Bendi Plucker and Scissor Type Tea Plucker: బెండకాయ చెట్టు నుండి కొస్తున్నపుడు మొదలు దగ్గర ఉన్న నూగు చేతికి గుచ్చుతూ ఉంటుంది. కొన్ని రకాల ద్రవాలు కారి చేతి వేళ్ళకు పుల్లు కూడా అవుతుంటాయి. దీనిని అరికట్టడానికి భిండి ప్లకర్ అనే పరికరాన్ని స్మితా ఇండస్ట్రీస్, పూణే అనే సంస్థ అభివృద్ధి చేసింది. ఇది బొటనవేలు మరియు చిటికెన రెండు ఉంగరాల నడుమా సరిగ్గా చేతిలో సరిపోతుంది. కత్తిరించే సమయంలో ఈ రెండు వేళ్లను కలిపి నొక్కడం వలన పెడిసెల్ పైన ఒత్తిడి ఏర్పడి కత్తెరించడానికి ఉపయేగపడుతుంది. దీని సామర్థ్యం ఒక గంటకు 5 నుండి 10 కేజీలు. మరియు దీని ధర 35/- రూపాయలు.
ప్రయోజనాలు: ఈ సాధనం వలన చేతిని ప్రత్యక్షంగా వీలు ఉండదు కావున చర్మానికి ఎటువంటి దురద , అసౌకర్యం లేకుండి భిండి (లేడీ వేలు) ని కోయడానికి తోడ్పడుతుంది. దీనిని భిండి హార్వెస్టింగ్ సమయంలో ముళ్ళు మరియు రసాయన పదార్థాల వలన ఎలాంటి హానీ జరగకుండా దీనిని ఉపయోగిస్తారు.
Also Read: కలుషిత మామిడి పండ్ల పట్ల జాగ్రత్త
టీ ప్లక్కర్ కత్తెర రకం
ఈ టీ ప్లక్కర్ (కత్తెర రకం) పరికరాన్ని TNAU,కోయంబత్తూరు అనె సంస్థ అభివృద్ధి చేసింది.దీని ధర 450 రూపాయలు. ఇది తేయాకు ఆకులను కోయడానికి ఉపయోగిస్తారు. తేయాకు ఆకులను తెంచే సమయంలో, రసాయనాల వలన వేళ్ళకు మరియు చేతుల చర్మం గాయపడతుంది. కావున కత్తెర రకం టీ ప్లకర్ హ్యాండ్/ఫింగర్ కాంటాక్ట్‌ని వాడటం వల్లన చర్మానికి కలిగె సమస్య తగ్గిపోతుంది. దీని సామర్థ్యం ఒక గంటకు 8.6 కిలోలు మరియు దీని ఆర్థిక ప్రయోజనం ఒక సంవత్సరానికి రూ. 1000/యూనిట్. సాంప్రదాయిక పద్ధతిలో అనగా చేతితో తెంచడంతో పోలిస్తే దీని వలన 40 శాతం అధిక ఉత్పత్తి కలుగుతుంది. ఈ పరికరంతో టీ కోయడానికి కార్డియాక్ ఖర్చు(295 బీటాలు/కేజీ టీ లీఫ్) సాంప్రదాయ పద్ధతి కన్నా తక్కువగా అవుతుంది (580 బీట్స్/కిలో టీ ఆకులు). సాంప్రదాయిక చేతితో తెంచడం పద్ధతితో పోలిస్తే దీని వలన సమయం 40 శాతం మరియు ఖర్చులో 32% ఆదా అవుతుంది.
Also Read: సమీకృత వ్యవసాయం తో ఎకరానికి 2,90,000 లక్షలు సాధిస్తున్న రైతులు