యంత్రపరికరాలు

Sugarcane Juicer Machine: చెరకు రసం తీయు యంత్రాలు

2
Sugarcane Juicer
Sugarcane Juicer

Sugarcane Juicer Machine: చెరకు రసం తీయు యంత్రము ఉపయోగించు శక్తిని బట్టి 3 రకాలు

మనుషుల ద్వారా
పశువుల ద్వారా
యంత్రము ద్వారా

యంత్రము అమరికను బట్టి 2 విధములు
నిలువు రోలర్ ల యంత్రము
అడ్డ రోలర్ ల యంత్రము

ముఖ్య భాగములు:- ప్రతీ యంత్రములోనూ 3 రాకలైన రోలర్ లు అమర్చబడి ఉండును. అవి.
కింగ్ రోలర్
క్రషింగ్ రోలర్
ఎక్స్ ట్రాక్షన్ రోలర్
బకేట్
విద్యుత్తు

నిర్మాణము:- మోటరు సహాయమున పనిచేయు యంత్రము నందు కింగ్ రోలర్ నకు మోటరు యొక్క ఇరుసు మరియు పండ్ల చక్రాల ద్వారా కలయిక కలదు . కింగ్ రోలర్ నకు క్రషింగ్ రోలర్ మరియు ఎక్స్ ట్రాక్షన్ రోలర్ పండ్ల చక్రము ద్వారా కలుపబడి ఉండును. కాని క్రషింగ్ రోలర్ మరియు ఎల్ట్రానను రోలర్ నకు పండ్ల చక్రాల ద్వారా కలుపబడి ఉండును. కింగ్ రోలర్ స్థిరమైన స్థానములో ఉండును. మిగతా రెండు రోలర్ లును చెరకు పరిమాణమును బట్టి వాటి మధ్య ఖాళీ స్థలాన్ని తక్కువగా లేదా ఎక్కువగా మార్చుకొనుటకు వీలుగా ఏర్పాటు చేయబడి ఉండును.

పనిచేయు విధానము:- రసం పిండుటకు రెండు అంతకంటే ఎక్కువ చెరుకు గడలు కింగ్ రోలర్ క్రషింగ్ రోలర్ మధ్యకు పంపబడును. దీని వలన గడల పై గట్టిగా ఉన్న పొర మరియు రసం ఉన్న కణములు బాగా వత్తిబడి అందులో చెరకు రసం చాలా వరకు వెలుపలికి వచ్చును. తరువాత మిగతా రసం కింగ్ రోలర్, ఎక్స్ ట్రాక్షన్ రోలర్ మధ్యకు పోవునపుడు పిప్పి బయటకు వచ్చును. ఈ విధంగా వెలువడిన రసం రోలరుల క్రింద అమర్చిన పళ్లెము ద్వారా యంత్రము దిగువన అమర్చిన బకెట్ లోనికి చేరును. దీని యందు ఉపయోగించు రోలరుల పై భాగాన నిలువగా గాని లేదా అడ్డంగా గాని గాడులు కలిగి ఉండును. వీటి మూలంగా చెరుకు గడలు బాగా వత్త బడును.

Also Read: Integrated Pest Management in Sugarcane: చెఱకు పైరు నాశించు తెగుళ్ల సమగ్ర యాజమాన్య చర్యలు.!

Sugarcane Juicer Machine

Sugarcane Juicer Machine

చెరకు రసం తీయు యంత్రమును నడుపునప్పుడు పాటించబడవలసిన ముఖ్య గమనికలు:-

రోలరుల మధ్య ఖలీ అతి తక్కువగా ఉన్న ఎడల చెరకు రస పరిమాణం పెరుగును.

గంటకు 3 కిలోమీటర్ల వేగంతో నడుపబడు యంత్రముతో ఒకసారి 3 చెరకు గడలనుండి రసం తీయవచ్చును.

రోలరుల మధ్య ఖాళీ అతి తక్కువగా ఉన్న ఎడల చెరకు గడలను పిండుటకు అధిక శక్తి అవసరము .

రోలరుల వేగం మరియు ఎక్కువగా లేక మరీ తక్కువగాను ఉండునట్లు చూసుకొనవలెను.

చెరకు గడలను సమంగా, అపకుండా రోలరుల మధ్య పెట్టవలెను.

రోలర్ పై భాగాన్ని ఉన్న గాడులు అరిగిపోయిన ఎడల వెంటనే రోలరు మార్చుకొనుట గాని, సరిచేయుట గాని, చేయవలెను.

రోలరుల మధ్య ఖాళీ సమంగా లేని ఎడల యంత్రములో అవంఛనియ శబ్దములు వచ్చును.

Also Read: Weed Management in Sugarcane: చెరకులో కలుపు యాజమాన్యం.!

Leave Your Comments

Chili Varieties: మిరప రకాలు – వాటి లక్షణాలు

Previous article

Animal Husbandry Techniques: జీవాల పెంపకంలో మెళకువలు

Next article

You may also like