రైతులు

A young farmer who excels in dragon fruit cultivation : డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగులో రాణిస్తున్న యువ రైతు

0
నరాల రవి శంకర్‌ రెడ్డి, అక్కులు వారి పల్లి గ్రామం, లింగాల మండలం, కడప జిల్లా ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన యువరైతు ఒకటి  పాతిక ఎకరాలు డ్రాగన్‌ ఫ్రూట్స్‌ సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. రైతు మాట్లాడుతూ ఎకరం పాతిక పొలంలో 600 పోల్స్‌ పెట్టి ట్రెల్లిస్‌ సిస్టంలో సాగు చేస్తున్నట్టు తెలిపాడు. ఈ ట్రెల్లిస్‌ సిస్టంలో ఎకరానికి 4000 మొక్కలు పెట్టినట్టు తెలిపాడు. ఇప్పుడు ప్రస్తుతం డ్రాగన్‌ తోట వయసు ఒకటిన్నర సంవత్సరం ఈ డ్రాగన్‌ యొక్క  సీజన్‌ జూన్‌ నుంచి నవంబర్‌ వరకు వస్తుందని తెలిపారు. ప్రస్తుతానికి దిగుబడి మూడు టన్నుల దాకా వచ్చింది. ఇంకా మరో రెండు టన్నులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ డ్రాగన్‌ పండును ఎందుకు సాగు చేయాల్సి వచ్చింది అంటే వీటిలో విటమిన్స్‌, మినరల్స్‌ యాంటీ ఆక్సిడెంట్స్‌, ఒమేగా`3 Fatty Acids పుష్కలంగా ఉండడం వలన మనకు శరీరాన్ని కావలసిన అన్ని పోషకాలు అందిస్తాయని తెలిపారు.
 
ఈ రైతు మాట్లాడుతూ తాను మొక్కలు కర్ణాటక నుంచి తెప్పించినట్టు తన దగ్గర ఉన్న వెరైటీల గురించి తెలుపుతూ తైవాన్‌ పింక్‌ మరియు జంబోరెడ్‌ ఉన్నట్టు తెలిపారు. చుట్టుపక్కల ఉన్న రైతులు వచ్చి కొత్త పంటను వేసిన ఈ రైతును అభినందించారు వారు కూడా తమ పంటను వేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చిన రైతులు తాము కూడా ఈ పంట వేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ రైతు దగ్గర నుంచి మొక్కలు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రైతు మాట్లాడుతూ తన దగ్గర డ్రాగన్‌ మొక్కలు సిద్ధంగా ఉన్నాయని కావాల్సిన రైతులకు అందడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

Also Read: గోనె సంచుల కొరత సమస్యను ఎదుర్కొంటున్న రైతులు.!

కేంద్ర ప్రభుత్వం వారు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 2.50 లక్షలు సబ్సిడీ ఇస్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్‌ వారు ఎకరానికి రెండున్నర లక్షలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వారు హెక్టారుకు 36,000 సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఈ డ్రాగన్‌ పంటను మనం అతి తక్కువ వాటర్‌తో పండిరచవచ్చును. ఒక ఇంచ్‌ వాటర్‌ ఉంటే ఐదు ఎకరాల వరకు సాగు చేసుకోవచ్చు. రైతులకు చాలా లాభదాయకమైన పంట. పురుగు మందులు ఇలాంటి వాడాల్సిన అవసరం లేదు వేప నూనె స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. పురుగుమందులు స్ప్రే చేయటం కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచి పండు. నేను వేస్ట్‌ డీకంపోజర్‌ పెడచెరువులు ఇలాంటివి ఉపయోగించి డ్రాగన్‌ పండ్లను పండిస్తున్నాను.
రైతు డా. నరాల రవి శంకర్‌ రెడ్డి, ఫోన్‌ : 919441373732.
Leave Your Comments

Management practices of nematodes in banana plantation : అరటి తోటలో నులిపురుగుల యాజమాన్య పద్ధతులు

Previous article

The wrath of nature is the same whether it is a farmer or a king : ప్రకృతి కోపానికి రైతైనా, రాజైనా ఒక్కటే

Next article

You may also like