Fertilizers Adulteration: ఒక పరీక్షనాళికలో గాని, సన్న మూతి గల ఏధైనా నిలువు గాజు పాత్రలో గాని 4-5 గ్రా. ఎరువును తీసుకోని దానికి 10 మీ. లి డిస్టిల్ వాటర్ కలపాలి.
లక్షణాలు:
యూరియా: నీటిలో పూర్తిగా కరిగి రంగు లేని ద్రావణం ఏర్పడుతుంది. తాకితే చల్లగా ఉంటుంది.
అమ్మోనియం సల్ఫేట్: కొద్దిగా గోధుమ రంగులో ఉన్న ద్రావణం ఏర్పడుతుంది.
అమ్మోనియం క్లోరైడ్, మ్యూరెట్ అఫ్ పోటాష్: ఎరువులను నీటిలో బాగా కలిపితే రంగు లేని, చల్లని ద్రావణం తయారు అవుతుంది.
కాల్షియం అమ్మోనియం నై ట్రేట్: ఎరువులు నీటిలో కలిపితే మడ్డిగా, చల్లగా ఉండే ద్రావణం ఏర్పడుతుంది.
డై అమ్మోనియం ఫాస్పెట్: ఎరువును నీటిలో కలిపినపుడు అడుగుభాగాన మడ్డి ఏర్పడుతుంది.
Also Read: Cauliflower Cultivation: క్యాలిఫ్లవర్ సాగులో మెలకువలు.!
19-19-19 ద్రావణం: మడ్డిగా, చల్లగా ఉంటుంది. దీనికి గాఢ హైడ్రోక్లోరీక్ ఆమ్లం కలిపితే కొద్దిగా గోధుమ రంగులో ఉండే శుద్ధమైన ద్రావణంగా మారుతుంది.15-15-
15,28-28-0 ఎరువుల ద్రావణం: మడ్డిగా, చల్లగా గా ఉంటుంది. దీనికి గాఢ హైడ్రోక్లోరీక్ ఆమ్లం కలిపినపుడు 15-15-15 ఎరుపు గాను 28-28-0 కొద్ది పాటి గోధుమ రంగుతో శుద్ధమైన ద్రావణంగా ఏర్పడుతుంది.
సూక్ష్మ పోషకాల లోపాలు: ప్రధాన పోషకాలు వేసిన సూక్ష్మ పోషకాల లోపాలుంటే పంట దిగుబడులు తగ్గుతాయి. తెలంగాణ లో 28%, ఆంధ్రప్రదేశ్ లో 30% నేలల్లో జింకు లోపం ఉన్నట్లు గుర్తించారు. ఎకరాకు 20 కి. జింకు సల్ఫేట్ ను ప్రతి మూడు పంటలకొకసారి వేసి నివారించాలి.
పండ్ల తోటల్లో చెట్టుకు 100-200 గ్రా. జింకు సల్ఫేట్ పాదుల్లో వేసి కలపాలి. పైరు పై లోప లక్షణాలు గమనిస్తే లీటర్ నీటికి 2 గ్రా. జింక్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి. సున్నం అధికంగా ఉండే నేలల్లో, సాగు నీటిలో కార్బోనేట్లు,బైకార్బోనేట్లు అధికంగా ఉండే పరిస్థితుల్లో ఇనుప ధాతు లోపం కనిపిస్తుంది. బోరిక్ ఆమ్లం 1 గ్రా. లీ.10-15 రోజులు వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. ముందు జాగ్రత్తగా 50% బోరక్స్ వేయాలి.
Also Read: Green gram Varieties: పెసర రకాలు – వాటి లక్షణాలు.!