World Rainforest Day 2023: 1. అండమాన్ – నికోబార్ దీవులు (Andaman And Nicobar Islands) అండమాన్ – నికోబార్ దీవులు రెయిన్‌ఫారెస్ట్ ఉష్ణ మండల వర్షారణ్యా పందిరితో అల్లుకుపోయి ఉంటాయి. ఈ వర్షారణ్య పందిరి తీగలు అనేవి మనదేశం, మయన్మార్, మలేషియా దేశాలకు సంబందించిన స్థానిక వివిధ రకాల పుష్పాలతో, వృక్షాలతో ఈ అండమాన్ – నికోబార్ దీవులు ఏర్పడ్డాయి.
ఇప్పటివరకు, సుమారు 2,200 రకాల మొక్కలు ఉన్నట్టు నమోదు అయ్యింది. వాటిలో 200 స్థానికమైనవిగా గుర్తించారు. మిగతా 1,300 రకాల మొక్కలు ప్రధాన భూభాగం అయిన అండమాన్ – నికోబార్ దీవులలో కనిపించవు.
2. వాయువ్య కనుమలు (North Western Ghats)
మహారాష్ట్ర – కర్ణాటకలలో ఎక్కువగా వాయువ్య కనుమలు అనేవి కనిపిస్తాయి. పశ్చిమ కనుమల ఉత్తర భాగంలో మొత్తం 30,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో తేమతో కూడిన ఆకురాల్చే అడవులు ఉంటాయి.
ఈ దట్టమైన అటవీ ప్రాంతం నైరుతి మహారాష్ట్ర నుండి మొదలై దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, కేరళ రాష్ట్రాల వరకు విస్తరించి ఉంది.
Also Read: Desert Vegetable Farming: ఎడారిలో కూరగాయల సాగుకి 5 లక్షల లాభాలు ఎలా.!?
3. అస్సాం (Assam)
ఈశాన్య రాష్ట్రాలు సహజమైన అందాలకు ప్రసిద్ధి. ఇక్కడి వర్షారణ్యాలకు సంబంధించిన ఒక ప్రత్యేకత ఏమిటంటే.. ఈశాన్య ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంటూ ఎటువంటి వాణిజ్య దోపిడీకి గురికాలేదు. ఇక్కడ ప్రాంతం అంతా పర్యాటకులతో కళకలాడుతూ ఉంటుంది. ప్రధానంగా.. అడువులన్ని ఉత్తర అస్సాంలో ఉన్నాయి. అయితే నాగాలాండ్, మిజోరాం, త్రిపుర మొదలైన ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి. పిగ్-టెయిల్డ్ మకాక్, స్లో లోరిస్, వైల్డ్ ఏనుగులు, హూలాక్ గిబ్బన్లు ఇక్కడ కనిపించే కొన్ని ప్రసిద్ధ జాతులు.
4. బ్రహ్మపుత్ర లోయ (Brahmaputra Valley)
బ్రహ్మపుత్ర వ్యాలీ సెమీ-ఎవర్గ్రీన్ ఫారెస్ట్‌ల పర్యావరణ ప్రాంతం. ప్రపంచంలోని అతిపెద్ద ఏక-కొమ్ము ఖడ్గమృగాలకు మద్దతు ఇస్తుంది. కాజిరంగా నేషనల్ పార్క్‌లో అస్సాం యొక్క భారత రాష్ట్ర ప్రభుత్వంచే జాగ్రత్తగా రక్షించబడింది.
Also Read: Damask Rose Oil: ఈ పూవ్వుల నూనె కిలో 12 లక్షలు..