MS Dhoni: భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్‌గా ఐసీసీలో అనేక ట్రోఫీలు మన దేశానికి అందించారు. ఐసీసీలోనే కాకుండా ఐపిఎల్ ఈ సంవత్సరంలో ట్రోపీ అందించారు. ఈ సంవత్సరంతో 5 ఐపిఎల్ ట్రోఫీలు గెలిచారు. మహేంద్ర సింగ్ ధోని ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత వ్యవసాయంపై దృష్టి పెట్టారు. రాంచీలోని ధోనీ ఫామ్ హౌస్ పొలంలో పుచ్చకాయ, జామ, స్ట్రాబెరీ, కీర, ఆవాలు, క్యాబేజీ, క్యాప్సికమ్, అల్లం పంటలను పడిస్తున్నాడు. వీటితో పాటు నాటు కోళ్లను పెంచుతున్నారు. కోళ్ల నుంచి వచ్చిన ఎరువును పంట పొలాలకు వాడుతున్నారు, ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండ.
మహేంద్ర సింగ్ ధోని సమయం దొరికినప్పుడుల్లా తన ఫామ్ హౌస్ పొలం పనులు తానే స్వయంగా చేసుకుంటారు. ట్రాక్టర్‌తో పొలం దున్నడం, కూరగాయలు కోయడం ధోని స్వయంగా అతనే చేసుకుంటారు. రాంచీలోని ధోనీ ఫామ్ హౌస్ సాంబోలో చేపలను సాగు చేస్తున్నారు.
Also Read: Paddy Dryer Machine: అకాల వర్షాలతో బాధ పడుతున్న వరి రైతుల కోసం కొత్త యంత్రం.!
చేపల పెంపకం కోసం ఫామ్ హౌస్ పొలంలో రెండు చెరువులను తోవి ఎనిమిది వేల చేప పిల్లలను ఏడు నెలల క్రితమే వేశారు. చేపల చెరువును చూసుకోవడానికి ప్రత్యేకంగా పనివాళ్లని పెట్టుకున్నారు. ఉదయం, సాయంత్రం రెండు చెరువుల్లో చేపలకి మేత వేస్తారు. రోహు, కట్ల, తెలాపియా రకాల చేపలను పెంచుతున్నారు. ఇపుడు ఆ చేపలు కిలో నుంచి కిలోన్నర బరువు పెరిగాయి.
మహేంద్ర సింగ్ ధోనీతో పాటు సాక్షి కూడా సమయం చూసుకొని ఈ రెండు చెరువులను తనిఖీ చేస్తుంది. మహేంద్ర సింగ్ ధోని నాన్ వెజ్ ఫుడ్ ఇష్టంతో ఈ కోళ్లు, చేపల ఫామ్ మొదలు పెట్టారు. ఐపీఎల్ ట్రోపీ ట్రోపీ గెలిచాక ఆరు నెలల తరవాత రిటైర్మెంట్ గురించి తెలియ చేస్తారు. రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత వ్యవసాయంలో ఎక్కువ సమయం ఉంటాను అన్ని చెప్పారు.
Also Read: Mixed Rice – Fish Cultivation: వరి పంటలో చేపలను పెంచడం ఎలా ?