Soil Types for Fruits Farming – ఒండ్రు నేలలు: ఎత్తైన ప్రదేశాల నుండి వర్షపు నీటి ద్వారా నదుల్లో కొట్టుకొచ్చిన సారవంతమైన మట్టి మేటలు వేయగా ‘ఒండ్రునేలలు ఏర్పడతాయి. యివి చాలా లోతుగా, మిక్కిలి సారవంతంగాను ఉంటాయి. నీరు సులువుగా ఒడిసి పోవటం వలన ఈ నేలల్లో మురుగు నీటి సమస్య అంతగా ఉండదు. నేలలు నదీ తీరాల్లోను, డెల్టాల్లోను ఉంటాయి.
ఉదా: కృష్ణా, గోదావరి డెల్టాలు
ఈ నేలలకు అనుకూలమైన వంటలు: మామిడి, కొబ్బరి, సపోటా, పనస .
నల్ల రేగడి నేలలు: ఇవి నీటిని ఎక్కువ పట్టి ఉంచే శక్తి గల బరువైన నేలలు, వర్షం పడిన తర్వాత నీరు త్వరగా ఇంకదు. నేల త్వరగా అరదు, గాలి ప్రసరణ తక్కువ, నేల ఎండినప్పుడు బీటలు వారి, దున్నినప్పుడు పెద్దమట్టి వెళ్ళలుగా వస్తుంది. ఇది పండ్ల సాగుకు పనికి రావు,
గుల్లరాతి నేలలు: ఇవి గుల్లగా, తేలికగా ఉండే రాతినేలలు, నీరు సులువుగా ఇంకి పోతుంది. భూసారం తక్కువ, అధిక వర్షపాతం ఉండే చోట్ల ఆమ్ల గుణం కలిగి ఉంటాయి. మన దేశం పశ్చిమ తీర ప్రాంతంలో ఈ రకం నేలలు ఎక్కువగా ఉన్నాయి. తగినంత ఎరువులు వేసి కొబ్బరి, మామిడి, పోక, పనస, అనాస వంటి తోటలను పెంచవచ్చు.
ఎర్రనేలలు: ఇవి ఇటుక ఎరుపు రంగులో, గుల్లగా, తేలికగాను, ఖనిజ లవణాలు తక్కువగా ఉంటాయి. ఈ నేలలు తటస్థంగా లేదా కొద్దిగా ఆమ్లత్వంతో ఉంటాయి. అనువైన పంటలు – బత్తాయి, నారింజ, నిమ్మ, ద్రాక్ష
గరప నేలలు: ఇవి గోధుమ/బూడిద/కొద్దిగా ఎరుపు రంగులో గాని ఉండే తేలిక నేలలు, ఇనుకపాలు ఎక్కువ. దక్కను పీఠభూమిలో ఈ నేలలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణా ప్రాంతంలో వీటిని చెల్కా నేలలంటారు.
అనువైన పంట: ద్రాక్ష,
సేంద్రియ నేలలు: అడవుల్లో చెట్ల క్రింద ఆకు/రెమ్మపూలు పండ్లు వడి కుళ్ళి ఈ రకమైన నేలలు ఏర్పడతాయి. ఇవి చాలా సారవంతమైనవి. మన రాష్ట్రంలో అరకులోయ, రంపచోడవరం వంటి ప్రాంతాలలో ఇలాంటి నేలలు అక్కడక్కడ ఉన్నాయి.
అనువైన పంటలు: కాఫీ, తేయాకు, రబ్బరు, సింకోనా పలకాలు, మిరియాలు, దాల్చిన, వెనిల్లా 7. ఇసుక నేలలు: ఈ నేలల్లో ఇసుక పాలు ఎక్కువ, నీరు నిలువదు; నీరు, లవణాలు సులువగా లోపలి పొరల్లోకి జారిపోతాయి. భూసారం తక్కువ అందువల్ల సాగునీరు, ఎరువులు ఎక్కువగా, విడతలుగా వాడాలి.
అనువైన పంటలు: జీడిమామిడి, నేరేడు, సపోటా, కొబ్బరి, కుంకుడు, నరుగుడు.
భూసార పరీక్ష: పంట పొలాల నుండి మట్టి నమూనాలను సేకరించి వాటిని ప్రయోగశాలల్లో భౌతిక, రసాయనిక పద్ధతుల్లో విశ్లేషించి నేలలో ఉన్న వివిధ రకాల మూలకాల పరిమాణం, నేల భౌతిక పరిస్థితిని అంచనా వేసే పద్ధతిని భూసార పరీక్ష అంటారు.
అధిక దిగుబడులను సాధించడానికి భూసార పరీక్షలు దోహదపడతాయి. రైతుల పొలాలనుండి సేకరించి. పంపిన మట్టి నమూనాలను ప్రభుత్వ భూసార పరీక్షకేంద్రాల్లో నామమాత్రం రుసుం తీసుకొని పరీక్షలు జరిపి వరాలను ఒక కార్డులో పొందు పరచి రైతుకు అందిస్తాయి.
మట్టి నమూనా సేకరణ: ఒక పొలం నుండి (ఎకరాకు) 5-6 నమూనాలు సేకరించి పంపాలి. ఏక వార్షిక పంటలు వేసే భూమి | నుండి 6 అంగుళాల లోతు వరకు ఉండే మట్టిని నమూనాగా తీయాలి. కానీ పండ్ల చెట్లు వేసే పొలంలో ప్రతి అడుగు లోతుకు ఒక నమూనా చొప్పున 4-5 అడుగుల లోతు వరకు నమూనాలను విడివిడిగా సేకరించాలి.
మట్టి నమూనా సేకరణకు ప్రభుత్వ వ్యవసాయశాఖ సిబ్బంది, (A.O/H.O) పంచాయితీ సమితిల్లోని వ్యవసాయ విస్తరణ సిబ్బంది (AEO), వ్యవసాయ విశ్వ విద్యాలయం విస్తరణ విభాగ సిబ్బంది / ఏరువాక కేంద్రాలు రైతులకు సహకరిస్తారు. నమూనాలు ప్రయోగశాలకు చేరిన తర్వాత వాటిని రిజిష్టరు చేసుకొని, ఆరబెట్టి, మెత్తని పొడిగా చేసి పరీక్షలు జరిపి వివరాలు పట్టిక రూపంలో పొందు పరచి, రైతుకు అందచేస్తారు.
ఉదజని సూచిక, లవణాల మరియు కర్బన శాతం, నత్రజని, భాస్వరం, పొటాష్ లభించే మోతాదు వివరాలు, అందచేస్తారు.పి. హెచ్ 7.0 కంటే ఎక్కువ ఉంటే క్షారత్వపు నేలలు అనీ, 7.0 కంటే తక్కువ వుంటే ఆమ్లత్వపు నేలలు అనీ అంటారు. నేలలోని రసాయన మోతాదులననుసరించి క్షారత్వపు నేలలకు జిప్సం ను, ఆమ్లత్వపు నేలలకు సున్నం వాడి ఆ నేల ఉదజని సూచికను తటస్థ స్థితికి తీసుకు రావటం ద్వారా పంట పెరుగుదల / దిగుబడులను పెంచుకోవచ్చు.