వార్తలు

Summer Deep Ploughs Benefits: వేసవి దుక్కులు-ప్రాముఖ్యత

0
Summer Deep Ploughs Benefits
Summer Deep Ploughs Benefits

Summer Deep Ploughs Benefits: మన రాష్ట్రంలో వర్షాధారంగా పండించేపంటలు సాగు విస్తీర్ణం, నీటి పారుదలగా పండించే పంటల సాగు విస్తీర్ణం కన్నా ఎక్కువగా ఉంది. సాధారణంగా మార్చి, ఏప్రిల్, మే నెలలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అడపాదడపా తొలకరి వర్షాలు కురుస్తూ ఉంటాయి. నీటి వసతి ఉన్న భూములు తప్ప వర్షాధారంగా పండించే భూములన్నీ వేసవికాలంలో ఖాళీగా ఉంటాయి. ఆ కాలంలో పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 30నుండి 45 సెంటిగ్రేడ్ వరకు ఉంటాయి. తొలకరి వర్షాలు కురిసినప్పుడు భూమిని లోతుగాదుక్కు చేసుకోవడం వలన భూమి పై పొరలు లోపలకి లోపలపొరలు బయటకి చేరుతాయి అంటారు.

Summer Deep Ploughs Benefits

Summer Deep Ploughs Benefits

Also Read: Ginger Farmers: అల్లం రైతుల ఇబ్బందులు

వేసవి దుక్కులకు అనుకూల పరిస్తితులు:

  •  భూమిలో నిల్వ ఉంచుకునే తేమ 25 నుండి 50% ఉన్నట్లయితే అదిదుక్కులు చేసుకోడానికి అనుకూలమైనది.
  •  భూమిలో తేమ తక్కువ ఉన్నప్పుడు దుక్కి చేసినట్లు ఇతే దుక్కి చేయడానికి ఎక్కువ శక్తి అవసరం అవటుతుంది మరియు దుక్కి కూడా బాగుండక భూమి సరిగా గుల్లబరాదు.
  • భూమిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు దుక్కి చేసినట్లయితే నాగలికి మట్టి అంటుకుంటుంది. మరియు కింద ఉన్న మట్టిని గట్టిపడి భూమిలో గట్టి పొడలు ఏర్పడతాయి. దుక్కి చేయడం అనేది భూమి లో ఉన్నతేమ పైన ఆధారపడి ఉంటుంది తేలికనేలల్లో కొంచెం ఎక్కువగా ఉన్న కూడా చేసుకోవచ్చు అయితే బరువు నేలల్లో తగినంత తేమ ఉన్నప్పుడు చేసుకోవాలి ఎక్కువ ఉన్నట్లయితే చేసుకోకూడదుదుక్కి లోతు మనం పండిచే పంటలపై ఆధారపడి ఉంటుంది . ప్రతి 3 సంవత్సరాలకి ఒక్కసారి పెద్ధ మరతో లోతు దుక్కు అనగా 30 సెంటీమీటర్ లోతు వరకు దుక్కు చేయడం మంచిది అని సిఫారసు చేయబడింది. ప్రతి సంవత్సరం వర్షాలును బట్టి 15-20 సెం. మీ లోతు వరకు దున్నుకోవాలి . సాదారణంగా తల్లి వేరువ్యవస్థ ఉన్న పంటలకు కొంచం లోతు దుక్కు అవసరం. పీచు వేరువ్యవస్థ ఉన్న పంటలకు తక్కువ లోతు దుక్కి సరిపోతుంది. తేలికపాటి నెలలో 1-3 సార్లు దున్ని తే సరిపోతుంది .కలుపు మొక్కలు మరియు అంతకు ముందు పంటల అవశేషాలు ఎక్కువగా ఉన్నట్లయితే భూమిని కనీసం మూడు దఫాలు అయినా దున్నాలి.దుక్కి చేయడానికి వాడవాల్సిన పనిముట్లు:
  • పైపైన దుక్కి చేయుటకు మామూలు నాగలి లేదా చక్రాల గుంటక కానీ వాడాలి.
  • ఎరువును భూమిలోకలియదున్నడానికి ఎద్దులతోలాగే మౌంట్ బోర్డు మరక ను వాడాలి.
  • బాగా లోతుకి చేసి నేలను తిరగతోడడానికి ట్రాక్టర్తో లాగే మౌల్డ్ బోర్డ్ మరక ను వాడాలి. అధునాతనంగా వచ్చిన ట్రాక్టర్ తో లాగే పెద్ద మడకలుకానీ రోటో వేటర్ వంటి వ్యవసాయ పనిముట్లు ఉపయోగించుకోవచ్చు.

వేసవి దుక్కుల వల్ల ప్రయోజనాలు:

  • వేసవి దుక్కులు వలన నేల బాగా గుల్లబరుతుంది. తర్వాత పడే వర్షపు నీరు వృధా కాకుండా సద్వినియోగం చేసుకోవచ్చు.
  • నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు నేలను లోతుగా వాలుకు అడ్డంగా దున్నకోవడం వల్ల నేల కోతను మరియు భూమిపై త్వరలో భూసారాన్ని కొట్టుకుపోకుండా అరికట్టవచ్చు.
  •  భూమిని ఒక అడుగు లోతు వరకు దున్నుకుంటే విత్తనం మొలకెత్తి వేర్లు సులబంగా భూమిలోకి దిగి భూమిలో ఉండే పోషకాలను గ్రహించి మొక్క పెరుగుదలకు తోడ్పపడుతుంది.
  • లోతు దుక్కులు వలన భూమిలో నీరు ఉండి తేమ శాతం పెరగడం వలన సేంద్రియ పదార్థాలు త్వరగాకుళ్ళి పోషకాల రూపంలో అందుబాటులోకి వస్తాయి.
  • భూమిలో దాగి ఉన్న చీడపీడల కోత దశలో పురుగులు, బ్యాక్టీరియా, శిలీంద్రలు, సిద్ధ బీజాలు కలుపు మొక్కల విత్తనాలు ఎండవేడికి లోనై చాలా వరకు నశిస్తాయి.
  • వేసవి దుక్కులు వలన కలుపుమొక్కలు వేళ్ళతో సహా పేకిలించబడి భూమిలో కలిసిపోతాయి మరియు సేంద్రీయ పదార్థం గా ఏర్పడతాయి.

డా .పి అమర జ్యోతి, డా.బి.మౌనిక, జి .నవీన్ కుమార్ , డా .డి.చిన్నం నాయుడు
కృషి విజ్ణాన కేంద్రం, ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా.

Also  Read: Mentha Farming: ఒక హెక్టారు మెంతి సాగులో రూ.3 లక్షల ఆదాయం

Leave Your Comments

Ginger Farmers: అల్లం రైతుల ఇబ్బందులు

Previous article

Jhora Fish Farming: జోరా టెక్నిక్‌తో చేపల పెంపకం

Next article

You may also like