యంత్రపరికరాలు

Groundnut Crushing Machine: వేరుశనగ కాయలు వొలుచు యంత్రము

1
Groundnut Crushing Machine
Groundnut Crushing Machine

Groundnut Crushing Machine: కాయలు వలచు ప్లేటు
అర్దవర్తులాకారపు పల్లెపు చట్రము

కాయలు వలచు ప్లేటు:-
దీనిని క్రషింగ్ ప్లేటు అని కూడా అంటారు. ఈ క్రషింగ్ ప్లేటు పోత ఇనుముతో తయారు చేయబడి ఉంటుంది. షాఫ్ట్ నకు 6 లేక 8 రెక్కలు కలిగి యుండి వాటి పై క్రషింగ్ ప్లేటు అమర్చబడి ఉండును. నిముషమునకు సుమారు 125- 150 చుట్లు తిరుగును.

అర్దవర్తులాకారపు పల్లెపు చట్రము:-
దీనిని మిగతా యంత్రములలో కన్ కేవ్ అని అంటారు. కాని ఈ యంత్రములో దీనిని గ్రేట్ అని పిలుస్తారు. ఈ గ్రేట్ నకు మరియు క్రషింగ్ ప్లేటులకు మధ్య కొంత ఖలీ ఉండునట్టు అమర్చుదురు . ఈ ఖాళీని, కాయల పరిమాణమును బట్టి సరిచేయవచ్చును.

Also Read: Soils For Groundnut Cultivation: వేరుశనగ సాగుకు అనువైన నేలలు.!

Groundnut Crushing Machine

Groundnut Crushing Machine

నిర్మాణము:-
ఈ క్రషింగ్ యూనిట్ కు దిగువన జల్లెడలు, ఒక ప్రక్కగా బ్లోయరు బిగించబడి యుండును. ఇవి అన్నియు ఒక ఫ్రేములో బిగించబడి యుండును. యంత్రమును ఒక చోట నుండి మరొక చోటుకు తీసుకొని పోవుటకు వీలుగా చక్రములు కలిగి యుండును.

పనిచేయు విధానము:-
హాపరు ద్వారా పంపబడిన వేరుశనగ కాయలు గ్రేటు మరియు క్రషింగ్ ప్లేటుకు మధ్య నలిగి కాయలు పగిలి గింజలు మరియు పొట్టు గ్రేటునందు గల ఖాళీ రంధ్రముల ద్వారా క్రింద నున్న జల్లెడపై పడును . అట్లు పడునపుడు పొట్టు తేలికగా ఉండుట చేత బ్లోయరు గాలివలన దూరంగా నెట్టబడును. జల్లెడపై పడిన గింజలు గింజల పరిమాణమును బట్టి విరిగినప్పుడు గింజలు ఒక ప్రక్క మంచి గింజలు ఒక ప్రక్కకు, వలచబడిన కాయలు ఒక ప్రక్కకు వివిధ జల్లెడలపై నుండి పడును, యంత్ర సహాయమున నడుపుటవలన రోజుకు సుమారు 20 క్వింటాల్ల వరకు వలచవచ్చును.

Also Read: Pests and Diseases in Groundnut: వేరుశనగ తెగుళ్ళు – నివారణ.!

Leave Your Comments

Animal Husbandry Techniques: జీవాల పెంపకంలో మెళకువలు

Previous article

Castor Oil Press Machine: ఆముదము కాయల వొలుచు యంత్రము

Next article

You may also like