Castor Oil Press Machine: సాధారణముగా ఉపయోగించు శక్తిని మరియు విధానమును బట్టి ఆముదము కాయలను 3 విధములుగా వలచవచ్చును.
కట్టెలతో కొట్టుట ద్వారా
చేతితో నడుపు యంత్రం ద్వారా
మోటారుతో నడుపు యంత్రము ద్వారా
కట్టెలతో కొట్టుట ద్వారా:-
వలచబడిన కాయల పరిమాణము తక్కువగా ఉన్నచో ఆముదపు కాయలను కాళ్లములో గాని లేక ఏదైనా గట్టి ప్రదేశములో పలుచుగా పరిచి కట్టెలతో కొట్టుట ద్వారా కాయల నుండి గింజలను వేరు చేయవచ్చును.ఈ విధానమును ఉపయోగించి రోజుకు ఒక మనిషి 100 నుండి 125 కిలోల వరకు ఆముదపు కాయలను వలవచ్చును. ఇది ఎక్కువ శ్రమతో కూడుకున్న పని దీని వలన విత్తనములు పగిలి పోవుటకు అవకాశం కలదు.
చేతితో నడుపు యంత్రము:-
తోట్ట లేక హాపరు
సిలిండరు
కాన్ కేవ్
క్రంక్ వీల్ భాగములుండును
గేరు
హండిలు
ఇనుప చక్రము లేక ఫ్రెమ్ మొదలగునవి.
పనిచేయు విధానము:-
ఇందులో కాయలను ఉంచు తొట్టి గింజలు వెలుపలకు వచ్చు ద్వారము చెక్కలతో చేయబడి సిలిండరు చెక్కలతో చేయబడి కాన్ కేవ్ లు క్రాంక్ వీల్ మరియు చక్రములు ఇనుప చట్రములో బిగించబడి ఉండును. హండీలు మరియు రెండు పళ్ల చక్రముల ద్వారా సిలిండరు అధిక వేగంతో త్రిప్పవచ్చును. సిలిండరు వేగంగా తిరుగునపుడు హాపరు ఆముదపు కాయలు సిలిండరు కాన్ కావే ల మధ్యకు పంపినప్పుడు అవి వాటి మధ్య ఒత్తిడికి కాయలు పగిలి గింజలు మరియు పొట్టు కలిపి గింజలు వెలుపలికి వచ్చు ద్వారము ద్వారా వెలుపలికి వచ్చును. తర్వాత గింజలను పొట్టునుండి తూర్పార బట్టించి వేరు చేయుదురు. దీనిని ఉపయోగించి రోజుకు 800- 900 కిలోల వరకు కాయలు వలచవచ్చును.

Castor Oil Press Machine
Also Read: Insect Pests Management in Castor Crop: ఆముదం పంటను ఆశించు కీటకాలు – యాజమాన్యం
మోటరు సహాయమున పనిచేయు యంత్రము:-
హాపర్
సిలిండర్
కాన్ కేవ్
బ్లోయర్
జల్లెడలు
కప్పిలు
విద్యుత్ మోటరు
కంట్రోలర్
ట్రాన్స్ పోర్టింగ్ వీల్స్
పైన చెప్పబడిన భాగములన్నియు ఇనుప చట్రంతో బిగించబడి ఉండును. ఇందులో కూడా సిలిండరు మరియు కన్ కేవ్ లు కొయ్య చెక్కలతో తయారు చేయబడి ఉండును. ఒక యు బెల్ట్ సహాయముతో బ్లోయారును త్రిప్పునట్లు జల్లెడలను ముందుకు వెనుకకు నడుపునట్లు చేయును
పనిచేయు విధానము:-
హాపరు ద్వారా ఆముదపు కాయలు సిలిండరు కన్ కేవ్ ల మధ్యకు పోయినప్పుడు వాటి మధ్య కాయలు ఒత్తబడి పగిలిపోవును. గింజలు మరియు పొట్టు కలిసిపోయి మొదటి జల్లెడపై పడును. అట్లు పడునప్పుడు జల్లెడలకు ఒక ప్రక్కగా అమర్చబడి బ్లోయరు నుండి వీచుగాలి వేగమునకు పొట్టు వెలుపలకు నెట్టబడును. గింజలు కొంత పగిలిన కాయలు మొదటి జల్లెడపై పడును.
మొదటి జల్లెడపైన రంధ్రములు వలిచిన ఆముదపు గింజలకు సరిపడినంత ఉండును. ఈ రంధ్రములు ద్వారా రెండవ జల్లెడపైన పడును. పగులనవి మరియు రంధ్రముల కంటే పెద్ద ఆకారములో నున్న రాళ్ళు మరియు ఇతర పదార్థములు మొదటి జల్లెడ నుండి బయటకు వచ్చును. ఈ యంత్రమును ఉపయోగించి రోజుకు 2500 కిలోల నుండి 3000 కిలోల వరకు ఆముదపు కాయలు వలచవచ్చును.
Also Read: Castor Threshing: ఆముదం కాయలుఎలా వలుస్తారు.!