పట్టుసాగు

Late Age Silkworm Rearing: పెద్ద పురుగుల పెంపకంలో మెళుకువలు.!

2
Silkworms
Silkworms

Late Age Silkworm Rearing: పట్టు పురుగులు 3వ జ్వరము లేచినప్పటి నుండి మాగుళ్ళు వచ్చేవరకు మేపడాన్ని పెద్ద పురుగుల పెంపకమంటారు.ఈ దశలో పురుగు లకు తగినంత స్థలావకాశము, మంచి గాలి ప్రసరణ, తగినంత నాణ్యమైన ఆకు చాలా అవసరo. ఐదవ దశ చివరిలో 100 గ్రుడ్ల పురుగులకు 700 – 800 అడుగుల స్థలం అవసరముంటుంది. అందువలన విశాలంగా, గాలి, వెలుతురు ప్రసరించు పెంపకం గది అవసరం పెద్ద పట్టుపురుగుల ఏలి గది అవసరము. పెద్ద పెంపకంలో, గదిలో 25-26°C ఉష్ణోగ్రత మరియు 65 నుండి 70 శాతం తేమ ఉండేలా చూసుకోవాలి.పెద్ద పట్టుపురుగుల పెంపకమునకు అనువైన పెంపకం గది కొమ్మమేత, స్టాండు మరియు పెంపక పద్ధతులను పాటించాల్సిన జాగ్రత్తలను క్రింద వివరించడం జరిగింది.

పట్టు పురుగుల పెంపక గృహం (Silkworm Rearing House): పురుగులు పెంచుగది 3 నుంచి 4 అడుగుల ఎత్తైన ప్రదేశంలో కట్టాలి. గది నిర్మాణం తూర్పు, పడమర దిశలలో ఉండునట్లు కట్టాలి. వీలైనంతవరకు పట్టు పురుగుల పెంపక గది మల్బరీ తోటకు దగ్గరగా ఉండునట్లు కట్టుకొవాలి. అందువలన ఆకు సరఫరా సులభం అవుతుంది. పట్టు పురుగుల పెంపక గది కొలతలు గుడ్లు పెంచు సామర్థ్యం పై ఆధారపడి ఉంటుంది. కొమ్మమేపు పద్ధతికి ఒక గ్రుడ్లు పెంపకానికి సుమారు 3 1/2 చదరపు అడుగుల గది వైశాల్యం ఉండాలి. అదే తలమేపు పద్ధతిలో ఐతే ఒక గ్రుడ్డు పెంపకానికి 2 చదరపు అడుగుల గది సరిపోతుంది.గాలి ప్రసరణకు అనుకూలంగా కిటికీలు, గవాచాలు తగినన్ని 3 వరుసలలో అంటే క్రింది భాగాన, మధ్య భాగాన ఉండేటట్లు చూడాలి.

Also Read: Worms Management in Silkworms: పట్టు పురుగులను ఆశించే పురుగులు వాటి యాజమాన్యం

Late Age Silkworm Rearing

Late Age Silkworm Rearing

పట్టు పురుగుల పెంపక గృహం: పురుగుల పెంపక గది ఆర్.సి.సి (స్లాబ్) అయితే ఎత్తు 12 అడుగుల కన్నా ఎక్కువగా ఉండాలి. అదే సిమెంట్ రేకులు లేదా పెంకులు అయినచో 14-18 అడుగుల ఎత్తు ఉండేలా చూసుకోవాలి..పట్టు పురుగుల పెంపక గది ప్రవేశద్వారం వద్ద మరియొక చిన్న గది ( ఆంటీ చాంబర్) 10 ×10 X10 చదరపు అడుగుల విస్తీర్ణంతో కట్టుకున్న యెడల పరిశుభ్రతకు అనువుగా ఉంటుంది. మరియు డాజి ఈగల నియంత్రణకు ఉపయోగపడుతుంది. పురుగులకు పెంపక గది చుట్టూ 10 అడుగుల వరండా వేయుట మంచిది, దీనివల్ల తీవ్రమైన శీతోష్ణస్థితి పరిస్థితులను నియంత్రించుట గాక, గూళ్ళ అల్లిక సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

పట్టుపురుగుల పెంపకంలో ఆకు నాణ్యత మరియు ఆకు వయస్సు ప్రాముఖ్యత: మొదటి రెండు దశలలో పట్టుపురుగులకు ఆకులు లేతగా, మృదువుగా ఎక్కువ తేమ శాతం, మాంసకృత్తులను, పిండిపదార్థాలను మరియు ఖనిజ లవణాలను కలిగి ఉండాలి. ఈ దశలో ముదురు ఆకులను జీర్ణించుకొను శక్తి చాకీ పురుగులకు తక్కువ.రసాయనిక ఎరువులు వేసిన వెంటనే ఆకులనుమేతగా ఉపయోగించరాదు. ఎరువులు వేసిన 15 రోజుల వ్యవధి తరువాత ఆకులను వాడాలి.

Also Read: Silkworm Chawki Rearing: చాకీ ఆకు నాణ్యత ఎలా ఉండాలి.!

Leave Your Comments

Sunflower Diseases: పొద్దుతిరుగుడు పంటలో వచ్చే తెగుళ్ల నివారణ.!

Previous article

Important Herbicide Properties: కొన్ని ముఖ్యమైన కలుపు మందుల లక్షణాలు.!

Next article

You may also like