యంత్రపరికరాలు

Winnowing Machine: తూర్పార పట్టు యంత్రాలు ఎలా పని చేస్తాయి.!

0
Winnowing
Winnowing

Winnowing Machine: ప్రకృతి సిద్ధమైన గాలి లేక కృత్రిమ గాలితో నూర్పిడి చేసిన పంట నుండి గడ్డి మరియు గింజల మిశ్రమాన్ని వేరు చేయడాన్ని “తూర్పార పట్టుట” అంటారు.

చాట: తూర్పార బట్టవలసిన గింజల మిశ్రమంను చేట నిండా తీసుకొని, ఎత్తైన ప్రదేశం లో నిలబడి గాలికి ఎదురుగా క్రిందకు వదులు నపుడు తేలికగా ఉన్నటువంటి గడ్డి మొక్కలు దూరంగా, బరువుగా ఉన్న గింజలు వేసిన స్థలము వద్దనే పడి రెండు రాశులుగా తయార వుతాయి. ప్రకృతి సిద్ధంగా గాలి వీచినపుడు మాత్రమే గింజలను వేరు చేయవచ్చు. అధిక శ్రమ మరియు కూలీల అవసరము ఎక్కువగా ఉన్నటువంటి. అంతేకాక వాతావరణ పరిస్థితులపై ఆధారపడవలసి ఉంటుంది.

గాలి పంకా: దీనిని చేతితో గాని, మోటారు సహాయంతో గాని త్రిప్పవచ్చు. గాలి పంకా 3 లేక 4 రెక్కలు కలిగి ఉండి 90 సెం. మీ నుండి 120 సెం.మీ వ్యాసం కలిగి ఉంటుంది. రెక్కలు గాలిని ముందుకు త్రోయుటకు ఉపయోగపడుతుంది మరియు ముఖ్యoగా నిముషమునకు 250 నుండి 300 చుట్టు తిరిగినట్లయిన తగినంత గాలి వీస్తుంది. ఈ గాలి పంకా నుండి 150 నుంచి 200 సెం. మీ దూరంలో అధిక వేగం మరియు శక్తి కలిగి ఉంటుంది.

Also Read: Weed Management Practices: కలుపు మొక్కల యాజమాన్య పద్ధతులు.!

Winnowing Machine

Winnowing Machine

పని చేయు విధానం: తూర్పార బట్టుట వలన మిశ్రమంను ఈ గాలి పంకాకు ఎదురుగా 1.5 నుండి 2 మీటర్ల దూరమలో క్రిందకు వదులు నపుడు తేలికగా గల పదార్థాలు (గడ్డి తునకలు, దుమ్ము, ధూళి) గాలికి కొట్టుకొని దూరంగా పడుతాయి. బరువుగా ఉన్న గింజలు వేసిన స్థలము వద్దనే పడుతుంది. ఈ విధంగా మిశ్రమం నుండి గింజలను వేరు చేయవచ్చు.

ముఖ్యంగా గమనించవలసిన విషయం ఈ పద్దతిలో గాలిని కృత్రిమంగా సృష్టించడం జరుగుతుంది. కాని అవసరమయ్యే కూలీల సంఖ్య మరియు శ్రమ తగ్గదు.

తూర్పారబట్టు యంత్రo: ఇది ముఖ్యంగా 1. గాలి పంకా 2. హపరు 3. జల్లెడలు 4. ఫ్రేమ్ 5. బెల్ట్ (డ్లు లేక చక్రములు) 6. ట్రాన్స్పోర్టింగ్ వీల్స్ 7. మోటారు. 8 మంచి గింజలు వచ్చు ద్వారము అను భాగాలు కలిగి ఉంటుంది.

ఈ యంత్రము నందు గింజలు తీసుకొను తొట్టి గాలి పంకా, జల్లెడలు ఒక ఫ్రేమ్లో అమర్చబడి గాలి యొక్క రెక్కలు ఒక ఇరుసుపై అమర్చబడి ఉంటుంది. ఈ ఇరుసు భేరింగ్లపై తిరుగు తుంది. ఈ ఇరుసునకు ఒక చివర చిన్న పళ్ల చక్రం అమర్చబడి ఉంటుంది. ఈ చిన్న చక్రం. మరియు పెద్ద పళ్ల చక్రం చేత త్రిప్పబడుతుంది. ఈ పెద్ద చక్రం యంత్ర సహాయమున త్రిపప్పబడుతుంది.

ఈ గాలి పంకాకు ఎదురుగా కొంచెం దిగువన రెండు లేదా మూడు జల్లెడలు అమర్చబడి ఉంటుంది. ఈ జల్లెడలు ముందుకు మరియు వెనుకకు కదులుటకు అనువుగా ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఈ జల్లెడల ద్వారా వివిధ పరిమాణాలు గల గింజలు వేరు చేయవచ్చు.

పనిచేయు విధానo: హాపరు ద్వారా తూర్పారబట్టవలసిన మిశ్రమంను క్రిందకు పంపినపుడు (కంట్రోలరు ద్వారా) జల్లెడలపై పడుతుంది. ఈ విధంగా పడునపుడు చెత్త, గడ్డి తునకలు, ధూళి, దుమ్ము, గుళ్ల గింజలు మొదలగునవి బ్లోయర్ గాలికి బయటికి నెట్టబడుతుంది. మంచి మరియు గట్టి గింజలు జల్లెడ ద్వారా క్రింద అమర్చునటువంటి సంచుల లోకి చేరుతుంది, పగిలిన గింజ ద్వారం ద్వారా బయటికి వస్తుంది.

Also Read: Vegetables Role in Human Nutrition: మానవ పోషకాహారంలో కూరగాయల ప్రాముఖ్యత.!

Leave Your Comments

Weed Management Practices: కలుపు మొక్కల యాజమాన్య పద్ధతులు.!

Previous article

Swine Fever in Pigs: పందులలో జ్వరం ఎలా వస్తుంది.!

Next article

You may also like