Drip Irrigation Equipments: సూక్ష్మ సాగు నీటి పద్ధతి (మైక్రో ఇరిగేషన్) – అధిక దిగుబడులకై అధికంగా నీరు అందించాల్సిన అవసరం లేదు. పంటకు సరైన సమయంలో, సరైన మోతాదులో, సరైన రీతిలో, సరైన భాగంలో నీరు అందించినప్పుడు అధిక దిగుబడిని పొందవచ్చు. ఇది సూక్ష్మసాగు నీటి పద్ధతి ద్వారా వీలుకలుగుతుంది. ఈ పద్ధతి రెండు రకాలు అవి బిందు (డ్రిప్) మరియు తుంపర (స్ప్రింక్లర్) పద్ధతులు.
బిందు సేద్యము: ప్రతి రోజు మొక్కకు కావలసిన నీటిని లేటరల్ పైపులకు అమర్చిన డ్రిప్పర్ల ద్వారా బొట్లు బొట్లుగా నేల ఉపరితలం మీద లేదా నేల దిగువన నేరుగా వేరు మండలంలో అతిస్వల్ప పరిమాణంలో (గంటకు 1 నుండి 12 లీటర్ల వరకు) అందించే విధానాన్ని “బిందు సేద్యం” లేదా “డ్రిప్ పద్ధతి” అంటారు. ఈ పద్ధతిలో డ్రిప్పర్ల వరకు నీరు పీడనంతో పైపులైన్ల ద్వారా సరఫరా చేయబడుతుంది. వివిధ నీటి యాజమాన్య పద్ధతులు ద్వారా సాగు నీరందినపుడు నీటి వినియోగసామర్థ్యం ఈ క్రింది విధంగా ఉంటుంది.
Also Read: Drip Irrigation: బిందు సేద్యం వలన కలిగే ప్రయోజనాలు
డ్రిప్ పద్ధతిలో అమర్చే పరికరాలను మూడు భాగాలుగా విభజించవచ్చు:
1. నీటిని మరియు ఎరువును అదుపు చేసే విభాగం (హెడ్ కంట్రోల్ యూనిట్) అందులోని భాగాలు: నాన్ రిటర్న్ వాల్వ్, ఎయిర్ వాల్వ్, వాక్యూమ్ గేజ్, ఫిల్టర్ యూనిట్, ఫెర్టిలైజర్ ట్యాంక్, గన్ మెటల్ వాల్వ్, ప్రెషర్ గేజ్, ఇతర ఫిటింగులు.
2. నీటిని విస్తరింప చేసే విభాగం (వాటర్ కన్వేయన్స్ సిస్టమ్) అందులోని భాగాలు: పి.వి.సి. ప్రధాన మరియు ఉపప్రధాన పైప్ లైన్లు, కంట్రోల్ వాల్వ్, ఫ్లష్ వాల్వ్, ఇతర ఫిట్టింగులు,
3. నీటిని సక్రమ రీతిలో సరఫరా చేయు విభాగము (Water Distribution System) అందులోని భాగాలు:
అ) ఆన్లైన్ డ్రిప్ పద్ధతి: గ్రోమెట్, స్టార్ కనెక్టర్, నిప్పుల్, లేటరల్ పైపు, ఆన్లైన్ డ్రిపుర్లు, ఎండా క్యాప్.
ఆ) ఇన్లైన్ డ్రిప్ పద్ధతి: గ్రోమెట్, స్టార్ కనెక్టర్, నిప్పుల్, క్రిప్పర్టైన్, ఎండా క్యాప్.
ఇ) మైక్రో స్ప్రింక్లర్ పద్ధతి: గ్రోమెట్, స్టార్ కనెక్టర్, నిప్పుల్, మైక్రోస్ప్రింక్లర్, ఫీడర్ ట్యూబు, బార్స్ కనెక్టర్.
డ్రిప్ పద్ధతులు: ట్రిప్ పద్ధతిని 3 రకాలుగా పేర్కొనవచ్చు.
అవి:-
1. ఉపరితల ద్రిప్: ఇది ముఖ్యంగా పండ్ల తోటలకు మరియు వరుసల మధ్య ఎక్కువ అంతరం ఉన్న పంటలకు సిఫారస్ చేయబడితుంది.
2. నేల దిగువన అమర్చబడు ట్రిప్ పద్ధతి: ఈ పద్ధతి ముఖ్యంగా కూరగాయలు, గ్రీన్ హౌస్, షేడ్మెట్స్, చెఱుకు, సుగంధద్రవ్యాలు, ఔషధ మొక్కలు మరియు పూల మొక్కలకు సిఫారసు చేయబడితుంది.
3. మైక్రోస్పింక్లర్ పద్ధతి: ఈ పద్దతిని ముఖ్యంగా 12-16 సంవత్సరాలు పైబడిన పండ్ల తోటలకు ఆకు కూరలు, ఆయిల్స్ట్ఫామ్ మొదలగు పంటలకు సిఫార్సు చేయబడిoది.
Also Read: Drip Irrigation in Sugarcane: బిందుసేద్యం చెరకు రైతుకి వరం