Call for Applications – Andhra Pradesh: రైతు సాధికారత కోసం మన వ్యవసాయ తెలుగు మాసపత్రికైన “ఏరువాక” ద్వారా ఇరు తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ సమాజానికి, అనుబంధ రంగాలకు “ఏరువాక ఫౌండేషన్” తన వంతు సహకారం అందిస్తోన్న విషయం మనందరికీ తెలిసిందే. అలాగే వ్యవసాయ రంగంలో కృషిని గుర్తించి, తదుపరి ప్రయత్నాలను ప్రేరేపించడానికి, ఏరువాక ఫౌండేషన్ వివిధ విభాగాలలో అవార్డులను ఏర్పాటు చేసింది. ప్రతి సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తున్న వ్యవసాయ కళాశాలలు మరియు వాటి అనుభంద విభాగాలలో, వ్యవసాయ కంపెనీలు, కెవికెలలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, విద్యార్థులు, పాత్రికేయులు, అగ్రి యాప్స్, సామజిక మాధ్యమాల నిర్వాహకుల మరియు సృజనాత్మక రైతుల యొక్క విశిష్టమైన సేవలను ఏరువాక ఫౌండేషన్ గుర్తించి ఈ అవార్డులను అందిస్తుంది.
అవార్డుల విభాగాలు:
1. ఉత్తమ శాస్త్రవేత్త:
అగ్రానమి
ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్
సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చరల్ కెమిస్ట్రీ
ఫుడ్ టెక్నాలజీ
మొక్కల జన్యుశాస్త్రం
వ్యవసాయ యంత్రాలు మరియు పనిముట్లు
ప్లాంట్ పాథాలజీ
ఆక్వాకల్చర్
అగ్రికల్చరల్ ఎంటమాలజీ
డెయిరీ టెక్నాలజీ
వ్యవసాయ విస్తరణ
పశువైద్యం
హార్టికల్చర్
2. ఉత్తమ రైతు:
వరి సాగు
ఆక్వాకల్చర్
పత్తి సాగు
కోళ్ల పెంపకం
మిర్చి సాగు
పుట్టగొడుగుల సాగు
చిరుధాన్యాల సాగు
సమీకృత వ్యవసాయ వ్యవస్థలు
మొక్కజొన్న సాగు
పండ్ల సాగులో ఉత్తమ సృజనాత్మక రైతు
సెరికల్చర్
కూరగాయల సాగులో ఉత్తమ మహిళా రైతు
పశు పోషణ
ఉత్తమ సృజనాత్మక రైతు
3. ఉత్తమ మిద్దె తోట పెంపకందారుడు (1వ, 2వ మరియు 3వ బహుమతులు)
4. ఉత్తమ సేంద్రియ రైతు (1వ, 2వ మరియు 3వ బహుమతులు)
5. ఉత్తమ విస్తరణ విభాగం (వ్యవసాయ మరియు అనుబంధ రంగాలు, VAA, AEO, AO, HO, SMS, మొదలగునవి)
6. వ్యవసాయ సేవలో ఉత్తమ డిజిటల్ వేదిక
(యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా ఖాతాలు)
7. ఉత్తమ వ్యవసాయ ఇ – యాప్
(వ్యవసాయానికి సంబంధించిన ఏదైనా స్ట్రీమ్ యొక్క అత్యుత్తమ మొబైల్ యాప్ లేదా ఇ కామర్స్ అప్లికేషన్ లు)
8. ఉత్తమ FPO
9. ఉత్తమ వ్యవసాయ పాత్రికేయుడు (విలేఖరి)
10. ఉత్తమ సృజనాత్మక ఆలోచన (ఇది విద్యార్థులకు మాత్రమే)i. UG – 1వ, 2వ మరియు 3వ బహుమతులు
ii. PG మరియు Ph. D – 1వ, 2వ, 3వ బహుమతులు
ఏరువాక ఫౌండేషన్ వ్యవసాయ వార్షిక అవార్డులు – 2022, ఆంధ్రప్రదేశ్.
దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ: జనవరి 31
దరఖాస్తులు పంపడం కొరకు పోస్టల్ చిరునామా:
701/J, 7వ అంతస్తు,
బాబుఖాన్ ఎస్టేట్, బషీర్ బాగ్,
హైదరాబాద్, తెలంగాణ – 500001
ఇమెయిల్ ఐడి: info@eruvaaka.com
ఫోన్ నెంబరు: 7075612969, 7075751969, 9849106633.
https://eruvaakafoundation.com/ ద్వారా ఆన్ లైన్ లో కూడా దరఖాస్తు చేస్కోవచ్చు.
కావున ఈరోజే మీ దరఖాస్తును పంపించి మీ శ్రమకు తగ్గ గుర్తింపు పొందగలరు.
దరఖాస్తు నింపటంలో లేదా మాకు పంపించే విషయంలో ఏవయిన సందేహాలు వుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు.
ఇమెయిల్ ఐడి: info@eruvaaka.com
ఫోన్ నెంబరు: 7075612969, 9849106633, 7075751969,