Anand Mahindra : కర్ణాటక మహేంద్ర కార్ల షోరూంలో రైతుకు ఘోర అవమానం జరిగింది. కర్ణాటక తూముకుర్ మహేంద్ర షోరూంలో బొలేరో పికప్ ట్రక్కు కొనుగోలు చేసేందుకు వచ్చిన కెంపెగౌడ అనే రైతును సంస్థలో పని చేసే సేల్స్ మెన్ దారుణంగా అవమానించాడు. నీది కారు కొనే మొహమేనా?, నీ వల్ల కస్టమర్లకు ఇబ్బందిగా ఉంటుంది అంటూ హేళన చేశాడు. దాంతో ఆ రైతుకు కోపం వచ్చి తన ప్రతాపాన్ని చూపించాడు. గంటలో 10 లక్షలతో వచ్చి నాకు కారును వెంటనే డెలివరీ చెయ్యాలి అంటూ పట్టుబట్టాడు. ఆ సేల్స్ మెన్ పొగరు అణిచేందుకు సంఘటన ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఎట్టకేలకు ఆ సంస్థ యాజమాన్యం మెట్టు దిగొచ్చింది. ఆ సేల్స్ మెన్ తో రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పించింది. కాగా ఈ వీడియోను కొందరు ఆనంద్ మహీంద్రను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో పోస్టు చేశారు
Also Read: మహేంద్రా షోరూమ్‌లో రైతుకు అవమానం – దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రైతు
కాగా.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా.. తన షోరూంలో జరిగిన ఘటనపై స్పందించలేదేం అనే అనుమానం చాలామందికి తలెత్తింది ఈ నేపథ్యంలో తాజాగా ఆయన కూడా స్పందించారు. ఆనంద్ మహేంద్ర ట్విట్టర్ ద్వారా ఈ విధంగా స్పందించాడు. @MahindraRise ప్రధాన ఉద్దేశం.. కమ్యూనిటీలు, అన్ని వాటాదారుల్ని అభివృద్ధి చేయడమే.. వ్యక్తి గౌరవాన్ని నిలబెట్టడమేనన్నారు. తత్వశాస్త్రం ప్రకారం.. ఏదైనా ఉల్లంఘన జరిగినప్పుడు సత్వరమే పరిష్కారం చూపడం జరుగుతుందని ఆయన ట్వీట్ చేశారు. అంతకు ముందు గిరిసొన్నాసెరీ అనే ట్విటర్ హ్యాండిల్ నుంచి ఓ వ్యక్తి రైతుకు జరిగిన అవమానం గురించి వార్త కథనాన్ని ట్యాగ్ చేసి ట్వీట్ చేశాడు. దానికి మహీంద్రా అండ్ మహీంద్రా సీఈవో విజయ్ నక్రా స్పందించారు.
అయితే చివర్లో ఆ రైతు ఇచ్చిన ట్విస్ట్ కు మహేంద్ర షోరూం ఉద్యోగులు అవాక్కయ్యారు. తనను అవమానించిన షోరూంలో తాను వాహనాన్ని కొనుగోలు చేయనని చెప్పి సదరు షోరూం నుంచి వెళ్లపోయారు రైతు కెంపెగౌడ.
Also Read: బీడు భూమిలో బంగారు పంటలు పండిస్తున్న రైతు జయరాం
The Core Purpose of @MahindraRise is to enable our communities & all stakeholders to Rise.And a key Core Value is to uphold the Dignity of the Individual. Any aberration from this philosophy will be addressed with great urgency. https://t.co/m3jeCNlV3w
— anand mahindra (@anandmahindra) January 25, 2022