Coconut Flower: ఎడారిలో కూడా ఇసుకని అమ్ముకునే వాళ్లనే వ్యాపారులు అంటారు. ఇప్పుడు వ్యాపారులు కొత్తగా కొబ్బరి పువ్వుతో వ్యాపారం చేస్తున్నారు. కొబ్బరి పువ్వు.. కొబ్బరి మొలక సమయంలో లేదా కొబ్బరి నీటిని పీల్చుకున్నపుడు మాత్రమే అందులో నుంచి పువ్వు వస్తుంది. గుడిలో కొబ్బరి కాయని కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే అదృష్టంగా భావిస్తున్నారు. కానీ ఇప్పుడు కొబ్బరి కాయలో పువ్వు వచ్చేలా సాగు చేస్తున్నారు. కొబ్బరి కాయలని కోనసీమ ప్రాంతాల్లో ఎక్కువ సాగు చేస్తారు.
ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న కొబ్బరి పువ్వు డిమాండ్ బట్టి వాటిని సాగు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ కొబ్బరి పువ్వులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. వీటిని షుగర్ రోగం ఉన్న వాళ్ళు తింటే రక్తంలో షుగర్ లెవెల్ తగ్గించుకోవచ్చు. కొబ్బరి పువ్వుని తింటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ కణాలు పెరగడం తగ్గిస్తుంది.
Also Read: SPMRM Scheme: SPMRM స్కీం ద్వారా మహిళా రైతులకి ఒక కొత్త ఉపాధి..
ఈ కొబ్బరి పువ్వుకి పెద్ద పెద్ద నగరంలో ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ బట్టి వీటిని సాగు దిగుబడిని కూడా పెంచుతున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, చెన్నై, బెంగళూరు, ముంబయి నగరాల్లో ఈ కొబ్బరి పువ్వుకి మంచి డిమాండ్ ఉంది. ఈ నగరాల్లో ఈ కొబ్బరి పువ్వుని 50-100 రూపాయలు వరకు అమ్ముతున్నారు.
కొబ్బరి కాయకంటే కొబ్బరి పువ్వుకి రెండు రేట్ల ఎక్కువ ధర ఉండటం ద్వారా రైతులు కొబ్బరి పువ్వుని సాగు చేయడానికి ఇష్టపడుతున్నారు. పెట్టుబడి ఖర్చులు అని తీసివేసిన కూడా రైతులకి కొబ్బరి పువ్వు నుంచి మంచి లాభాలు వస్తున్నాయి. కొంత మంది వ్యాపారులు వీటికి ఉన్న డిమాండ్ని చూసి రైతులతో కాంట్రాక్ట్ పద్దతిలో కొబ్బరి పువ్వులని సాగు చేస్తున్నారు.
Also Read: Korameenu Fish: కొరమీను చేపలు ట్యాంక్లో పెంపకం ఎలా.?