Success Story of Woman Seri Culturist: శ్రీమతి జి. సునీత స్వస్థలం తెలంగాణాలోని రంగారెడ్డి జిల్లా.మొదట్లో సోషల్ వర్క్ చేసిన ఆమె తరువాత వ్యవసాయం చేపట్టింది. వ్యవసాయం తరువాత సెరికల్చర్ వైపు తాను వేసిన అడుగు ఆమెకి ఆమె కుటుంబానికి మంచి పేరు ప్రశంసలు తీసుకురావడానికి ఉపయోగపడ్డాయి. ఆమె ఒక మహిళా సాధికారత శక్తిగా మలుచుకోవడానికి తోడ్పడ్డాయి.
ఆమె తన స్నేహితుల్లో ఒకరి ద్వారా సెరికల్చర్కు పరిచయమైంది. “మట్టి నుండి పట్టు” అనే కాన్సెప్ట్ ఆమెను పట్టుపురుగుల పెంపకం వైపు ఆకర్షించింది. ఇప్పుడు ఆమె కుటుంబాన్ని మాత్రమే కాకుండా వ్యవసాయం మరియు సెరికల్చర్ చూసుకుంటుంది.ఇందులో మల్బరీ సాగు దాదాపు 20 ఎకరాలలో విస్తరించి ఉంది. కుటుంబ మద్దతుతో పాటు, ఆమె ఆసక్తి, అంకితభావం, శాస్త్రవేత్తలు మరియు సాంకేతిక నిపుణుల నుండి మార్గదర్శకత్వం. పరిశోధనా సంస్థలు, రాష్ట్ర సెరికల్చర్ విభాగం నుండి ఆమెకు లభించిన ప్రేరణ పట్టు సాగులో విజయానికి దారితీసిందని ఆమె అభివర్ణించారు.
Also Read: కొబ్బరిసాగులో దూసుకెళ్తున్న ఆదర్శ రైతు మహిళా
సెరికల్చర్లోకి అడుగు పెట్టె ముందు ఆమె సెంట్రల్ సెరికల్చర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, మైసూర్ లో 10 రోజుల శిక్షణలో పాల్గొంది.తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెరికల్చర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్, కిరికెర, హిందూపూర్లో 90 రోజుల శిక్షణ తీసుకుని పట్టు పురుగుల పెంపకంలో మెళకువలు నేర్చుకున్నారు. ఆమె ప్రస్తుతం అధిక దిగుబడి ఇచ్చే విక్టరీ 1 రకంతో 8.5 ఎకరాల్లో మల్బరీ తోటను ఏర్పాటు చేసింది. ఆమె తాజాగా పట్టు పురుగుల పెంపకంలో చాకి పెంపకాన్ని చేపట్టి మంచి లాభాలు సంపాదిస్తుంది.
అతి తక్కువ నీటిని వినియోగించుకునే హ్యూమిడిఫైయర్లు, హీటర్లు, ట్రాక్టర్, బిందు సేద్యం, పవర్ స్ప్రేయర్లు ఉపయోగిస్తుంది.ఆమె ఏర్పాటు చేసిన మల్బరీ తోటలో, 3’ x 8’ అంతరం పాటించి మంచి నాణ్యత గల ఆకు దిగుబడి సాదిస్తుంది. ఆమె పట్టు పురుగుల పెంపకంలో ప్రయోగాత్మకంగా 25′ x 100′ x 18′ (వెడల్పు x పొడవు xఎత్తు) షెడ్ నిర్మించింది. అయితే చాలా మంది సెరికల్చర్ రైతులు
పెంపకం 20’x50′ x 12′ నుండి 14′ ఉన్న షెడ్ లలో చేస్తారు. ఇంటి నిర్మాణానికి ఎక్కువ ఖర్చవుతుంది కానీ ఇంటి లోపల ఉష్ణోగ్రత మరియు మంచి వెంటిలేషన్ నిర్వహణలో ప్రధాన అంశం అని ఆమె చెప్తున్నారు.ఇలా చేయడమే మిగతా రైతులకన్నా మంచి దిగుబడి సాధించడానికి కారణం అని ఆమె వివిధ కార్యక్రమాలలో అన్నారు.
ఆమె పట్టుసాగు చేపట్టిన తరువాత మునుపెన్నడూ లేని విధంగా 100 DFLలకు 100 కిలోల కంటే ఎక్కువ కోకన్ ఉత్పాదకతను నమోదు చేసింది.కానీ సగటు దిగుబడి 100 DFLలకు 75 కిలోలు. దీనికి కారణం మెరుగైన మల్బరీ ఆకు నాణ్యత మరియు మంచి పెంపక నిర్వహణ. APSSRDI, హిందూపూర్‌లో 90 రోజుల శిక్షణ తర్వాత, ఆమె నమోదిత/ లైసెన్స్ పొందిన కమర్షియల్ సెరికల్చర్ పెంపకందారు. ఆ తరువాత రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మద్దూరు గ్రామంలో ద్వారకాచాకీ పెంపక కేంద్రాన్నిఏర్పాటు చేసారు.ప్రస్తతం ఆర్డర్ల పై చాకి పెంచి రైతులకి తక్కువ ధరలలో అందిస్తున్నారు. ఆలస్యంగా సెరికల్చర్ రంగంలోకి ప్రవేశించినప్పటికీ నేటి రైతులకు ఆమె ఆదర్శం. ఆమె పట్టు సాగులో అవలంబించిన కొత్త పద్ధతులు, సాంకేతికతతో పాటు వ్యవసాయంలో ఆమె విజయం ఇతర రైతులను సెరికల్చర్ చేపట్టేలా ప్రోత్సహిస్తుంది.
Also Read: కోళ్ల పెంపకంతో లక్షల్లో సంపాదిస్తున్న మహిళా రైతులు