పట్టుసాగు

Mulberry Plant Propagation: మల్బరీ మొక్కల ప్రవర్తనం

0
Mulberry Plant Propagation
Mulberry Plant Propagation

Mulberry Plant Propagation: మల్బరీ సాగులో రెండు పద్ధతుల్లో ప్రవర్ధనం చేయవచ్చు.
1) విత్తనాల ద్వారా
2) శాఖీయ ప్రవర్తనం మరియు
3) సూక్ష్మ పద్ధతుల (ద్వారా బయోటెక్నాలజీ) – టిష్యూ కల్చర్.

1. విత్తన ప్రవర్ధనం: వాణిజ్య పెంపకదారులు మల్బెరిని చాలా అరుదుగా విత్తనం ద్వారా ప్రత్యుత్పత్తి చేస్తారు. ఎందుకంటే మల్బరీ గాలి ద్వారా పరపరాగ సంపర్కం జరుపుకుంటుంది.కావున మొక్క యొక్క జన్యు నాణ్యతను నిర్వహించడం సాధ్యం కాదు.దీనితో పాటు ఈ పద్ధతిలో ప్రత్యుత్పత్తి చేసినపుడు పెరుగుదల నెమ్మదిగా ఉంది ఆకు కోతకు వచ్చే సమయం ఎక్కువ తీసుకుంటుంది.ఈ పద్ధతి సంతానోత్పత్తి గురించిన అధ్యయనాలు నిర్వహించబడే పరిశోధనా కేంద్రాలకు మాత్రమే పరిమితం.ఈ పద్దతిలో ప్రవర్తనం కొరకు మార్చి-ఏప్రిల్‌లో పండిన పండ్ల నుండి విత్తనాలు సేకరించాలి. వీటికి ఎలాంటి నిద్రావస్థ కాలం లేనందున తాజాగా సేకరించిన విత్తనాలు నాటవచ్చును. ఒకవేళ ఆలస్యమైనా విత్తనాలను 3 నెలలకు మించకుండా నిల్వ చేసుకోవాలి.

Mulberry Plant Propagation

Mulberry Plant Propagation

2. శాఖీయ ప్రవర్తనం : ఇది వాణిజ్యపరంగా ఉపయోగించే అత్యంత ప్రజాదరణ పొందిన పద్ధతి.
దీని ప్రధాన ప్రయోజనాలు క్రిందివి;
ఎ) కావలసిన వంశపారంపర్య పాత్రలను అంతటా నిర్వహించవచ్చు.
బి) పెద్ద సంఖ్యలో మొక్కలను త్వరగా మరియు ఆర్థికంగా పెంచవచ్చు.
సి) తెగుళ్లు మరియు వ్యాధులు లేని మొక్కలను పెంచవచ్చు.
డి) నిర్దిష్ట ప్రాంతాలకు అనుగుణంగా మొక్కలను పెంచవచ్చు.
శాఖీయ ప్రవర్తనం చేసే పద్ధతులు మూడు ప్రధాన వర్గాల క్రిందకు వస్తాయి: 1) కట్టింగ్, 2) గ్రాఫ్టింగ్ మరియు 3) లేయరింగ్.

Also Read: మల్బరీ సాగులో నిర్ణిత కాలంలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు

ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మల్బరీ సాగు పద్ధతి. మొక్క రెమ్మలలో చురుకైన, బాగా అభివృద్ధి చెందిన మొగ్గలతో సరైన పరిపక్వత మరియు మందంగల కొమ్మలను ఎంపిక చేసుకోవాలి. చాలా లేత కొమ్మలను మరియు ఎక్కువ ముదిరిన కొమ్మలను తిరస్కరించాలి. 8-10 నెలల వయస్సు గల మొక్కల నుండి పెన్సిల్ మందపాటి కొమ్మలు (10 -12 మిమీ డయా) కోతలను సిద్ధం చేయడానికి కావలసిన రకాన్ని ఉపయోగిస్తారు.

శాఖలు(కొమ్మలు ) 18-20 సెం.మీ (7-8”)గా కత్తిరించాలి.బాగా అభివృద్ధి చెందిన మొగ్గలతో కనీసం మూడు కణుపులు ఉన్న కొమ్మ కత్తెరింపులు ఉపయోగించాలి. నీటిపారుదల తోటల కోసం 3 కణుపులు మరియు వర్షాధార తోటల కోసం 5-6 కణుపులు ఉండేలా జాగ్రత్త వహించాలి. కొమ్మల చివర్లు చీలికలు లేదా పొట్టు లేకుండా పదునైన కత్తితో కచ్చితంగా కత్తెరించాలి.కొమ్మలను నర్సరీ బెడ్లలో సుమారు 2.5 సెం.మీ, ఒక కణుపు భూమి పైన ఉండేలా నాటుకోవాలి. కత్తెరింపులకు ప్రతి రోజు నీటిని అందించాలి.

నేల క్రింద ఉన్న కణుపులలో మొగ్గల నుండి వేర్లు మరియు భూమి పైన ఉన్న కణుపులలో గల మొగ్గ నుండి ఆకులు అభివృద్ధి చెందుతాయి. నేల పైన రూట్ హార్మోన్లు మరియు పెరుగుదలను ఉపయోగించడం ద్వారా రూటింగ్ ప్రేరేపించబడుతుంది. IAA, IBA, NAA, 2.4-D వంటి నియంత్రకాలు లేదా రూటోన్, సెరాడిక్స్ వంటి వాణిజ్య ఉత్పత్తులు మొదలైనవి ఉపయోగించాలి. ఇవి త్వరగా వేరు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. కోతలను నేరుగా పొలాల్లో నాటవచ్చు లేదా నర్సరీలో పెంచవచ్చు. 2-3 నెలల తర్వాత, వాటిని పొలాలలో నాటుతారు.

Also Read: వర్షాధారిత  పరిస్థితులలో మల్బరీ సాగు

Leave Your Comments

Benefits of Lemon Juice: వేసవిలో నిమ్మకాయ రసం తీసుకోవడం వల్ల ప్రయోజనాలు

Previous article

Pointed Gourd: పర్వాల్ సాగుతో మంచి ఆదాయం

Next article

You may also like