నాయి దీనికి సర్కారు సైతం రాయితీలను అందజేస్తోంది కొన్నిచోట్ల కష్టం హైరింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి సాగుదారులకు అద్దికి ఇవ్వడం కూడా జరుగుతుంది .

వివిధ పనులకు ఉపయుక్తంగా ఉండే ఈ యంత్ర పరికరాలను సమయానుకూలంగా వినియోగించుకున్నట్లయితే ఖర్చులు , శ్రమను తగ్గించుకొని సాగును సకాలంలో చేపట్టడమే కాకుండా పంటను శాస్త్రీయంగా పండించి అధిక దిగుబడులను పొందే అవకాశం ఉంది. వరిలో మనకి విత్తనం విత్తుకున్నపటి నుంచి ధాన్యాన్ని సంచుల్లో నింపేదాకా కూడా మనకి యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. వరి పొలాన్ని తయారు చేసుకోవడం అంటే దమ్ము చేసుకోవడానికి రోటోవేటర్లు ఎంతో ఉపయోగంగా ఉంటాయి. ఈ రోటోవేటర్లు మనకి నాలుగు చక్రాల డ్రైవ్ తో వచ్చే ట్రాక్టర్ కి తగిలించుకున్నట్లయితే దమ్ము పొలంలో చక్కగా దమ్ము చేసుకోవచ్చును , కేజ్ వీల్స్ తో చేసిన దానితో పోలిస్తే మనకి రోటోవేటర్తో చేసిన దమ్ము చేసిన పొలం ఎంతో మెత్తగా వస్తుంది , మనకి నీళ్లు నిలబడడానికి ఎంతో చక్కటి ఆస్కారం ఉంది.

Also Read: National Livestock Mission Subsidy Scheme: గొర్రెలు, మేకల పెంపకంపై రూ.50 లక్షల సబ్సిడి.!

Rotovator and Rotopuddlers Uses

Rotovator and Rotopuddlers Uses

మనం కేజ్ వీల్స్ ను వాడినప్పుడు బాగా దిగబాటు నేలలు తయారవుతాయి, అదే రోటోవేటర్ తో దమ్ము చేసినప్పుడు వరి పిలకలు యొక్క వేర్లు ఎంతవరకు ఉంటాయో అంతవరకు నీరు చక్కగా చేరుతుంది. రైతులు దమ్ము చేయడానికి నాలుగు చక్రాల డ్రైవ్ తో గాని లేక హాఫ్ కేజ్ ల ట్రాక్టర్ తో గాని రోటోవేటర్ ని వాడినట్లయితే ఈ చౌడు సమస్య బాగా తగ్గుతుంది . కేజ్ వీల్స్ తో పోలిస్తే రోటవేటర్తో దమ్ము నాణ్యతే కాదు ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి అంటున్న వ్యవసాయ పరిశోధకులు.

మామూలుగా నాలుగు నుంచి ఐదు సార్లు చేయాల్సిన పొలం తయారీ పనులను రోటోవేటర్తో రెండు సార్లు చేస్తే సరిపోతుంది . ఇప్పుడు రోటోవేటర్ను పోలిన మరో కొత్త పరికరం అందుబాటులోకి వచ్చింది అదే రోటోపడ్లర్ ఇది రోటోవేటర్ కన్నా తడి పొలాల్లో అత్యంత సమర్థవంతంగా పనిచేస్తోంది. రోటోపడ్లర్ లో ఆ తేడా బ్లేడ్లలో కనబడుతుంది. రోటోవేటరుకు L ఆకారపు బ్లేడ్ ను వాడితే, రోటోపడ్లర్లో S ఆకారపు బ్లేడ్లను వాడుతారు. ఈ S రకం బ్లేడ్ నీటిలో తిరగడానికి అత్యంత అనువుగా ఉంటుంది , గడ్డి ఉన్నా చుట్టుకుపోదు, పొలంలోని గడ్డిని లేదా పచ్చిరొట్టను చిన్న చిన్న తునకలుగా చేసి కుల్లబెట్టడానికి, నేలను చదును చేయడానికి కూడా ఈ రోటోపడ్లర్ను ఉపయోగించవచ్చును. దమ్ము చక్రాలతో దమ్ము చేసేటప్పుడు ట్రాక్టర్ తిరగబడే ఆస్కారం ఉంది అలాంటి ప్రమాదాలను కూడా ఈ రోటోపడ్లర్ తో నివారించవచ్చు.

Also Read Chemical Fertilizers for Rabi Pears: రబీ పైర్లకు వాడే రసాయన ఎరువుల సమర్ధ వినియోగం.!

Leave Your Comments

Chemical Fertilizers for Rabi Pears: రబీ పైర్లకు వాడే రసాయన ఎరువుల సమర్ధ వినియోగం.!

Previous article

Sri Method in Sugar Cultivation: చెరకు సాగుకు ‘‘శ్రీ’’ పద్ధతి లాభదాయకం.!

Next article

You may also like