యంత్రపరికరాలు

Sprayers Used in Agriculture: పంటలలో ఉపయోగించే వివిధ రకాల స్ప్రేయర్లు.!

0
Agricultural Sprayers
Agricultural Sprayers

Sprayers Used in Agriculture – వీపుపై తగిలించుకొను స్ప్రేయర్ : ఇది బరువు తక్కువగా గల ప్లాస్టిక్ టాంకునొకదానిని కలిగియుండి దాని లోపలి భాగం ఒక పంపు మరియు గాలి గది ఒకటి అమర్చబడి ఉంటుంది. దీనిలో సుమారు 10 నుండి 16 లీటర్ల దాకా రసాయనిక ద్రావణాన్ని నింపవచ్చు. టాంకు పై భాగమున గల మూతను తెరచి ద్రవమును దీనిలోనికి నింపవచ్చు. టాంకు పై భాగమున గల ఒక రంధ్రానికి ప్లాస్టిక్ గొట్టము ఒకటి అమర్చబడి ఉండి దాని రెండవ చివర స్ప్రే” నాజిల్ కలిగి ఉంటుంది.

పనిచేయు విధానo :

ట్యాంక్ లోపల అడుగు భాగమున ఒక వైపు అమర్చబడిన పంపు యందలి పిస్టన్ పైకి క్రిందకు కదిలించుటవలన టాంకులో గల ద్రవం పై వత్తిడి కలుగజేయబడి, ద్రవo రబ్బరు గొట్టము ద్వారా స్ప్రే నాజిల్ను చేరి బయటకు వెదజల్లబడుతుంది. ట్యాంక్ లోపల అడుగు భాగమున ఒక వైపున అమర్చబడిన పంపు యందలి పిస్టన్ పైకి క్రిందకు కదిలించుటకు గానుటాంకులో ఒక హాండిల్ అమర్చబడి ఉంటుంది. ఈ హాండ్లును పైకి, క్రిందకు కదిలించుట వలన ట్యాంకులో గల ద్రవం ఒత్తిడి కలుగచేయు బడి, ద్రవo రబ్బరు గొట్టం ద్వారా స్ప్రే నాజిల్ చేరి అచ్చట మరిగి బయటకు వెదజల్లబడుతుంది. (స్ప్రే చేయవలసిన వ్యక్తి ట్యాంకును అమర్చబడిన బెల్టుల టాంకును చీపుపై భాగమునకు కట్టుకొనవచ్చు.

సంపీడన స్ప్రేయరు :

సంపీడన స్ప్రేయర్లు రెండు రకాలు అవి 1. చేతితో పని చేయు స్ప్రే యంత్రo 2. కాలి పిడేలు ద్వారా పనిచేయించుకొను స్ప్రే యంత్రo.

Also Read: Bucket Sprayer: బకెట్ స్ప్రేయరు ఎలా పనిచేస్తుంది.!

Sprayers Used in Agriculture

Sprayers Used in Agriculture

చేతితో పనిచేయించుకొను స్ప్రేయర్ :

ఈ స్ప్రేయర్ నందు టాంకునుండి బయటికి గాలి పోనివ్వకుండా ఉన్నటువంటి ట్యాంకు అమర్చబడి ఉంటుంది . ఈ ట్యాంకునకు పై భాగమున ఒక గాలి పంపు అమర్చబడి ఉండి దీనిని పని చేయించుటకు గానూ ఒక హాండిలు అమర్చబడి ఉంటుంది. ట్యాంకును ఒక చివర ప్లాస్టికుతో చేసిన స్ప్రే గొట్టము ఒకటి అమర్చబడి ఉండి దీని రెండవ చివర స్ప్రే నాజిల్ కలిగి ఉంటుంది .

పని చేయు విధానo :

ముందుగా ట్యాంకు మూత తెరచి దానిలో 3/4వ వంతు వరకు పిచికారి చేయవలసిన రసాయనిక ద్రావణాలు నింపాలి. తరువాత మూతను గట్టిగా బిగిం చాలి.పిమ్మట ట్యాంకుపైన గల హాండలును పనిచేయించుట ద్వారా ట్యాంకులోనికి గాలిని పంపాలి . దీనివలన ట్యాంకులోని ద్రవo పై భాగమున గల గాలి పీడనం ఎక్కువ అవుతుంది. తగినంత పీడనo వచ్చినది లేనిది ట్యాంకునకమర్చిన పీడన మాపకము ద్వారా గుర్తించవచ్చు. తగినంత పీడనము రాగానే హాండిల్ పనిచేయించుట ఆపి స్ప్రేయరు గొట్టాలకు అమర్చిన మీటరును నొక్కుట ద్వారా ద్రవo నాజిల్ ద్వారా బయటకు వెదజల్లబడుతుంది. ట్యాంకులో గాలి పీడనం తక్కువైన కొలది స్ప్రే వేగం తగ్గుతుంది. అందువలన హాండిల్కు పనిచేయిస్తూ ట్యాంకులోని పీడనo తగినంత ఉండేటట్లు చూసుకోవాలి.

కాలి పిడేలుతో పనిచేయించుకొను సంపీడన స్ప్రేయర్ :

ఈ స్ప్రేయరునందు ఒక చిన్న బారెల్ మరియు దానిలో కదిలెడి పిస్టన్ కలిగి ఉంటుంది. బారెల్ అడుగు భాగoకు ప్లాస్టిక్ గొట్టo ఒకటి కలుపబడి ఉండి -దాని రెండవ చివర స్ప్రేయరు ద్రవoతో నింపిన ఒక పాత్రలో ద్రవములో మునిగినట్లు పెట్టబడి ఉంచాలి. బారెలకు పై భాగoన మరియొక గొట్టo అమర్చబడి ఉండి దాని రెండవ చివర నాజిల్ అమర్చబడి ఉంటుంది. ఈ స్ప్రేయరు ఇత్తడితో తయారు చేయబడి ఉంటుంది. ఈ బారెల్ ఒక ఇనుప స్టాండునకు మధ్యగా బిగించబడి ఉంటుంది.

పనిచేయు విధానo :

పిడేలును కాలుతో నొక్కుతు పనిచేయించుట ద్వారా పిస్టన్ బారెల్ పైకి కిందకూ కదులు తుంది. పిస్టన్ పైకి క్రిందకు కదులుతుంది. పిస్టన్ పైకి పొవునప్పుడు ద్రవoలో మునిగిన ప్లాస్టిక్ గొట్టo ద్వారా స్ప్రేయింగ్ ద్రవo పిస్టన్ కవాటo తెరచుకొని బారెల్లోనికి ప్రవేశిస్తుంది. తిరిగి పిస్టన్ క్రిందకు కదిలినప్పుడు కవాటo మూసుకొని పై కవాటo తెరచు కుంటుంది. ఈ విధంగా మరల పిస్టన్ పైకి క్రిందకు కదలుట వల్ల బారెల్ పై భాగoకు చేరుకొని అక్కడనుండి రెండవ గొట్టములో గల నాజిల్ ద్వారా బయటికి వెదజల్లబడుతుంది. ఈ స్ప్రేయర్ 4 మీ॥ ఎత్తులో ఉన్న పండ్ల తోటలో వినియోగించుటకు వీలౌతుంది.

Also Read: Lemon Grass Spray: తోటలోని తెగుళ్ళ కోసం లెమన్ గ్రాస్ స్ప్రే

Leave Your Comments

African gall Sickness in Cattles: పశువులలో వచ్చే ఆనాప్లాస్మోసిస్ వ్యాధి ని ఇలా నయం చెయ్యండి.!

Previous article

Spices Board Experts: సుగంధ ద్రవ్యాల బోర్డు నిపుణులు.!

Next article

You may also like