Agricultural Change: మన వ్యవసాయ రంగంలో పలు మార్పులు వస్తున్నాయి. విత్తనం దగ్గర నుండి ఎరువులు దాకా, కోత దగ్గర నుండి మార్కెటు వరకు అన్ని విధానాల్లో మార్పులు సంభవిస్తున్నాయి. అంతే కాకుండా వ్యవసాయ రంగంలో టెక్నాలజీ అనేది అందుబాటులోకి వస్తుంది. దానికి తోడు ప్రభుత్వ ప్రోత్సహాకాలు కూడా రైతులకు తోడవుతున్నాయి. ఈనేపధ్యంలో మనం వ్యవసాయం చేసేటప్పుడు ఎలాంటి విధానాలను మనం పాటించాలనే అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం..
వ్యవసాయ విధానం
రోజు రోజుకి పెరుగుతున్న జనాభా, మారుతున్న ప్రజల జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా వ్యవసాయ విధానంలో అనేక మార్పులు వస్తున్నాయి. ప్రధానంగా రసాయనక సేంద్రీయ ప్రకృతి వ్యవసాయ విధానాలను క్షేత్రస్థాయిలో రైతులు అవలంబిస్తున్నారు. అయితే పుట్టుకొస్తున్న కొత్త రోగాల కారణంగా చాలా వరకు కొనుగోలుదారులు సేంద్రియ విధానంలో పండించే కూరగాయల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో రైతులు సైతం కొనుగోలుదారులకు అనుగుణంగా అదేవిధంగా సాగు చేస్తూ లాభాలు పొందుతున్నారు. సాధారణంగా సేంద్రియ విధానంలో పెద్దగా దిగుబడులు రావు అయినప్పటికిని మార్కెట్లో ప్రస్తుతం కూరగాయలకు మద్దతు ధర పలుకుతుంది ఫలితంగా రైతులు మంచి లాభాలు పొందుతున్నారు.
Also Read: Modern Agricultural Equipments: వ్యవసాయ పనులకు కావలసిన ఆధునిక వ్యవసాయ పరికరాలు.!

Agricultural Change
రసాయనిక వ్యవసాయం
సహజ సిద్ధంగా కాకుండా పరిశ్రమల్లో కృత్రిమంగా తయారు చేసిన ఎరువులతో సాగు చేయడానికి కృత్రిమ వ్యవసాయం అంటారు. విత్తనం మొదలుకొని మొక్కలు, పంటల ఎదుగుదలకు కావలసిన ఎరువులను అన్నింటిని ప్రస్తుతం కృత్రిమంగానే తయారు చేస్తున్నారు. భూసారం పెంచడానికి దుక్కిలో వెదజల్లే యూరియా, డి.ఏ,పి, సూక్ష్మస్తూల మూలకాల వంటి ఎరువులను కూడా కృత్రిమంగా తయారు చేస్తున్నారు. వీటితో పాటుగా పై పాటికి పిచికారికి సైతం కృత్రిమ ఎరువులను వాడుతున్నారు ఇదే రసాయన వ్యవసాయం
సేంద్రియ వ్యవసాయం
భూసారాన్ని పెంచడానికి అవసరమైన ఎరువులను పశువుల పేడ. వానపాముల ఎరువును అందించి సాగు చేయడాన్ని సేంద్రియ విధానం అంటారు ఈ విధానంలో చీడపీడల నివారణకు వేప నూనె వాడకం తో పాటు సస్యరక్షణ విధానాలను అవలంబిస్తున్నారు. రైతులు ఇప్పుడు ఎక్కువగా సేంద్రియ పద్దతుల్లో పంటలను పండిస్తున్నారు. వీటి ఉత్పత్తులకు మార్కెట్ డిమాండ్ కూడా ఉంది.
ప్రకృతి వ్యవసాయం
ప్రకృతి వ్యవసాయం విధానంలో విత్తనం ఎంపిక అనేది కీలకం. ప్రకృతి వ్యవసాయ విధానంలో ఆప్రాంతంలో దొరికే దేశీ విత్తనాలను వాడి ఎలాంటి ఎరువులు అవసరం లేకుండా కావాల్సిన పంటను పండించుకొని మిగిలిన పంటలను భూముల్లోనే వదిలేయడం జరుగుతుంది. ఈ విధంగా రైతులు వారి అవసరాలను బట్టి వారి విధానంలో మార్పు ఉంటుంది.
Also Read: Maize Farmers: వర్షాభావంతో ఇబ్బంది పాలవుతున్న మొక్కజొన్న రైతులు.!