యంత్రపరికరాలు

Importance of Groundnut Stripper: వేరుశనగ స్ట్రిప్పర్ ఆవశ్యకత

2
Groundnut
Groundnut

Importance of Groundnut Stripper: వేరుశనగ రైతులు పొలం నుండి పీకిన వేరుశనగ మొక్కలనీ రెండు మూడు రోజులు పొలంలోనె ఎండనిచ్చీ అక్కడే కుప్పలుగా వేస్తారు. ఆ తరువాత కూలీల అందుబాటును బట్టి నెమ్మదిగా మొక్కల నుండి కాయలను వేరు చేస్తారు.ఈ సమయంలో రసం పీల్చె పురుగుల వల్ల కాయలకు నష్టం కలుగుతుంది.మొక్కల నుండి కాయలు వేరు చేయుట అనేది ఎక్కువ శ్రమ మరియు ఖర్చుతో కూడిన పని. పైగా సమయం కూడా ఎక్కువ పడుతుంది. అంతే కాకుండా ఈ పనికి ఎక్కువగా మహిలా కూలీలనే నియమిస్తారు.గంటకు ఒక ఆడ మనిషి 5నుండి 6కిలోల కాయలను మాత్రమే వేరుచేయగలుగుతుంది. యంత్రాలతో మొక్కల నుండి కాయ కోయడం లేదా నూర్చడం ద్వారా రైతులు సాప్రదాయంగా అనుసరిస్తున్న చేతితో కాయలు కోయడానికి స్వస్తీ చెప్పొచ్చు.

Importance of Groundnut Stripper

Importance of Groundnut Stripper

వేరుశెనగ స్ట్రిప్పర్:
ఇది వేరుశెనగ గింజలను మొక్క నుండి తీయడానికి ఉపయోగించవచ్చు. వేరుశెనగ స్ట్రిప్పర్‌లో నిలువు కాళ్ల స్వేర్ ఫ్రేమ్ మరియు హారిజాంటల్ స్ట్రిప్ కి స్థిరంగా విస్తరించిన మెటల్ ఒక ఫ్రేమ్ కి ప్రతి వైపున దువ్వెన రూపంలో ఉంటుంది. కొంచెం బలంతో దువ్వెనకు అడ్డంగా కొన్ని మొక్కలను పెంచడం ద్వారా కాయలను మొక్క నుండి వేరు చేయడం జరుగుతుంది. దీని నిర్మాణం వలన ఒకే సమయంలో నలుగురు మహిళలు దీనిని ఉపయోగించుకునేందుకు వీలవుతుంది.

Also Read: పసుపు పంట కోత సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

Groundnut Stripper

Groundnut Stripper

ఆపరేటర్ అక్కడే కూర్చుని స్ట్రిప్పింగ్ ఆపరేషన్ చేయుటకు ఒక చిన్న సర్దుబాటు స్టూల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టూల్ యొక్క ఎత్తునూ 28 నుండి-40 సెం.మీ వరకూ సర్దుబాటు చేసుకోవచ్చు.
నేల స్థాయిలో కూర్చుని స్ట్రిప్పింగ్ చేసెసమయంలో ఈ డిజైన్ వలన మోకాలి నొప్పి మరియు తిమ్మిరిని రాకుండా తొలగిస్తుంది.
టెలిస్కోపిక్ సపోర్ట్ లెగ్‌లు కూడా ఫ్రేమ్ కి ఉన్నాయి. దీని వలన భంగిమ అసౌకర్యాన్ని తొలగించి సబ్జెక్ట్‌లు తమ సౌలభ్యాని బట్టి తమకు అనుగుణంగా నేల స్థాయి నుండి ఫ్రేమ్ ఎత్తును సర్దుబాటు చేసెందుకు వీలు కలిగిస్తుంది.
మరియు స్ట్రిప్పింగ్ చేసేటప్పుడు పొత్తికడుపుపై ​​మోచేయి కొట్టడం కూడా తప్పుతుంది. దీని సామర్థ్యం 11 కిలోలు/గం/మహిళలు.

Also Read: దేశంలోని ప్రధాన మండీలలో కూరగాయల పరిస్థితి ఇది

Leave Your Comments

Benefits of Deep Ploughs: వేసవి దుక్కులు

Previous article

Advantages and Disadvanatges of Artificial Insemination: కృత్రిమ గర్భధారణ ప్రయోజనాలు మరియు ప్రతికూలతలు

Next article

You may also like