Working of Chaff Cutter: పశువుల మేతకు అవసరమగు చొప్ప లేక పశుగ్రాసం చిన్న చిన్న ముక్కలుగా పశువులు తినుటకు అనుకూలoగా ఉండునట్లు మరియు నిల్వ ఉంచినపుడు చెడిపోకుండా ఉండుటకు ఉపయోగించు పరికరoను “చొప్ప నరుకు యంత్రం” అంటారు ఇవి ఉపయోగించు శక్తిని బట్టి 3 రకాలు.
1.చేతితో నడుపబడే, 2. పశువులతో నడుపబడునవి, 3. యంత్రoలతో త్రిప్పబడునవి.
చొప్ప నరకు యంత్రములు వాటిలో ఉన్న కత్తుల అమరికను బట్టి 2 రకాలుగా ఉపయోగిస్తారు.
1. సిలిండర్ టైపు : దీనియందు తిరుగుతున్న సిలిండర్ పై కత్తులు వంకరగా ఒక ప్రత్యేక విధానoలో అమర్చబడి ఉంటుంది. ఇందులో 4 నుండి 6 కత్తులు అమర్చబడి ఉంటాయి. ఇది పశ్చిమ భూములలో గడ్డిని ముక్కలుగా చేయు యంత్రము మాదిరి వలె ఉంటుంది. ఇది సాధారణముగా అయిల్ ఇంజన్ తో నడుపబడుతుంది. దీని ఖరీదు ఎక్కువ మరియు దీనిని తయారు చేయట కష్టముతో కూడుకున్న పని. కత్తులను సాన పెట్టి పదును చేయవచ్చు.
ii. ఫ్రై వీల్ టైపు: చేతితో నడుపబడు యంత్రముల యందు 2 కత్తులు ఫ్లై వీలు అమర్చబడి ఉంటుంది. దీని వేగం నిమిషానికి 40-50 చుట్లు తిరుగుతుంది. ‘యంత్ర సహాయంతో తిరుగు వాటితో ఫ్లై వీల్నకు 4-6 కత్తులు అమర్చు తారు. దీనివేగం నిమిషానికి 600-800 వరకు ఉంటుంది.
పనిచేయు విధానo : నరుకవలసిన చొప్పను కన్వేయర్పై వేయునపుడు ఆది అక్కడ నుండి పండ్లు గల 2 చక్రముల మధ్యకు వచ్చి వాటిచే పట్టబడి ఫ్లై వీల్ తిరిగినప్పుడు ముక్కలుగా నరుకబడుతుంది. పళ్లు రీలర్లు రెండు వ్యతిరేక దిశలో తిరుగుట వలన రీలర్ల మధ్య చొప్పను ముందుకు నెట్టబడుతుంది. అవిధoగా నెట్టబడు చొప్ప ఫ్లైవీలనకు అమర్చబడిన కత్తులచే నరుకబడుతుంది. ఈ విధంగా నరకబడిన చిన్న చిన్న ముక్కలను బ్లోయర్ సహాయముతో చొప్పను నిల్వయుంచు గుంతలలోనికి పంపవచ్చు.
Also Read: Agriculture Machines: స్ప్రేయర్ పంప్ మరియు డ్రిప్ ఇరిగేషన్ కిట్ యంత్రాల పాత్ర
యంత్రo సక్రమంగా పని చేయుటకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు : కత్తులు ఇనుప పలకకు దగ్గరగా దీనికి తగలకుండా ఉండాలి. పండ్ల రీలర్లు వేగం సరిగా ఉండాలి. ఫ్లై వీల్ వేగం సక్రమంగా ఉండాలి. కత్తులు పదునుగా ఉండాలి.
యంత్రo పరిరక్షణ మరియు జాగ్రత్తలు : యంత్రంతో పని ప్రారంభించక ముందు వాటిలోని గేర్లు చక్రం, బేరింగులు మొదలగు వాటికి గ్రీస్ లేక అయిలు పెట్టాలి.కత్తులు మరి మొద్దుబారి ఉంటే గ్రేడింగ్ మిషన్ ద్వారా సాన పెట్టాలి.బోల్టులు, నట్టు సరిగా బిగించి ఎటువంటి అవతరములు కలగకుండా చూడాలి. 4. ప్రతి దినము పని పూర్తి అయిన తరువాత కత్తులపై ఉన్న, తేమ, దూళి మొదలగునవి. తుడిచి శుభ్రo చేయ్యాలి.యంత్రoనకు పనిలేకుండా ఉన్నప్పుడు ఫ్లైవీల్ తిరగకుండా తాళము వేసి ఉండాలి.కనీసo సంవత్సరoనకు ఒకసారి మొత్తం మిషన్ను విప్పదీసి అన్ని భాగాలు కిరసనాయిల్ శుభ్రపరిచి తరిగిన భాగములను రిపేర్ చేసి మరల బిగించాలి.
-Rakesh Jhadi
Ph.D. Research Scholar
Department of Agronomy
Bidhan Chandra Krishi Viswavidhyalaya
Contact no:9505410171
Also Read: Agricultural Machines: అధునాతన వ్యవసాయ యంత్రాలు
Must Watch: