యంత్రపరికరాలు

Groundnut Decorticator: సిట్టింగ్ రకం వేరుశెనగ డెకార్టికేటర్‌

0
Groundnut Decorticator
Groundnut Decorticator

Groundnut Decorticator: వేరుశనగ నూనె గింజ పంట. ఇది భారత దేశంలో విరివిగా సాగు చేయబడుతున్నాయి.తెలుగు రాష్ట్రాలలో అతి ఎక్కువగా సాగు చేసే నూనె గింజ పంటలలో వేరు శనగ ఒకటి. ఇది అనంతపూర్, కర్నూల్, మహబూబ్ నగర్, వరంగల్ వంటి ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేస్తున్నారు.అయితే వేరు శనగలో కోత అనంతరం కాయ పైన ఉన్న పొట్టు తీయడం అనేది అధిక శ్రమతో కూడుకున్న పని. విత్తే సమయంలో ప్రతి సారి వంగడం వలన మహిళలకు వెన్ను సమస్యలు వస్తున్నట్టు ICAR చాలా సందర్భాలలో పేర్కొంది.దీనిని దృష్టిలో పెట్టుకొని CIAE, భోపాల్ పరిశోధన స్థానం వారు కూర్చుని విత్తుటకు వీలయే విధంగా వేరుశెనగ డెకార్టికేటర్ ను తయారు చేశారు. నేటి కాలంలో దీనికి మంచి ఆదరణ లభిస్తుంది.వేరుశెనగ కాయల నుండి గింజలను వేరుచేయుటకు ఉపయోగపడ్తుంది.

Groundnut Decorticator

Groundnut Decorticator

సంక్షిప్త వివరణ: కూర్చునే రకం వేరుశెనగ డెకార్టికేటర్ వేరుశెనగ గింజల పైన ఉండే పొట్టు తీయడానికి తయారు చేసిన కాస్ట్‌గ్రౌండ్‌నట్ డెకార్టికేటర్. ఇది ఐరన్ షూలను కలిగి ఉండి, ఓసిలేటరీ రకం యంత్ర పరికరం. ఇది దీర్ఘచతురస్రాకార రంధ్రంతో ఉండే ఫ్రేమ్, హ్యాండిల్, డోలనం (కదిలే సామర్థ్యం) గల చేయి మరియు జల్లెడను కలిగి ఉంటుంది. ఇది ఒక చెక్క బల్ల ప్లాట్‌ఫారమ్‌పై స్టూల్‌ను అమర్చబడి అందులో నుండి శనగలను లేవకుండా వేసే పద్ధతిగా తయారు చేయడం జరిగినది.ఇది కూర్చుని ఉన్న భంగిమలో ఒక మహిళ చేత నిర్వహించవచ్చు. చేతితో పట్టుకుని పాడ్‌లను దొలన చలనం చేస్తూ దాదాపు 1.5 కిలోల వేరుశనగలు ఒక బ్యాచ్‌లో తిప్పవచ్చు. సరైన అలైన్మెంట్ కోసం, డోలనం చేసే చేయిపై అమర్చబడి ఉన్న బూట్లు సర్దుబాటు చేసుకోవాలి.

Also Read: వేరుశెనగలో పాలిథిన్ మల్చింగ్ టెక్నాలజీ తో లాభాలు

అతి తక్కువ మానవ శక్తి అవసరత మరియు తక్కువ కార్డియాక్ ఖర్చు కారణంగా మహిళలు ఈ సిట్టింగ్ రకం వేరుశెనగ డెకార్టికేటర్‌ను ఎక్కువగా ఇష్టపడతారు. దీని కెపాసిటీ దాదాపు 30 kg/గంట. సాంప్రదాయిక రకం డికార్టికేషన్ పద్ధతితో పోలిస్తే వేరుశెనగ డెకార్టికేటర్‌తో కార్మికుల కార్డియాక్ ఖర్చులో దాదాపు 79% ఆదా అవుతుంది.అనగా 3రేట్ల తక్కువ శ్రమతో కూలీలు పని చేయవచ్చు. పని చేసే వారికి భద్రతతో పాటు కార్మికుల ఉత్పాదకత విపరీతంగా పెరిగినట్లు పరిశోధనలు ఋజువు చేస్తున్నాయి.

ఒక కిలో పాడ్‌ల వినియోగానికి అయే ఖర్చు: రూ. 2400/- దీనిని CIAE, భోపాల్, వారు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఇది CIAE, నబీ బాగ్, బెరాసియా రోడ్, భోపాల్- 462 038 వారు తయారు చేసి, రైతులు కొనడానికి వీలుగా అందుబాటులో ఉంచుతున్నారు. మరిన్ని వివరాలకు CIAE వెబ్ సైట్ లో చూసి ఆర్డర్ చేయొచ్చు. దీనిని సద్వినియోగం చేసుకుని తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందగలరని మనవి.

Also Read:  వేరుశనగ స్ట్రిప్పర్ ఆవశ్యకత

Leave Your Comments

Organic Nursery: సేంద్రియ నర్సరీ ప్రారంభించి రెండు జాతీయ అవార్డులు అందుకున్న బన్ష్ గోపాల్

Previous article

Yellow Chilli: పసుపు రంగు మిరప సాగు సస్య రక్షణ

Next article

You may also like