వార్తలు

Onion Cultivation: ఉల్లి సాగులో- చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలు

3
Onion Farming
Onion Farming
Onion Cultivation: మన దేశంలో పండిరచి యాసంగి కూరగాయల పంటల్లో వాణిజ్యపరంగా ప్రధానమైన కూరగాయ పంటం ఉల్లి. తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి సాగును చేపడుతున్నప్పటికీ ఉల్లి సాగులో చీడపీడల కారణంగా గడ్డల నాణ్యత తగ్గిపోయి మార్కెట్‌లో సరైన ధర  లభించడం లేదు. నాణ్యమైన అధిక దిగుబడులు పొందుటకు రైతులు పంట తొలిదశ నుంచే సాగులో పాటించాలి. వివిధ రకాల పురుగులు ఆశించి నష్టాన్ని కలిగిస్తున్నాయి. తగిన సస్యరక్షణ చర్యలు సకాలంలో చేపట్టడం వలన అధిక దిగుబడులు పొందవచ్చును.
Onion Cultivation

Onion Cultivation

తామర పురుగులు: తామర పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చివేయడం వల్ల తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. దానితో పాటుగా ఆకులపై, కాడలపై ఊదారంగు మచ్చలు కూడా ఏర్పడతాయి. ఈ పురుగు ఉదృతి ఎక్కువగా ఉన్నప్పుడు సుడులుగా ఎండిపోవడం గమనించవచ్చు.
నివారణ:
* తామర పురుగులకు ఆశ్రయమిచ్చే వెల్లుల్లి, క్యాబేజి, పత్తి, టమాట, దోస మొదలగు పంటలను సాగుచేయరాదు.
* పంట చుట్టూ రెండు వరుసల మొక్కజొన్న లేదా లోపలి వరుస తము మరియు బయట వరుస మొక్కజొన్నలను రక్షక పంటలుగా వేసుకోవాలి.
* దీని నివారణకు నీలిరంగు జిగురు అట్టలను ఎకరాకు 10`15 చొప్పున పొలంలో పైరు కంటే ఒక అడుగు ఎత్తులో అమర్చుకోవాలి.
* పురుగు ఉదృతిని బట్టి ఎకరాకు 400 మి.లీ. ఫిప్రోనిల్‌ లేదా 300 గ్రా. ఎసిఫేట్‌ లేదా 80 గ్రా. థయోమిధాక్సామ్‌ లేదా 200 గ్రా. డైఫెన్‌ధియురాన్‌ G అసిటామిప్రిడ్‌ లేదా 400 గ్రా. ఎసిఫేట్‌ G ఇమిడాక్లోప్రిడ్‌ లేదా 60 మి.లీ.స్పైనోశాడ్‌ లేదా 160 మి.లీ. స్పైనోటోరమ్‌ మందులను మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి.
ఉల్లి ఈగ / గడ్డ ఈగ: ఉల్లి ఈగ, ఉల్లి మొలకల మీద గుడ్లు పెట్టడం వలన అవి పొదిగి మొలకలను తింటాయి. తరువాత దశలో లార్వాలు  గడ్డ భాగాన్ని ఆశించి నాశనం చేస్తాయి. గడ్డ్డ పెరుగుదల దశలో లార్వాలు ఉల్లిగడ్డలో సొరంగాలు చేసే పంటని నాశనం చేసి నష్టపరుస్తాయి.
నివారణ:
*మొక్కలను దగ్గర దగ్గరగా నాటకూడదు.
*పంట మార్పిడి పద్ధతిని తప్పనిసరిగా అనుసరించాలి.
* దీని నివారణకు ఎకరానికి  400 మి.లీ. డైమిథోయేట్‌  లేదా 400 మి.లీ. ప్రొఫెనోఫాస్‌ మందును పిచికారీ చేయాలి.
Onion Farming

Onion Farming

ఎర్రనల్లి: నల్లులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చుతాయి. ఆకుల పై భాగాన చిన్న చిన్న రంధ్రాలు గమనించవచ్చు. నల్లి వల్ల ఆకులపైన ఏర్పడే తెల్లని గూళ్ళ లాంటివి గమనించవచ్చు. తరువాత దశలో ఆకుల రంగు మారి ఎండిపోయి రాలిపోతాయి. దీని నివారణకు ఉల్లి పంటకు ప్రసొపార్‌ గైట్‌ 1 మి.లీ. లేదా స్పైరోమెసిఫైన్‌ 0.75 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఆకుతినే పురుగు: ఈ లద్దె పురుగు బూడిద రంగులో ఉండి నల్లని చారలు కలిగి ఉంటుంది. ఈ లద్దెపురుగు ఆకులను తినడం వల్ల ఆకు కాడపై రంధ్రాలు గమనించవచ్చు. దీని నివారణకు మరియు 400 మి.లీ. క్లోరోఫైరిఫాస్‌ లేదా 60 మి.లీ. ఫ్లూబెండామైడ్‌ లేదా 80 మి.లీ. క్లోరాంట్రనిలిప్రోల్‌ మందును పిచికారి చేసుకోవాలి.
నులిపురుగులు: నులిపురుగులు మొక్కలో కణజాలాన్ని తిని మొక్కలో అంతర పరాన్న జీవులుగా నివసిస్తాయి. ఇవి భూమిలో అధికంగా ఉంటే కుళ్ళ లక్షణాలను గమనించవచ్చు. నులిపురుగులు ఆశించిన నారు లేతఆకుపచ్చ లేదా పసుపురంగుకు మారి మెలికలు తిరుగుతాయి. లేత ఉల్లిపాయలు మెత్తబడి ఆకారం కోల్పోతాయి. ఈ పురుగు ఉధృతి అధికమైనప్పుడు గడ్డ పగులుతుంది. దీని నివారణకు కార్బోఫ్యూరాన్‌ 4 జి గుళికలు ఎకరాకు  10-12 కిలోల చొప్పున భూమిలో వేసి కలియ దున్నాలి.

Also Read: పంట దిగుబడి పెంచే కషాయాలు తయారు చేసే విధానం

పంట మార్పిడి: బంతి పంటతో చేసుకోవండం వల్ల వీటి  ఉదృతిని తగ్గించుకోవచ్చు.
ఉల్లి పంటను ఆశించే తెగుళ్ళు: ఈ తెగులు ఆశించిన ఆకులపై ఊదా రంగు మచ్చలు ఏర్పడి ఆకులు ఎండిపోతాయి. దీని ఉధృతి వాతావరణంలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు వస్తుంది. దీని నివారణకు ఎకరాకు 600 గ్రా. మాంకోజెబ్‌ లేదా 500 గ్రా. క్లోరోధలోనిత లేదా 400 గ్రా. కార్బెండజిమ్‌ G మాంకోజెబ్‌ మందును పిచికారీ చేసుకోవాలి.
నారుకుళ్ళు తెగులు: ఈ తెగులు ముఖ్యంగా నర్సరీలో ఎక్కువగా గమనింవచ్చు. తెగులు ఆశించినప్పుడు లేత మొక్కల కాడ మెత్తబడి గుంపులు గుంపులుగా నారు చనిపోవడం గమనించవచ్చు.
నివారణకు: విత్తనం మొలకెత్తన వెంటనే ఒకసారి, మళ్ళీ వారం రోజులకు ఒకసారి 3 గ్రా. కాపర్‌ఆక్సీక్లోరైడ్‌ లీటరు నీటిలో కలిపి నేలను బాగా తడిచేలా పిచికారీ చేసుకోవాలి. ప్రధాన పొలంలో గమనించినట్లయితే 200 గ్రా. కార్బండిజమ్‌ లేదా 500 గ్రా. మాంకోజెబ్‌ లీటరు నీటికి కలుపుకొని నేల బాగా తడిచేలా పిచికారీ చేసుకోవాలి.
Growing a successful onion crop

Growing a successful onion crop

ఆకు ఎండు తెగులు: ఈ తెగులు మొదట ముదురాకు కాడలపై గమనించవచ్చు. లేత ఆకుపచ్చ వలయాలతో కూడిన చిన్న పొడవైన మచ్చలు ఆకుల కాడలపై కనిపిసాయి. తెగులు ముదిరినప్పుడు మచ్చలు అన్నీ కలపిపోయి, ఎండిపోయిన గడ్డి రంగుకు మారి మధ్యలో చీలిక కనిపిస్తుంది. ఉధృతి అధికమైనప్పుడు ఆకులు పై నుండి కిందికి ఎండిపోయి చనిపోతాయి. ఈ తెగులును పొలంలో గమనించినప్పుడు మొక్కలు పసుసురంగుకు మారి గుంపులు గుంపులుగా చనిపోతాయి.
నివారణకు: ఎకరాకు 200 గ్రా. ధయోఫోనేట్‌ మిథైల్‌ మందును పిచికారీ చేసుకోవాలి.
ముడత తెగులు (ఆంత్రాక్నోస్‌): ఆకుల కాడపై పసుపుపచ్చ చారలు కనబడి నెమ్మదిగా పెద్దమచ్చలు ఏర్పడతాయి. తరువాత దశలో ఆకులు ముడుచుకొనిపోయి వంకర టింకరలు తిరిగి ఎండిపోయి చనిపోతాయి.
నివారణకు: మాంకోజెబ్‌ 3 గ్రా. లేదా కార్బెండిజమ్‌ 1 గ్రా. లేదా థయోఫోనేట్‌ మిథైల్‌ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
బూజు తెగులు: ఆకుల మీద మచ్చలు ఏర్పడి మొక్క ఎదుగుదలను తగ్గిస్తుంది. ఉధృతిని బట్టి ఆకు కాడ పసుపురంగులోకి మారి తరువాత పండుబారి రాలిపోతుంది. దీని నివారణకు ఎకరాకు 200 గ్రా. కార్బండిజమ్‌  లేదా 200 గ్రా. అజాక్సీస్ట్రోబిన్‌ G డైఫెన్‌కొనజోల్‌ మందును పిచికారీ చేసుకోవాలి.
నల్ల మచ్చ తెగులు:
పంట పరిపక్వం, నిల్వలో ఉన్న గడ్డపై తెగులు వస్తుంది.  ఈ తెగులు గడ్డ మెడ భాగంలో మొదటగా ఆశించి తర్వాత గడ్డపై ఆశించినప్పుడు ముదురు ఆకుపచ్చ రంగు నుంచి నల్లగా మారి గడ్డ కుళ్ళిపోతుంది.
నివారణకు: ఎకరాకు 500 గ్రా. కార్బెండిజమ్‌ G మాంకోజెబ్‌ మందును కోతకు 30 రోజుల ముందు పిచికారీ చేసుకోవాలి.
డా. వి. చైతన్య, డా. జె.హేమంత కుమార్‌, 
డా. కె. రవికుమార్‌,  డా. జెస్సీి సునీత, డబ్ల్యు మరియు 
పి.ఎస్‌.ఎమ్‌. ఫణిశ్రీ, కృషి విజ్ఞానకేంద్రం, వైరా.

 

Also Read: ఉల్లి కుళ్లకుండా నిల్వ చేసేందుకు నూతన విధానం

Leave Your Comments

Allola Divya Reddy: మహిళా దినోత్సవం సందర్భంగా సూపర్ ఉమెన్ దివ్యారెడ్డి స్పెషల్ స్టోరీ

Previous article

Polythene Mulching Technology: వేరుశెనగలో పాలిథిన్ మల్చింగ్ టెక్నాలజీ తో లాభాలు

Next article

You may also like