Soil Conservation Measures – కాంటూర్ గోతులు: కాంటూర్ రేఖ వెంబడి చిన్న కాలువను నిర్మించి ప్రవాహ వేగాన్ని అరికట్టవచ్చు. కాల్వలో నిలచిన నీరు నేల క్రింద పొరల లోనికి ఇంకి పోతుంది. కాలువ పరిమాణం 60 సెం. మీ వెడల్పు, 30 సెం. మీ లోతు ఉండునట్లు చెయ్యాలి. కాలువకు కాలువకు మధ్య దూరం 50-60 మీ ఉండేటట్లు. చీడు పొలాలలో వాలు బాగా ఉన్న చోట్ల కాంటూర్ ట్రెంచ్ వెయ్యాలి.
కాంటూర్ సాగు: దున్నడం, విత్తడం, అంతర కృషి, వంటి పొలం పనులను వాలుకు అడ్డంగా కాంటూర్ రేఖ వెంబడి జరిపి తేమను సంరక్షించడమే కాంటూర్ సాగు ముఖ్య ఉద్దేశ్యం. దీని వలన ఎక్కువ నీరు నేలలో ఇంకి అధిక దిగుబడులకు దోహద పడుతుంది. దీని వల్ల 10 శాతం దిగుబడులు పెరుగుతాయి.
పీలిక సాగు: నేల కోతను అనుమతించే పంటను కొంత మేర, నేల కోతను నిరోధించే ఇంకొక పంటను వాలుకు అడ్డంగా ఒక పైరు తర్వాత ఇంకొక పైరు ను వేయడమే “పీలిక సాగు” అంటారు. వేరు సెనగ, సోయా చిక్కుడు, నేల కోత ను నిరోధించు పంటలు, జొన్న, సజ్జ, కంది, ఆముదాలు నేల కోతను అనుమతించే పంటలు. నేల కోతను అనుమతించే పంటల నుండి కొట్టుకు వచ్చే మట్టిని నేల కోత నిరోధించే పంట ఉన్న పీలిక పట్టి ఆపేటట్లు గా ఒకటి విడిచి ఇంకొకటి వెయ్యాలి. అందువలన ప్రవాహ వేగం తగ్గించి ఎక్కువ నీరు భూమి లోనికి ఇంకిపోవు తుంది. అంటే కాక అది పంట మార్పిడి, మిశ్రమ పంటల లాభాలను సాధించవచ్చు.
Also Read: Soil Erosion: నేల కోత వల్ల జరిగే నష్టాలు.!
తక్కువ కాలం లో త్వరితం గా పెరిగి నేలను కప్పి పంటలు వేయడం: పంట త్వరగా పెరిగి నేలను కప్పి వేసే పంట వలన వర్షపు బుడుగుల ప్రత్యక్ష తాకిడిని తగ్గించి, ఎక్కువ నీరు నేలలోనికి ఇంకేటట్లు చేస్తుంది.
చదును చేయుట: భూమిని చదును చేయటం వలన నీటి వేగం తగ్గి నీరు నేల క్రింది పొరలలోనికి ఇంకి ఎక్కువ కాలం పంటకు ఉపయోగపడుతుంది. తక్కువ వాలు కల్గిన పొలాలను చదును చేయటం మంచిది. ఎక్కువ వాలు ఉన్న భూమిలో చదును చేస్తే పై సారవంతమైన మన్ను తొలగించ బడి ఉత్పాదకత తగ్గిపోతుంది.
దున్నే చర్యలు: లోతుగా దున్నుట వలన నేలలో నీరు బాగా ఇంకి పంటకు ఉపయోగపడుతుంది. నల్ల రేగళ్ళ లో కొంత లోతులో ఏర్పడే గట్టి పొరలు లోతు దుక్కి వలన చీల్చ బడి వర్షపు నీరు బాగా ఇంకుటకు తోడ్పడుతుంది. వేసంగి లో లోతుగా దున్నడం వలన గరిక, తుంగ వంటి బహు వార్షిక, సమస్యాత్మక కలుపు మొక్కలను అదుపు లో పెట్టవచ్చు. కాని లోతుగా మరియు ఎక్కువ సార్లు దున్నడం వలన ఖర్చు తో బాటు సేంద్రియ పదార్ధం ఆక్సీకరణం జరిగి నేలలో సేంద్రియ పదార్ధ నిల్వలు తగ్గుతాయి. అందువలన శూన్య దున్నటం zero tillage) చేపట్టినపుడు కలుపు మొక్కల నివారణకు చర్యలు తీసుకోవాలి. కనిష్ట దున్నటం లేదా శూన్య దున్నటం వల్ల నేల కోత నిరోధించ బడి ఎక్కువ నీరు నేలలోనికి ఇంకి, నేల కోత నిరోధించ పడుతుంది.
Also Read: Problematic Soils: సమస్యాత్మక భూముల యాజమాన్యం ఎలా చేపట్టాలి.!