Rabi Crop Seed Treatment: రైతులు అధిక దిగుబడి సాధించాలంటే నాణ్యమైన విత్తనం అనేది ఎంత ముఖ్యమో విత్తన శుద్ధి చేసుకుని విత్తనాన్ని వాడటం అనేది కూడా అంతే ముఖ్యమైన విషయం అనే నానుడి అందరికీ తెలిసిన విషయమే. మంచి విత్తనం అయితే మంచి పంట చేతికి వస్తుంది. ‘‘విత్తుకొద్ది పంట’’ అనే నానుడి అందరికీ తెలిసిన విషయమే. మంచి విత్తనం అయితే మంచి పంట చేతికి వస్తుంది. అదే శిలీంధ్రం ఆశించిన విత్తనం అయితే దిగుబడి శాతం తగ్గి నాణ్యత కూడా లోపిస్తుంది కాబట్టి విత్తన మొలక శాతం తెలుసుకొని చేసుకోవాలి.ముఖ్యంగా రబీ (వేసంగిలో)లో వేసే నూనెగింజల పంటల్లో ప్రధానమైన పంట వేరుశనగ ఈ పంట విత్తనాల్లో మొలక శాతం 70 ఉండాలి. అదే అపరాల్లో శనగ ముఖ్యమైన పంట. ఈ విత్తనాల్లో ముఖ్యంగా మొలక శాతం 85 శాతం ఉండాలి. రైతులు పొలం నుండి విత్తనాన్ని ఎంపిక చేసుకొని కానీ లేదా డీలర్ వద్దనుండి కానీ ప్రభుత్వం విత్తనాభివృద్ధి సంస్థ నుండి గాని మంచి నాణ్యమైన విత్తనాన్ని ఎన్నుకొని విత్తే ముందు రైతులు విత్తనశుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి.
విత్తన శుద్ధి చేయడం వలన వివిధ రకాలైన శిలీంధ్రాలు, కీటకాలు ఆశించిన విత్తనాలు ఆదిలో అరికట్టవచ్చును. మొలిచిన మొక్కలో ఈ రోగకారక శిలీంధ్రాల బారి నుండి పలు రకాలైన విత్తనాలను రక్షించుకోవాలంటే విత్తనశుద్ధి ఆవశ్యకత ఎంతైనా ఉంది.విత్తన శుద్ధి చేసేటప్పుడు ముందుగా శిలీంధ్రనాశినితో శుద్ధి చేసిన తరువాత కీటకనాశినితో శుద్ధి చేయాలి. చివరిగా జీవనియంత్రకాలతో శుద్ధి చేయాలి.
విత్తన శుద్ధి చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు :
- విత్తన శుద్ధి చేసే రసాయనాలు మనుషులకు, పశువులకు అపాయకరమైనది కాబట్టి వీలైనంత జాగ్రత్తగా ఉండాలి.
- విత్తన శుద్ధి చేసిన విత్తనాలను ధాన్యంగా తినడానికి గాని పశువుల దాణాగా గాని వాడరాదు.
- విత్తన మోతాదు మించి విత్తనశుద్ధి చేయకూడదు. అలా చేయడం వలన విత్తనం లోపలి భాగాలకు కూడా హాని జరిగి విత్తన మొలకశాతం తగ్గిపోతుంది.
- విత్తనశుద్ధిని సరైన మందుతోనే శుద్ధి చేసుకోవాలి.
- విత్తనశుద్ధి చేసేటప్పుడు విత్తనంలో తేమ శాతం అధికంగా ఉండరాదు.
- విత్తనం పై పొర ఊడిపోకుండా విత్తనశుద్ధి చేయాలి.
వేరు శనగ : ఈ పంటలో వేరు కుళ్లు తెగులు, మొలక కుళ్ళు ప్రధాన సమస్యలు. ఈ తెగుళ్ల వల్ల మొలక శాతం తగ్గటంతోపాటు విత్తన ఆరోగ్యత నాలుగు నుండి ఆరు నెలల్లో పడిపోవడం జరుగుతుంది. ఈ శిలీంధ్రాలు వల్ల విత్తన నాణ్యత తగ్గటమే కాకుండా నూనె శాతం పై ప్రభావం చూపుతాయి. యాసంగిలో ఒక చదరపు మీటరుకి 44 మొక్కలు ఉండేలా మొక్కల సాంద్రత పాటించాలి. ఈ పంటను ఉత్తర తెంగాణాలో అక్టోబర్ రెండవ పక్షంలో , దక్షిణ తెలంగాణాలో సెప్టెంబర్ మొదటి పక్షం నుండి నవంబర్ రెండో పక్షం వరకు విత్తుకోవచ్చు.కిలో వేరుశనగ విత్తనానికి 1 గ్రా. టెబ్యుకొనజోల్ 2 డి.ఎస్ లేదా 3 గ్రా. మాంకోజెబ్ పొడి మందు పట్టించాలి. వేరుపురుగు ఉధృతి ఉన్న ప్రాంతాల్లో 6.5 మి.లీ. క్లోరిపైరిఫాస్‌లో విత్తనశుద్ధి చేసుకోవాలి. కాండం కుళ్ళు వైరస్ తెగులు ఆశించే ప్రాంతాల్లో 2.0 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ 600 ఎఫ్. ఎస్‌ను 7 మి.లీ. నీటిలో కలిపి ఒక కిలో విత్తనానికి పట్టించాలి.
Also Read: Rabi Crop: చలికాలంలో రబీ పంటల సంరక్షణ.!
శనగ : అపరాల్లో శనగ ప్రధానమైన పంట. ఈ పంటను అక్టోబరు నుండి నవంబర్ మొదటిపక్షం వరకు విత్తుకోవచ్చు. రాష్ట్రంలో శనగ పంటను 1.10 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. విత్తనాన్ని విత్తుకునే ముందు ప్రతి కిలో విత్తనానికి 3 గ్రా. థైరామ్ లేదా కాప్టాన్ లేదా 2.5 గ్రా. కార్బండిజమ్ లేదా 1.5 గ్రా. విటావక్సా పవర్‌తో విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి. మొదటిసారి పంట పొలంలో శనగ వేసినట్లయితే 200 గ్రా. రైజోబియం మిశ్రమాన్ని 300 మి.లీ. నీటిలో 10 శాతం బెల్లం మిశ్రమం కలిపి 8 కిలోల విత్తనాలకు సరిపోతుంది. వాటిని బాగా ఆరబెట్టి పొలంలో విత్తుకోవాలి. ఇలా చేయడం వల్ల పంటను ప్రధానంగా నష్టపరచే ఎండు తెగులు, వేరుకుళ్ళు తెగులు ఆదిలోనే అరికట్టవచ్చు.
పత్తిలో తెగుళ్ళ లక్షణాలు`సమగ్ర నివారణతలమాడు లేదా టొబాకోస్ట్రీక్ వైరస్ తెగులు,బూడిద తెగులు మరియు కాయ కుళ్ళు
ఉభయ తెలుగు రాష్ట్రాలలో పండిరచే వాణిజ్య పంటల్లో ముఖ్యమైన పంట పత్తి. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల అధిక వర్షాలు ఈ సంవత్సరంలో ఎక్కువగా ఉండటం వలన తలమాడు తెగులు, బూడిద తెగులు మరియు కాయ కుళ్ళు తెగులు ఆశించి పంటను తీవ్ర నష్టం కలుగ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రత్తి పూత దశ నుండి కాయ దశలో ఉన్నది.
తలమాడు లేదా వైరస్ తెగులు లక్షణాలు : ఈ తెగులు ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల వివిధ జిల్లాలలో గుర్తించడం జరిగింది. ఈ తెగులు వచ్చిన మొక్కలు లేత ఆకులు ఆకుపచ్చ రంగు నుండి పసుపు రంగులోకి మారుతాయి. ఆకులు ఉండవలసిన పరిమాణం కన్నా చాలా చిన్నవిగా ఏర్పడతాయి. తెగులు ఉద్ధృతి ఎక్కువైనప్పుడు కొమ్మలు కూడా నలుపు రంగులోకి మారి విరిగిపోతాయి. చివరకు మొగ్గలు, పువ్వులు మరియు కాయలు కూడా రాలిపోతాయి.
వ్యాప్తి :వయ్యారిభామ పుప్పొడి రేణువులు మరియు కలుపు మొక్కల ద్వారా ఈ తలమాడు తెగులు పత్తి మొక్కలకు తామర పురుగు ద్వారా వ్యాప్తి చెందుతుంది.
నివారణ :పత్తి పొలంలో, గట్లు (కాలువల) వెంబడి ఉండే వయ్యారిభామ, గడ్డిచామంతి, ఉత్తరేణి మొదలగు కలుపు మొక్కలను పూతకు ముందు తీసివేసి కాల్చివేయాలి.
ఈ తెగులు తామర పురుగు ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఒక లీటరు నీటిలో ఫిప్రోనిల్ 2 మి.లీటర్లు లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మిల్లీ లీటర్లు మందులను కలిపి పిచికారీ చేయాలి.
బూడిద తెగులు :
లక్షణాలు :ఈ తెగులు మొదట ఈ క్రింది ఆకుల మీద కోణాకారపు తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చల తీవ్రత ఎక్కువైనప్పుడు ఆకులపైన వ్యాపించి పసుపు రంగులోకి మారి ఎండిపోయి రాలిపోతాయి.
తెగులు వాతావరణంలో అధిక తేమ ఉన్నప్పుడు (చలికాలంలో) కాయల మీద కూడా మచ్చలు ఏర్పడి దూది రంగు, తెలుపు నుంచి పసుపు రంగులోకి మారుతుంది.
నివారణ :ఒక లీటరు నీటిలో 3 గ్రా. నీటిలో కరిగే గంధకము కలిపి పిచికారీ చేయాలి. ఈ తెగులు తగ్గనట్లయితే రెండవ సారి హెక్సాకొనజోల్ 2 మి.లీ.లేదా ట్రెబ్యుకొనజోల్ ప్లస్ ట్రైప్లొక్సోస్ట్రోబిన్‌ల మిశ్రమం 0.6 గ్రాములను ఒక లీటరు నీటిలో కలిపి పైరుపై పిచికారీ చేయాలి.
కాయ కుళ్ళు తెగులు:
లక్షణాలు :పురుగులు మరియు గాయాల వల్ల ఏర్పడిన రంధ్రాల ద్వారా శిలీంద్రాలు కాయలోనికి ప్రవేశిస్తాయి. కాయలను తిని తెలుపు రంగులో ఉన్న దూది రంగు పసుపు మరియు నలుపు రంగులోకి మారుతుంది.
నివారణ: తెగులు సోకిన కాయలను ఏరివేసి ఒక దగ్గర వేసి కాల్చివేయాలి. ఈ తెగులు తీవ్రత ఉన్నప్పుడు నత్రజని ఎరువుల వేయరాదు. కాయ కుళ్ళు తెగులు గుర్తించిన వెంటనే 30 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ మరియు ఒక గ్రాము పొషామైసిన్ మందులు 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
పైన చెప్పిన విధంగా తొలిదశలోనే తెగుళ్ల గుర్తించి సరైన సమయంలో సిఫారసు చేయబడిన తెలుగు ఇంద్ర నాశిని మందులనుచేసినట్లైతే పత్తి పంటలు అధిక దిగుబడులను పొందవచ్చు.
-డా. విజయ భాస్కర్ రావు, తెగుళ్ళ శాస్త్రవేత్త,
వ్యవసాయ పరిశోధనా స్థానం,
కరీంనగర్, ఫోన్ : 9849817896
-బి. రాజేశ్వరి, విత్తన పరిశోధన మరియు సాంకేతిక పరిజ్ఞానం రాజేంద్రనగర్, హైదరాబాద్. ఫోన్ : 9912655843
Also Read: Pest Control in Rabi Paddy: రబీ వరిలో ముఖ్యమైన తెగుళ్ళు వాటి నివారణ
Must Watch: