Alternative Crops: రైతు రామారావు విజయగాధ.. ఖమ్మం జిల్లా, రఘునాధపాలెం మండలం, కోయచెలక గ్రామానికి చెందిన రైతు చెరుకూరి రామారావు తనకున్న 20 ఎకరాల భూమిలో వివిధ రకాల పంటలను మార్కెట్ డిమాండ్ దృష్టిలో ఏడాది పొడవునా సాగుచేస్తూ తనతోపాటు మరో 20 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారు. గతంలో ఈ రైతు వరి, పత్తి వంటి పంటలను సాగు చేసేవారు. ఈ పంటలతో వచ్చే నికర ఆదాయం తక్కువగా ఉన్న నేపథ్యంలో కష్టతరం అవుతున్నందున ఏకపంటకు బదులుగా బహుళ పంటల సాగుతో లాభాలు పొందవచ్చునని గ్రహించి రామారావు గారు వివిధ రకాల ఉద్యాన మరియు వ్యవసాయ పంటలను సాగు చేస్తున్నారు.
వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయ పంటలైన బెండ, వంగ, టమాటా అయినటువంటి బీర, సొర, కాకర, చిక్కుడు బోడ కాకర, దోస వంటి అనేక రకాల పంటలను పంట మార్పిడి విధానంలో కాలానుగుణంగా మార్కెట్ డిమాండ్ ఆధారంగా సాగు చేస్తూ అధిక లాభాలను పొందటమే కాకుండా రైతులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు రైతు రామారావు గారు. వీటితోపాటుగా సేంద్రియ విధానం, ఆధునిక సాగు పద్ధతులను ఉపయోగించడం ఈయనకున్నమరో ప్రత్యేకత.
Also Read: మహిళా రైతులు సులభంగా ఉపయోగించుకునేలా వ్యవసాయ యంత్రాలు
సాగు ఖర్చు దిగుబడి వివరాలు:
పంట దిగుబడి (క్విం) ఖర్చు స్థూల ఆదాయం నికర ఆదాయం ఆదాయ వ్యయనిష్పత్తి
టమాట 278 92,500 2,78,000 1,85,500 3:01
దొండ 210 1,15,200 3,15,000 1,99,800 2.73 :1
బెండ 284 61,250 2,27,200 1,65,950 3.71 :1
దోసకాయ 110 59,400 1,76,000 1,16,600 2.96 :1
సొరకాయ 128 59,720 2,56,000 1,96,200 4.28 :1
బోడకాకర 65 71,800 3,25,000 2,53,200 4.03 :1
కాకర 68 1,12,200 2,04,000 91,800 1.82 :1
చిక్కుడు 32 61,400 1,28,000 66,600 2.08 :1
వరి 25 27,900 48,500 20,600 1.73 :1
డా. వి. చైతన్య, డా, జె. హేమంత్ కుమార్, డా. కె. రవి కుమార్, పి.ఎస్.ఎస్ ఫణిశ్రీ, డా. జెస్సీ సునీతడబ్ల్యు, కృషి విజ్ఞాన కేంద్రం, వైరా.
Leave Your Comments