తెలంగాణ సేద్యం

జూన్ 8 నుండి 12 వరకు వరకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు?

0

Telangana Weather Report :తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు తేది : 08.06.2024 (శనివారం) నుంచి 12.06.2024 (బుధవారం) వరకు

గ్రామీణ కృషి మౌసమ్ సేవ పథకం భారత వాతావరణ శాఖ, న్యూఢిల్లీ వారి
సహకారంతో శుక్ర వారం(జూన్ 7 న) వాతావరణ సలహాలను రాజేంద్రనగర్ లోని వ్యవసాయ వాతావరణ విభాగం అందించింది. ఆ వివరాలు ..

గడిచిన మూడు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసాయి.పగటి ఉష్ణోగ్రతలు 29 నుంచి 40 డిగ్రీల సెల్సియస్,రాత్రి ఉష్ణోగ్రతలు 22 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి.

రాబోయే  ఐదు రోజుల వాతావరణ విశ్లేషణ (జూన్ 7  మధ్యాహ్నం 1 గంట ఆధారంగా):

Rain Nature Images – Browse 2,421,314 Stock Photos, Vectors, and Video | Adobe Stock

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు ఐదు రోజుల్లోతెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి.పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ మధ్య,రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు.

హెచ్చరిక:
మొదటి రోజు:
రాష్ట్రంలోని ఖమ్మం,నల్గొండ,సూర్యాపేట,రంగారెడ్డి,వికారాబాద్,సంగారెడ్డి,మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్,వనపర్తి,నారాయణపేట,జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడభారీవర్షాలుకురిసేసూచనలున్నాయి.ఆదిలాబాద్,కొమరంభీంఆసిఫాబాద్,మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి,ములుగు,భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ,సూర్యాపేట, మహబూబాబాద్. వరంగల్, హన్మకొండ, జనగాం,సిద్ధిపేట,యదాద్రి భువనగిరి,రంగారెడ్డి,హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి,వికారాబాద్,సంగారెడ్డి,మెదక్,కామారెడ్డి,మహబూబ్ నగర్,నాగర్ కర్నూల్,వనపర్తి,నారాయణపేట,జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు,ఈదురు గాలుల (గాలి వేగం గంటకు 30-40 కి. మీ) తో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి.
రెండవ రోజు:
ఆదిలాబాద్,కొమరంభీం ఆసిఫాబాద్,మంచిర్యాల,నిర్మల్,నిజామాబాద్, జగిత్యాల,రాజన్న సిరిసిల్ల,కరీంనగర్,పెద్దపల్లి,జయశంకర్ భూపాలపల్లి,ములుగు,భద్రాద్రి కొత్తగూడెం,సిద్ధిపేట,వికారాబాద్,సంగారెడ్డి,మెదక్,కామారెడ్డి,మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు,మెరుపులు, ఈదురు గాలుల (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి.
మూడవ రోజు:
రాష్ట్రంలోని ఆదిలాబాద్,కొమరంభీం ఆసిఫాబాద్,మంచిర్యాల,నిర్మల్, నిజామాబాద్,జగిత్యాల,రాజన్నసిరిసిల్ల,కరీంనగర్,పెద్దపల్లి,జయశంకర్ భూపాలపల్లి, ములుగు,సిద్ధిపేట,వికారాబాద్,సంగారెడ్డి,మెదక్,కామారెడ్డి,మహబూబ్ నగర్,నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు,ఈదురు గాలుల (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి.

నాలుగవ రోజు:
రాష్ట్రంలోని నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో  అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.

ఐదవ రోజు:
రాష్ట్రంలోని వికారాబాద్,సంగారెడ్డి,మెదక్,కామారెడ్డి,మహబూబ్ నగర్,నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.

వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు:

  • నైరుతి రుతుపవనాలు తెలంగాణరాష్ట్రంలోకి జూస్ 3వ తేదీన ప్రవేశించాయి.
  •  నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోనికి ప్రవేశించిన తరువాత తేలిక పాటి నేలల్లో 50 నుంచి 60 మి.మీ.,బరువు నేలల్లో 60 నుంచి 75 మి.మీ వర్షపాతం నమోదైన తర్వాత లేదా నేల 15-20 సెం.మీ.లోతు తడిసిన తర్వాతనే రైతులు వర్షాధార పంటలైన పత్తి,సోయాచిక్కుడు, మొక్కజొన్న,జొన్న,కంది,పెసర మొదలగు పంటలను విత్తుకోవాలి.
  •  ఉరుములు,మెరుపులతో కూడిన వర్ష సూచనలున్నందున రైతులు విద్యుత్ స్థంబాలు, విద్యుత్ తీగలు,చెరువులు,నీటి కుంటలకు దూరంగా ఉండాలి.
  • రాష్ట్రంలో అక్కడక్కడ వివిధ జిల్లాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్ష సూచనలున్నందున రైతులు చెట్ల కింద నిలబడరాదు. పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద ఉంచరాదు.
  • వర్షాధారపు పంటలను సరైన సమయంలో విత్తుకోడానికి విత్తనాలు, ఎరువులు,పురుగు మందులు సేకరించుకోవాలి.
  • ఇప్పటి వరకు కురిసిన వర్షాలను ఉపయోగించుకొని రైతులు పచ్చిరొట్ట పైర్లను (జీలుగ, జనుము,పెసర) వేసుకోవాలి.
  • కొత్త పండ్ల తోటలు పెట్టడానికి గుంతలు తవ్వుకోవాలి.

వరి:

  • నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు దీర్ఘకాలిక వరి రకాల (140-145 రోజులు) నారుమళ్ళు పోసుకోవడానికి ఇది అనువైన సమయం.
  • వరిలో 3 గ్రా. కార్బండాజిమ్ మందును కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి.
  • రైతులు తెలంగాణ సోన (RNR 15048) వరి విత్తనాన్ని జూన్ నెలలో నారుమడి పోసుకోకూడదు.

డా. పి.లీలా రాణి, ప్రధాన శాస్త్రవేత్త (అగ్రానమీ ),
వ్యవసాయ వాతావరణ విభాగం, రాజేంద్రనగర్

Leave Your Comments

వచ్చే ఐదు రోజులలో(జూన్ 1 నుండి 5 వరకు) వాతావరణం ఎలా ఉండబోతుంది? రైతులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

Previous article

PJTSAUలో జూన్ 10వ తేదీన ఆరవ స్నాతకోత్సవ వేడుకలు

Next article

You may also like